breaking news
Healthcare system
-
వైద్య రంగంలో కృత్రిమ మేధ విస్తరణ
టెక్నాలజీ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో సాంకేతికత పాగా వేస్తోంది. అందుకు చాలానే కారణాలున్నాయి. ఇండియాలో కొన్ని సర్వేల ప్రకారం 1,457 మంది రోగులకు ఒక డాక్టర్ ఉన్నారు. కానీ ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన డాక్టర్-రోగుల నిష్పత్తి 1:1,000 కంటే చాలా తక్కువ. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో లక్షల మందికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కరవవుతున్నాయి. కాబట్టి ఈ రంగంలో సేవలు విస్తరించాలంటే సాంకేతికత కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అత్యవసరం. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తోంది. దీని సాయంతో వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.ఉదాహరణకు.. ఒడిశాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఏఐ సాయంతో వైద్యం నిఫారసు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లతో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు దగ్గు రికార్డింగ్‌లను విశ్లేషించడం ద్వారా క్షయ(టీబీ) కేసులను గుర్తించారు. అదే నేపథ్యంలో కొన్ని వేల మామోగ్రామ్లపై శిక్షణ పొందిన మరొక ఏఐ యాప్ రొమ్ము క్యాన్సర్ కేసులను గుర్తించడంలో సహాయపడింది. ఇది రిమోట్‌గా ఆంకాలజిస్టులతో మమేకమై రోగులకు సలహాలు ఇస్తోంది.వ్యాధిని గుర్తించడంలో కీలకండయాగ్నోస్టిక్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించింది. ఉదాహరణకు.. గూగుల్ డీప్ మైండ్ రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడంలో 99% కచ్చితత్వాన్ని చేరుకుందని కొన్ని రిపోర్ట్‌ల ద్వారా తెలుస్తుంది. కంటి వ్యాధులు, చర్మ క్యాన్సర్, అల్జీమర్స్ వంటి నాడీ పరిస్థితులను గుర్తించడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. చెస్ట్ ఎక్స్-రే రిపోర్ట్‌ల నుంచి టీబీని నిర్ధారించడంలో ఏఐ సాధనాలు మెరుగ్గా పని చేస్తున్నాయి. వ్యాధిని వేగంగా గుర్తించడంతో ముందస్తు చికిత్స అందుతుంది. ఇది ట్రీట్మెంట్ ఫలితాలను మెరుగుపరచడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ నిపుణులపై ఒత్తిడిని తగ్గిస్తుంది.రియల్ టైమ్ మానిటరింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల ద్వారా హైపర్-పర్సనలైజ్డ్ మెడిసిన్‌కు అవకాశం ఉంటుంది. ఇందులో ఉపయోగించే అల్గారిథమ్‌లు నిర్దిష్ట మందులకు ప్రత్యేకంగా రోగులు తమ వ్యక్తిగత జీవన విధానాన్ని అనుసరించి ఎలా స్పందిస్తారో అంచనా వేస్తాయి. ఇది ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ ఆధారిత వేరబుల్ పరికరాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నాయి. సంభావ్య సంక్షోభాల గురించి వైద్యులు లేదా సంరక్షకులను అప్రమత్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: నెట్వర్క్ విస్తరణలో అమెజాన్ -
వైద్య వ్యవస్థలపై సైబర్ నేరగాళ్ల కన్ను
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక సైబర్ దాడులు భారత్‌పైనే జరుగుతుండగా.. అందులోనూ వైద్య వ్యవస్థలపైనే అత్యధికంగా సైబర్ దాడులకు నేరగాళ్లు తెగబడుతున్నారు. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ నివేదిక–2025 పేరిట ప్రముఖ సైబర్ సెక్యూరిటీ చెక్‌పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ విడుదల చేసిన నివేదిక భారత్‌లో సైబర్ దాడుల తీవ్రతను వెల్లడించింది. నివేదిక ఏం చెప్పిందంటే..2023తో పోలిస్తే 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు 44శాతం పెరిగాయి. ప్రపంచంలోని కీలక మౌలిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోని మౌలిక వ్యవస్థలపై సగటున వారానికి 1,847 సైబర్ దాడులు జరిగాయి. భారత్‌లో మాత్రం అంతకు మూడు రెట్లు సైబర్ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని మౌలిక వ్యవస్థలు సగటున వారానికి 3,291 సైబర్ దాడుల బారిన పడటం గమనార్హం. రెండో స్థానంలో విద్యారంగంభారత్లో వైద్య రంగమే అత్యధికంగా సైబర్ దాడుల బారినపడింది. సైబర్ నేరగాళ్లు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలపై సగటున వారానికి 8,614 సైబర్ దాడులకు తెగబడ్డారు. సగటున వారానికి 7,983 సైబర్ దాడులతో విద్యారంగం రెండో స్థానంలోనూ, 4,731 దాడులతో రక్షణ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. 