breaking news
higher officer
-
అవినీతికి తాతలాంటోడు..!
బీజింగ్: చైనాలో అతడో ఉన్నతాధికారి. కమ్యూనిస్టు పార్టీ నేత.. అతడి అవినీతికి అంతే లేకుండా పోయింది. ఇటీవల జరిపిన అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడుల్లో కళ్లు బైర్లు కమ్మేలా ఆ అధికారి సంపాదన బయటపడింది. ఇంతకీ ఆ అవినీతి సొమ్ము ఎంతో తెలుసా.. రూ.4,500 కోట్ల విలువైన 13.5 టన్నుల బంగారం, రూ.2.65 లక్షల కోట్లు.. మన దేశంలోని రెండు చిన్నపాటి రాష్ట్రాల ఏడాది బడ్జెట్ మొత్తం ఇది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం చైనాలోనే అత్యంత సంపన్నుడైన జాక్‌మా సంపాదన కన్నా అధికం. హైనన్ ప్రావిన్స్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న జాంగ్ కీ (58) ఇంట్లో ఇటీవల అధికారులు సోదాలు జరపగా.. టన్నుల కొద్దీ బంగారం బిస్కెట్లు కుప్పలు తెప్పలుగా దొరికాయి. ఇతడి బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.2.65 లక్షల కోట్ల అవినీతి సొమ్మును గుర్తించారు. ఇవే కాకుండా లంచం కింద విలాసవంతమైన విల్లాలను పలువురి నుంచి భారీగా తీసుకున్నట్లు తెలిసింది. బంగారాన్ని వ్యక్తి లెక్కిస్తున్న ఓ వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై చైనాలో నిషేధం విధించారు. తూర్పు చైనాలో పుట్టిన జాంగ్.. 1983లో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. హైవాన్ ప్రావిన్స్‌లోని సాన్యా సిటీ డిప్యూటీ మేయర్‌గా, డాంగ్జో సిటీ మేయర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ హైకో సిటీ సెక్రటరీగా కూడా పనిచేశాడు. 2012లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక అవినీతికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకొచ్చారు. గత ఏడేళ్లుగా భారీగా అవినీతికి పాల్పడిన దాదాపు 53 మంది అధికారులు పట్టుబడ్డారు. ఈ ఏడాదిలో జాంగ్‌తో పాటు 17 మంది అవినీతి తిమింగలాలు చిక్కాయి. -
ఎయిరిండియాలో కీచకపర్వం
న్యూఢిల్లీ: ఎయిర్ఇండియాలో ఓ ఉన్నతాధికారి గత ఆరేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ ఎయిర్‌హోస్టెస్ ఏకంగా ప్రధాని మోదీకి, విమానయానమంత్రి సురేశ్‌కు ఫిర్యాదుచేశారు. ‘ఎయిర్ఇండియాలో ఉన్న ఆ సీనియర్ అధికారి నన్ను లైంగికంగా లోబర్చుకునేందుకు చాలాసార్లు యత్నించాడు. ఇతర మహిళా సిబ్బంది గురించి నాతో అసభ్యంగా మాట్లాడేవాడు. అతనికి లొంగకపోవడంతో నా ప్రమోషన్లు, ప్రయోజనాలను నిలిపివేసి ఆరేళ్లుగా హింసిస్తున్నాడు’ అని మే 25న రాసిన లేఖలో బాధితురాలు పేర్కొంది. మంత్రి ప్రభును కలుసుకునే అవకాశం ఇస్తే సదరు అధికారి పేరును వెల్లడిస్తానని తెలిపింది. గతేడాది ఆగస్టులో ఆ మానవమృగంపై ఎయిరిండియా సీఎండీకి ఫిర్యాదుచేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ప్రభు ఎయిరిండియా సీఎండీని ఆదేశించారు. విచారణ కమిటీకి ఆదేశించారు. -
..అయితే ఓకే!
