Health professionals
-
వైద్యరంగానికి ‘సహకారి’ కరవు
వైద్యం అంటే కేవలం డాక్టర్లు, మందులు మాత్రమే కాదు; తెర వెనుక ఉండి ప్రాణాలను కాపాడే ‘అలైడ్ హెల్త్‌కేర్’ నిపుణుల పాత్ర కీలకం. ఆధునిక వైద్య రంగంలో ఒక రోగికి వ్యాధి నిర్ధారణ జరగాలన్నా, క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం కావాలన్నా లేదా డయాలసిస్ వంటి ప్రాణరక్షక ప్రక్రియలు కొనసాగాలన్నా డాక్టర్లతో పాటు సమానంగా శ్రమించే వారు ‘అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్’ (ఏహెచ్‌పీ). ల్యాబ్ టెక్నీషియన్లు, ఇమేజింగ్ స్పెషలిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది.. ఇలా సుమారు 50కి పైగా విభాగాల్లో పనిచేసే ఈ నిపుణులు ఆరోగ్య వ్యవస్థలో 60 శాతం మేర వాటాను కలిగి ఉన్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, వైద్యులు చికిత్సను నిర్ణయిస్తే.. అలైడ్ నిపుణులు ఆ చికిత్సను సహకారం అందిస్తారు.భారీగా మానవ వనరుల కొరతప్రస్తుతం భారతదేశ ఆరోగ్య రంగం తీవ్రమైన నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. గణాంకాల ప్రకారం.. అవసరమైన నిపుణులు 1.09 కోట్లు. అందుబాటులో ఉన్నవారు 27.5 లక్షలు. లోటు 80 లక్షలకు పైగా. ఏటా సుమారు 10 లక్షల మంది అలైడ్ నిపుణుల అవసరం ఉండగా కేవలం 2 లక్షల మంది మాత్రమే విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. ఈ వ్యత్యాసం వల్ల రోగ నిర్ధారణలో జాప్యం, శస్త్రచికిత్సలు వాయిదాపడి అంతిమంగా రోగి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.విద్య - ఉపాధిఅలైడ్ హెల్త్‌కేర్ కోర్సులు పూర్తి చేయడానికి విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడటంతోపాటు భారీగా ఆర్థిక పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అయితే, కెరీర్ ప్రారంభంలో లభించే వేతనాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. గ్రామీణ, మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఒక ప్రతిబంధకంగా మారుతోంది. తక్కువ శిక్షణతో ఎక్కువ ఆదాయం వచ్చే ఇతర రంగాల వైపు యువత మొగ్గు చూపడం వల్ల ఈ విభాగంలో నిపుణుల కొరత పెరుగుతోంది.సంస్కరణల దిశగా అడుగులుఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (ఎన్‌సీఏహెచ్‌పీ) చట్టాన్ని’ తీసుకువచ్చింది. కేంద్ర బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించి రాబోయే ఐదేళ్లలో లక్ష మంది కొత్త నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఒకే రకమైన కాంపెటెన్సీ బేస్డ్ సిలబస్‌ను అమలు చేయనున్నారు.అమలులో ఎదురవుతున్న సవాళ్లుచట్టం తీసుకురావడం ఒక ఎత్తయితే దానిని ఆచరణలోకి తెచ్చే క్రమంలో కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం..చట్టం అమలులోకి వచ్చే లోపు కోర్సుల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టత అవసరం. పాత పద్ధతిలో చదివిన వారిని కూడా రిజిస్ట్రేషన్‌కు అనుమతించే విధానం కావాలి.కొత్త నిబంధనల ప్రకారం విద్యా సంస్థల గుర్తింపు పొందే ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలి. లేదంటే అడ్మిషన్లు ఆగిపోయి నిపుణుల కొరత మరింత తీవ్రమవుతుంది.అవయవ మార్పిడి, అణు వైద్యం (న్యూక్లియర్ మెడిసిన్) వంటి స్పెషలైజ్డ్ విభాగాల్లో శిక్షణ కేవలం మెట్రో నగరాల్లోని పెద్ద ఆసుపత్రుల్లోనే సాధ్యం. చిన్న పట్టణాల్లోని విద్యాసంస్థలకు స్టాండ్-అలోన్ ల్యాబ్‌లు, డయాలసిస్ సెంటర్లతో అనుసంధానం అయ్యే వెసులుబాటు కల్పించాలి.అలైడ్ కోర్సులను బోధించడానికి డాక్టర్లను అనుమతించకూడదనే నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం మాస్టర్స్ లేదా పీహెచ్డీ చేసిన అలైడ్ నిపుణులు తక్కువగా ఉన్నందున ప్రారంభ దశలో నిబంధనల్లో కొంత సడలింపు అవసరం.వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం అత్యాధునిక ఆసుపత్రులు ఉంటే సరిపోదు. వాటిని నడిపించే నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలి. రెగ్యులేటరీ వ్యవస్థ అనేది అడ్డంకిగా మారకుండా సామర్థ్యాన్ని పెంచే ఒక ఉత్ప్రేరకంగా పనిచేయాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో ఆరోగ్య వ్యవస్థ బలోపేతమై ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందుతుంది.ఇదీ చదవండి: ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు -
యువతలో పోషకలోపం..