2024 మే నెలలో భారత్ అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడింది. ఆ ఒక్క నెలలోనే వేలిముద్రలు, ఫేషియల్ స్కాన్లతోసహా ఏకంగా 500 జీబీ బయోమెట్రిక్ డేటా చౌర్యానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సహా దేశంలోని ప్రముఖ వైద్యసంస్థలు సైబర్ దాడులతో హడలెత్తిపోయాయి. వైద్య సంస్థల్లోని రోగుల వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు.జెన్ ఏఐని వినియోగించి..జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) ద్వారా సైబర్ నేరగాళ్లు యథేచ్చగా సైబర్ దాడులకు తెగబడుతున్నారు. జెన్ ఏఐ ద్వారా దుష్ప్రచారం, డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి సైబర్ దాడులకు పాల్పడటంతోపాటు బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొట్టడం, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు యత్నించారు. ప్రధానంగా రిమోట్ యాక్సెస్ ట్రోజన్ల ద్వారా ఫేక్ అప్డేట్లతోనే ఈ సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. మొత్తం సైబర్ దాడుల్లో 58 శాతం ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడినవే కావడం గమనార్హం. -
వైద్య అనుబంధ వృత్తి విద్య బలోపేతం
♦ ఏడు కోర్సుల్లో ప్రమాణాల పెంపు ♦ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేలా సిలబస్ ♦ కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వైద్య అనుబంధ ఆరోగ్య వృత్తి విద్యా కోర్సులకు దశలవారీగా ప్రమాణాలను పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సిలబస్‌ను దశలవారీగా మార్పు చేయాలని భావిస్తోంది. వైద్య అనుబంధ ఆరోగ్య రక్షణ వ్యవస్థలో దాదాపు 50 వరకు ఆరోగ్య వృత్తి కోర్సులున్నాయి. వాటిల్లో ప్రధానంగా డయాలసిస్ థెరపి, మెడికల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, ఫిజియోథెరపి, రేడియో థెరపి టెక్నాలజీల్లో ప్రమాణాలను పెంచాలనేది లక్ష్యంగా పేర్కొంది. అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా... అంతర్జాతీయంగా వైద్య రంగంలో అనేక మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చి చేరుతున్నాయి. దీనికి అనుగుణంగా మారకపోతే వెనుకబడిపోయే ప్రమాదముందని కేంద్రం భావిస్తోంది. పైన పేర్కొన్న వైద్య వృత్తి కోర్సుల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. వైద్యంలో రోగ నిర్దారణ కీలకమైన అంశం. రోగ నిర్దారణ ఆధునిక టెక్నాలజీపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో వైద్య చికిత్స విజయవంతం కావాలంటే అనుబంధ ఆరోగ్య వృత్తి నిపుణుల పాత్ర కీలకం. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలంటే వీరి సామర్థ్యంపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య వృత్తి నిపుణులకు అందుతున్న విద్య, శిక్షణపై దృష్టి సారించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ దేశంలో అందుకు తగ్గట్లుగా ఆరోగ్య వృత్తి నిపుణుల వ్యవస్థ బలంగా లేదని కేంద్రం భావిస్తోంది. డాక్టర్ల చుట్టూనే హెల్త్‌కేర్ వ్యవస్థ తిరుగుతోందని పేర్కొంది. ప్రైవే టీకరణతో జేబులు గుల్ల వైద్య, ఆరోగ్య అనుబంధ రంగాలు ప్రైవేటీకరణ బాటలోనే నడుస్తున్నాయి. వైద్య చికిత్స కంటే కూడా రోగ నిర్దారణ, చికిత్స అనంతరం అందే వైద్యసేవలు ఖర్చు తో కూడిన వ్యవహారంగా మారింది. వైద్యులు కూడా అవసరం ఉన్నా లేకున్నా రోగ నిర్దారణ పరీక్షలు చేయించాలని రోగులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రోగులు అప్పులు చేసి పరీక్షలు చేయించుకుంటున్నారు. అందువల్ల అనుబంధ ఆరోగ్య వృత్తి కోర్సుల్లో అనేక మార్పులు చేయనున్నారు. -
తమిళనాడుకు కేబినెట్ సబ్‌కమిటీ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో ఆరోగ్య వ్యవస్థను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర కేబినెట్ సబ్‌కమిటీ గురువారం బయలుదేరింది. ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం తమిళనాడులోని కాంచీపురం, తిరుపుక్కజీ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శిస్తారు. శనివారం ట్రిప్లికేన్‌లో 108, 104 సర్వీసుల నిర్వహణ, ఒమండురార్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించడంతో పాటు అక్కడే జరిగే ఆరోగ్య బీమా సదస్సులోనూ పాల్గొంటారు.