– నీరు–చెట్టు పేరుతో దోపిడీకి ఎత్తుగడ – నాలుగు నెలలుగా 73 పనులకే అనుమతులు – రెండు రోజుల్లో ఏకంగా 1600 పనులకు ప్రతిపాదనలు – ఉన్నతాధికారి బదిలీ సమాచారంతో హడావుడి – నోట్ల కట్టలతో తిరుగుతున్న టీడీపీ నాయకులు – కొందరు ఇంజినీరింగ్ అధికారులతో ఒప్పందాలు! – వాటాలు కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం కర్నూలు సిటీ: జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి బదిలీ అవుతున్నారనే సమాచారంతో టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. అక్రమార్జనకు ఆదాయ వనరుగా ఉన్న నీరు- చెట్టు పనులను దక్కించుకునేందుకు యత్నాలు మొదలు పెట్టారు. కొందరు ఇంజినీరింగ్ అధికారులతో ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఓ అధికారి అంతా తానే చేస్తున్నట్లు.. డబ్బులిస్తే పని అయిపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. పనుల కోసం భారీ ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ నాయకులు..వాటాలు ఇస్తామంటూ ఏకంగా నోట్ల కట్టలను పట్టుకొని తిరగడం చర్చనీయాంశమైంది. నీరు- ప్రగతి, నీరు- చెట్టు.. దశాబ్దాలుగా చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, వాగుల్లో పేరుక పోయిన పూడిక తీసి భూగర్భజలాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు. వీటిలో నీరు–చెట్టు కింద చేపడుతున్న పనులు అధికార పార్టీ నేతలకు, కొందరు అధికారులకు ఆదాయ వనరులుగా మారాయనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచి నీరు–చెట్టు కింద పూడిక తీత పనులకు ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో సాంకేతిక గణాంకాల ఆధారంగా అంచనాలు ఉంటేనే అనుమతులు ఇస్తున్నారు. సమావేశాల్లో టీడీపీ నేతలు ఈ విషయంపై అడిగితే ప్రతిపాదనలు తీసుకొని అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. జనవరి నెల నుంచి సుమారు 920 పనులు ప్రతిపాదనలు చేస్తే కేవలం 73 పనులకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. అయితే ఇటీవల జిల్లా ఉన్నతాధికారి బదిలీ అవు తున్నారనే సమాచార నేపథ్యంలో రెండు రోజుల నుంచి జలమండలిలో నీరు–చెట్టు పనుల ప్రతిపాదనల హడావిడి నెలకొంది. దోపిడీకి ఎత్తుగడ...! జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ పరిధిలో కర్నూలు, నంద్యాల డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 157 చెరువులు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 477 చెరువులు ఉన్నాయి. గత రెండేళ్లుగా చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, వాగుల్లో పేరుకపోయిన పూడిక తీసేందుకు నీరు–చెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జిల్లా నుంచి ఉన్నతాధికారి బదిలీ అయ్యే అవకాశం ఉండడంతో సదరు అధికారికి ప్రతిపాదనల పైళ్లను కుప్పలు తెప్పలుగా పంపుతున్నారు. దీనికితోడు ఓ అధికారి అంతా తానే నడిపిస్తున్నట్లు మీరు ప్రతిపాదనలు ఇవ్వండి ఓకే చేయిస్తానని హామీ ఇస్తున్నారు. ఇందుకు అంచనాలపై అనుమతి వచ్చిన వెంటనే ఒక శాతం ఇవ్వాలని ఒప్పంద చేసుకుంటున్నారు. రెండు రోజుల్లోనే చిన్న నీటి పారుదల శాఖ కర్నూలు డివిజన్ పరిధిలోని మండలాల్లో నుంచి సుమారు 1600 పనులకు అనుమతులు తీసుకునేందుకు ఉన్నతాధికారిని కోరినట్లు తెలిసింది. నంద్యాల డివిజన్ నుంచి కూడా సుమారు వెయ్యికి పైగా పూడికతీత పనుల జాబితా తయారు అవుతున్నట్లు ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు. ఇందులో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచే 500 పనులకు అనుమతులు కోరే అవకాశం ఉంది. తాత్కలిక ఒప్పందాలు...! నీరు–చెట్టు కింద చేపట్టే పూడికతీత పనులకు సంబంధించి అంచనాలు తయారు చేసే దగ్గర నుంచి చేసిన పనికి బిల్లు చేసే వరకు వాటాల విషయంలో తాత్కలిక ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అంచనాలు వేసి, అనుమతులు తీసుకవచ్చేందుకు ఒక శాతం, అగ్రిమెంట్ చేసేందుకు 0.5 నుంచి 1శాతం, పనికి బిల్లు చేసేందుకు ఒక్కో చోట ఒక్కో శాతం వాటాగా నిర్ణయించారు. కొంత మంది ఇంజినీర్లు ఏకంగా ‘మీ మండలంలో పనులకు అంచనాలు వేసి, అనుమతులు తీసుకునేందుకు కొంత నగదు ఖర్చు పెట్టుకోండి మీకెన్ని పనులు కావాలో చెప్పండి’’ అంటూ నేరుగా మండల స్థాయిలోని టీడీపీ నాయకులతో బేరం కుదుర్చుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు అధికార పార్టీ నాయకలు నోట్ల కట్టలతో కర్నూలు చేరుకోవడం చర్చనీయాంశమైంది. అవన్నీ ఆరోపణలే – ఎస్.చంద్రశేఖర్‌రావు, పర్యవేక్షక ఇంజనీర్, జలవనరుల శాఖ నీరు–చెట్టు కింద పూడికతీత పనులు చేపట్టేందుకు పక్కాగా అంచనాలకే అనుమతులు కోరుతున్నాం. ఎక్కడా చిన్న తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే ఇంజినీర్ల నుంచి భారీగా పనులకు అంచనాలు వస్తున్న మాట వాస్తవమే. అన్ని విధాలుగా కరెక్టుగా ఉంటేనే అనుమతులిస్తామని ఏఈలకు సూచిస్తున్నాం. పనులకు సంబంధించి ఎలాంటి వాటాలు లేవు. అవన్నీ ఆరోపణలే. -
కృష్ణా జిల్లాలో వేధింపులకు కేరాఫ్‌గా మారిన బాస్