breaking news
health spending money
-
ఈ అనితను ఆదుకోరూ!!
-
ఈ అనితను ఆదుకోరూ!!
అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి బారిన పడింది. మంచంపట్టిన ఆమె పేరు అనిత. ఉన్నత విద్యావంతురాలైన అనితకు రెండేళ్ల క్రితం సిస్టమాటిక్ లూపస్ ఎర్తమాటీస్ అనే వ్యాధి సోకింది. దాంతో ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. ఈ జబ్బు అత్యంత ప్రమాదకరమైనదని, అరుదుగా వస్తుందని వైద్యులు చెప్పారు. ఇల్లు చక్కబెట్టాల్సిన ఇల్లాలు మంచం పట్టడంతో భార్యను బతికించుకోవడానికి భర్త పడరాని పాట్లు పడుతున్నాడు. వైద్యం కోసం దాతలు సాయం చేస్తే తన భార్య బతుకుతుందని వేడుకుంటున్నాడు. ఈ జబ్బుతో బాధపడుతున్న అనితకు.. తాగుతున్న నీరు జీర్ణం కావటం లేదు. వారానికి ఐదు లీటర్లు అలాగే కడుపులో ఉండిపోవడంతో ప్రత్యేక పరికరాల ద్వారా తీయాల్సి వస్తోంది. ఆరేళ్ల క్రితం అనితకు-నారాయణకు పెళ్లి జరిగింది. వీరికి కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఎమ్ఏ బీఎడ్ పూర్తిచేసిన అనిత- నారాయణ ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా పనిచేసేవారు. ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కలలు కన్నారు. కానీ ఇప్పుడీ వ్యాధి అనితను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. దీని వల్ల ఆమె అవయవాలన్నీ క్రమేణా బలహీనంగా మారుతాయి. తరచు జ్వరం, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు వస్తుంటాయి. హైదరాబాద్, బెంగుళూరు, వేలూరు వంటి ఆసుపత్రుల్లో చికిత్స చేయించిన అనిత కుటుంబీకులు ఉన్నవన్నీ అమ్మి... దాదాపు పది లక్షల వరకు ఖర్చు పెట్టారు. ప్రతినెలా సుమారు 4 లక్షల విలువైన ఇంజెక్షన్ వేసుకుంటేనే వ్యాధి నియంత్రణలో ఉంటుందని, తర్వాత అరుదైన ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు మొత్తం 12 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. అనిత ఆపరేషన్ కోసం రూ. 12 లక్షలు ఎలా సమకూర్చుకోవాలో అర్థంకాని పరిస్థితిలో భర్త సతమతమవుతున్నాడు. ఇప్పటికే అనిత వైద్యం కోసం ఉన్న రెండెకారాల పొలం... బంగారం అంతా అమ్మేశాడు. మందుల కోసం నెల నెలా పదివేలు ఖర్చుచేస్తున్నాడు. లక్షలు వెచ్చించి ఆపరేషన్ చేయించే స్థోమత లేక... ఎలాగైనా తన భార్యను బతికించుకోవాలని దాతల సాయాన్ని అర్థిస్తున్నారు. అనిత బతకాలంటే కనీసం 12 లక్షలు కావాలి. త్వరగా ఆపరేషన్ చేయకపోతే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. మనసున్న వారు ముందుకొచ్చి... ఈమెకు సాయం చేయాలనుకుంటే వారి అకౌంట్లలో డబ్బు వేయొచ్చు. వారి అకౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. అకౌంట్ల వివరాలు V.G. అనిత V.నారాయణ సంప్రదించాల్సిన నెంబర్లు అకౌంట్ నెంబరు: 001310011027659 అకౌంట్ నెంబరు: 34554125766 9959699045 ఆంధ్రాబ్యాంకు, గాంధీనగర్ బ్రాంచ్, అనంతపురం SBI, జార్జిపేట్ బ్రాంచ్, అనంతపురం 8121381402 IFSC code: ANDC0000013 IFSC code: SBIN0010659 -