దేశంలో 81 శాతం మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రదిన్, నేషనల్ న్యూట్రిషన్ వీక్ సంయుక్తంగా విడుదలచేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఈ సర్వేలో 20 మిలియన్ల మంది 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు గల యువత నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. 96 శాతం మంది భారతీయులు తమకు అవసరమైన సూక్ష్మపోషకాలు, మలీ్టవిటమిన్లు అందుబాటులో లేవని భావిస్తున్నారని పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రధానంగా ఉదయం లేచింది మొదలు,నిత్యం ఉద్యోగంలో, ఇతర పనుల్లో అన్ని స్థాయిల్లోనూ వేగంగా అలసటకు గురవుతున్నారట. పెరుగుతున్న పోషకాహార లోపంపై అవగాహన కలి్పంచడం, స్వీయ సంరక్షణను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. సర్వే సంస్థ వన్ నేషన్ 100% న్యూట్రిషన్ మిషన్‌లో భాగంగా ఉద్యోగ, శ్రామిక జనాభాలో అలసట పెరుగుతోందని తేలింది. ఈ సమస్యకు గల కారణాలు, పరిష్కార మార్గాలు, తక్షణ పోషక విలువలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు అందులో వివరించారు. విధి నిర్వహణలో 83 శాతం మంది అలసట కారణంగా తరచూ విరామాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. 74 శాతం మంది పగటిపూట నిద్రతో ఇబ్బంది పడుతున్నారు. 69 శాతం మంది పనులు ప్రారంభించడం లేదా పూర్తి చేయడం కష్టంగా ఉందని తెలిపారు. 66 శాతం మంది రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయలేకపోతున్నామని, 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వారిలో 78% మంది, 36 ఏళ్ల నుంచి 45 ఏళ్లలో 72% మంది పగటిపూట మగతగా ఉంటున్నారని అభిప్రాయపడ్డారు.ముందే గుర్తించారు.. యువతలో అలసట పెరగడం చాలా మంది ఆరోగ్య నిపుణులు గుర్తించారు. పోషకాహార అంతరాలను తగ్గించడానికి మలీ్టవిటమిన్లను ప్రోత్సహించడం ద్వారా 70% వరకూ అవసరమైన సూక్ష్మపోషకాలను అందించవచ్చు. రోజువారీ సప్లిమెంట్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. – డాక్టర్ కేతన్ కె మెహతా, సీనియర్ కన్సల్టెంట్ ఇంటికి వచ్చేసరికే నీరసం.. నగర జీవనంలో శారీరక వ్యాయామం తగ్గుతోంది. నిత్యం పని ఒత్తిడి ఉంటోంది. ఇటువంటి సందర్భంలో అలసటకు గురవుతున్నాం. దీనికి తగ్గట్లే ఆఫీస్‌లో విరామం ఇస్తున్నారు. ఇంటికి వచ్చే సరికి నీరసం అనిపిస్తుంది. సెలవు రోజుల్లో ప్రశాతంగా రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నాం. – ఆలేటి గోపి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, కొండాపూర్ -
‘స్టెమీ’ గుండెపోటు అంటే తెలుసా? ఎవరికి ఆ ప్రమాదం?
