హైదరాబాద్‌లో ఇండ్ఎక్స్పో ప్రారంభం
5వేల పైచిలుకు భారీ యంత్రాలు, పరికరాల ప్రదర్శన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారీ యంత్రాలు, పరికరాలకు సంబంధించిన పారిశ్రామిక ఎగ్జిబిషన్ ఇండ్ఎక్స్పో గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే ఈ ఎక్స్పోను ఎల్అండ్టీ ఇన్ఫోసిటీ సీవోవో కూన శంకర్ ప్రారంభించారు. పారిశ్రామిక రంగంలో ఆటోమేషన్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. విద్యుత్ ఆదా చేసే యంత్రపరికరాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. మరోవైపు, రాబోయే రోజుల్లో ఉత్పత్తుల తయారీకి సంబంధించి 3డీ ప్రింటర్లు పెను మార్పులు తీసుకురాగలవని 3డీ మ్యాక్ఇన్ఫోటెక్ సంస్థ ఎండీ సుభాశ్ చెప్పారు.
ప్రోటోటైప్ ఉత్పత్తుల ప్రింటింగ్ కోసం అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సర్వీసులు ఉపయోగించుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్‌లో రెండు ప్రింటర్లు ఇన్స్టాల్ చేశామన్న సుభాశ్.. ఈ టెక్నాలజీని తెలుగు రాష్ట్రాలు ఇంకా అందిపుచ్చుకోవాల్సి ఉందని తెలిపారు. జర్మన్ సంస్థ జియస్తో పాటు ప్రో ఆర్క్ మొదలైన వంద పైగా సంస్థలు .. అరుుదు వేల పైచిలుకు వివిధ పరికరాలు, బేరింగ్స, ఇండస్టియ్రల్ ఆటోమేషన్ ఉత్పత్తులు, గేర్ బాక్స్‌లు, ఎలక్టిక్రల్స్ మొదలైనవి ఇందులో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఎక్స్పో ద్వారా వచ్చే ఏడాది కాలంలో సుమారు రూ. 500 కోట్ల మేర విక్రయాలు నమోదు కాగలవని ఆశిస్తున్నట్లు ఇండోర్ ఇన్ఫోలైన్ సంస్థ ఎండీ ఆర్కే అగర్వాల్ తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు పదివేల మంది పైగా సందర్శకులు ఎక్స్పోను సందర్శించవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.