క్యాన్సర్ గుండెపోటును కూడా తెస్తుందన్న విషయం కాస్త విచిత్రంగానే అనిపించవచ్చుగానీ అది పూర్తిగా వాస్తవం. అంటే... క్యాన్సర్ ఇప్పుడు తన అనర్థాలకే కాదు... గుండె తాలూకు సమస్యలకూ కారణమవుతుందన్నమాట. అంతమాత్రాన బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. క్యాన్సర్‌ను జయించిన ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే ఈ ముప్పు ఉంటుంది. క్యాన్సర్ వల్ల వచ్చే గుండెపోటును ‘స్టెమీ’ అంటారు. ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనే మాటకు ‘స్టెమీ’ సంక్షిప్త రూపం. ఈ విషయాన్ని మయో క్లినిక్‌కు చెంది నిపుణుల అధ్యయనంలో తెలిసివచ్చిన సంగతి ఇది. రోచెస్టర్‌లోని ఆ క్లినిక్‌లోని పరిశోధకులు / వైద్యనిపుణులు అధ్యయనం చేసినప్పుడు క్యాన్సర్ పూర్తిగా తగ్గిన మాజీ బాధితులు... ప్రతి పదిమందిలో ఒకరికి గుండెపోటుకు గురయ్యే ముప్పు ఉన్నట్లు కనుగొన్నారు. చదవండి: తరుచూ బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంప, ద్రాక్ష పండ్లు తింటున్నారా.. అయితే క్యాన్సర్‌పై విజయం సాధించడం చిన్న విషయమేమీ కాదు. అయితే క్యాన్సర్‌నే జయించినంత మాత్రాన అంతా సద్దుమణిగిందని అర్థం కాదు. ఆ తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, తగినంత వ్యాయామం చేస్తూ, ఎప్పుడూ ఉల్లాసంగా సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం. శారీరక, మానసిక ఒత్తిళ్లు లేకుండా చూసుకోవడం అవసరం. అప్పుడే క్యాన్సర్‌ను జయించిన ఉత్సాహం మాత్రమేగాక... ఆ తర్వాతి అనర్థాలనూ అధిగమించే ఆరోగ్యం సమకూరుతుందం’’ టూ హెచ్చరిస్తున్నారు మయో క్లినిక్ డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. -
కోవిడ్ మాత్రలు వేరే సంస్థలూ తయారుచేయొచ్చు
జెనీవా: కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి తాము ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ మాత్రల్ని ఇతర కంపెనీలూ తయారు చేయడానికి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ అంగీకరించింది. ఐక్యరాజ్య సమితి మద్దతు కలిగిన జెనీవాకి చెందిన మెడిసన్స్ పేటెంట్ పూల్(ఎంపీపీ) బృందంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. యాంటీవైరల్ పాక్స్లోవిడ్ మాత్రలు తయారు చేయడానికి ఆ బృందానికి లైసెన్స్‌లు మంజూరు చేసినట్టుగా ఫైజర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంపీపీ సంస్థ నిరుపేద దేశాలకు తక్కువ ధరలకే మందుల్ని పంపిణీ చేస్తోంది. ఫైజర్ చేసుకున్న ఒప్పందం ద్వారా ప్రపంచ జనాభాలో 53% మందికి కోవిడ్ మాత్రలు అందుబాటులోకి వస్తాయి. ఫైజర్ కంపెనీ రాయల్టీలను వదులుకోవడంతో 95 దేశాల్లో ఈ మాత్రల్ని అత్యంత చౌక ధరలకే పంపిణీ చేయవచ్చు. మరికొద్ది నెలల్లోనే ఈ మాత్రల్ని మార్కెట్లోకి తెస్తామని ఎంపీపీ పాలసీ చీఫ్ ఎస్టెబన్ బరోన్ చెప్పారు. ఫైజర్ చేసుకున్న ఈ ఒప్పందంతో కరోనాను త్వరితంగా అంతమొందించవచ్చునని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఆడపిల్లలను ఆడనివ్వండి!
కొత్త పరిశోధన టీనేజీ దశలో ఉన్న ఆడపిల్లల్ని స్పోర్ట్స్ ఆడనివ్వడం, చురుగ్గా వ్యాయామాలు చెయ్యనివ్వడం వారి ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీనేజీ ఆడపిల్లలు శారీరకంగా చురుగ్గా ఆటలాడటం... ఆ తర్వాత వారి భవిష్యత్తులోఆరోగ్యంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుందని వారు పేర్కొంటున్నారు. చైనా దేశానికి చెందిన నలభై నుంచి డెబ్బయి ఏళ్ల వయసున్న 74,941 మంది మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మహిళల ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశాక... ఇలా టీనేజ్‌లో విస్తృతంగా ఆటలాడినవారే ఎక్కువని తేలింది. ఇలా టీనేజీలో ఆటలాడిన వారు తమ 40 నుంచి 70 ఏళ్ల వయసప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారనీ, వీళ్లలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 16 శాతం, గుండెజబ్బుల రిస్క్ 15 శాతం తగ్గాయనీ, పైగా వారి ఆయుఃప్రమాణం బాగా పెరిగిందని కూడా తెలిసింది. అన్ని రకాల రిస్క్‌ల కారణంగా వచ్చే అకాల మరణాలు దాదాపు 20 వరకు ఇలాంటి ఆరోగ్యకరమైన మహిళల్లో తక్కువని వెల్లడయ్యింది. ఈ విషయాలన్నీ ‘క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరచినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
శాకాహారంతో గుండెకు మేలు..
గుండెజబ్బులకు దూరంగా ఉండాలంటే శాకాహారమే మేలని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో కనీసం 70 శాతం శాకాహారం ఉండేలా చూసుకుంటే, గుండెజబ్బులు వచ్చే ముప్పు 20 శాతం వరకు తక్కువగా ఉంటుందని లండన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు నిర్వహించిన విస్తృత అధ్యయనంలో తేలింది. పూర్తిగా ఒక దశాబ్దం పాటు 4.50 లక్షల మంది ఆహారపు అలవాట్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. శాకాహారంతో పాటు రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ తాగే వారిలో గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. పూర్తిగా శాకాహారం తీసుకోవడం లేదా రోజువారీ భోజనంలో శాకాహారాన్నే ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెజబ్బుల కారణంగా సంభవించే అకాల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని భరోసా ఇస్తున్నారు.


