breaking news
hayat hotel
-
ఉత్తమ టూరిజం పాలసీ తెచ్చాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో అంతర్జాతీయ బ్రాండ్ హోటళ్లు మరిన్ని ఏర్పాటయ్యేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రాల జాబితాలో చేర్చి మన ఆతిథ్యం విశిష్టతను చాటుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలతో తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. విజయవాడలోని ఏలూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన ‘హయత్ ప్లేస్’ హోటల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించారు. విజయవాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రముఖ హోటళ్లు, ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ తమ కార్యకలాపాలను ప్రారంభించేలా ఉత్తమ టూరిజం పాలసీని తెచ్చినట్లు చెప్పారు. ఉత్తమ పర్యాటక విధానాలే కాకుండా చైన్ హోటళ్లను కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఒబెరాయ్‌తో మొదలుకుని ఇవాళ ప్రారంభిస్తున్న హయత్ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్ల సంస్థలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ఇతరులకు స్ఫూర్తినిస్తూ మరింత మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. హయత్ ఛైర్మన్ వీరస్వామి, హయత్ ఇంటర్నేషనల్ ఏరియా ప్రెసిడెంట్ శ్రీకాంత్, మేనేజింగ్ డైరెక్టర్ సాయికార్తీక్తోపాటు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్న అందరికీ శుభాభినందనలు తెలియచేశారు. డైనమిక్ సీఎం.. బెస్ట్ టూరిజం పాలసీ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా అధునాతన వసతులతో హయత్ ప్లేస్‌ను తీర్చిదిద్దినట్లు హయత్ చైర్మన్ వీరాస్వామి చెప్పారు. హోటల్‌ను వందల సంఖ్యలో గదుల సదుపాయంతో అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలను అందచేసినట్లు తెలిపారు. డైనమిక్ సీఎం జగన్ ఉత్తమ టూరిజం పాలసీల ద్వారా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఏరియా ప్రెసిడెంట్ శ్రీకాంత్ ధన్యవాదాలు తెలియచేశారు. హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, అబ్బయ చౌదరి, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ తూర్పు నియోజక వర్గ ఇన్చార్జీ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, టూరిజం శాఖ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవ, కార్యదర్శి కన్నబాబు, కలెక్టర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. అవినాష్ నివాసానికి సీఎం జగన్ హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ను విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జీ దేవినేని అవినాష్ తమ నివాసానికి రావాలని సాదరంగా ఆహ్వానించారు. గుణదలలోని అవినాష్ నివాసం వద్ద సీఎం జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. జై జగన్ అని నినాదాలు చేస్తూ పూల వర్షం కురించారు. అవినాష్ కుటుంబ సభ్యులను సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. రాజకీయ జీవితం కల్పించిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని అవినాష్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తూర్పు నియోజకవర్గ నేతలు సీఎంను కలిశారు. -
మా బలం 162
సాక్షి, ముంబై: ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ గ్రాండ్ హయత్ సోమవారం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి బలప్రదర్శనకు వేదికైంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోవడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చే రోజుకు ఒక రోజు ముందు.. సోమవారం సాయంత్రం మూడు పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ తమ ఎమ్మెల్యేలతో గ్రాండ్ హయత్ హోటల్లో పరేడ్ నిర్వహించింది. 162 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని, ఇది గవర్నర్ కోశ్యారీ చూస్తున్నారనే భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. శివసేనకు చెందిన 56, ఎన్సీపీకి చెందిన 51, కాంగ్రెస్‌కు చెందిన 44, మిత్రపక్షాలు, ఇతరులు 11 మంది.. మొత్తం 162 మంది ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆసక్తి సృష్టించిన ఈ ‘మహా పరేడ్’లో శివసేన నేతలు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, సునీల్ తట్కరే, సుప్రియా సూలే, కాంగ్రెస్ నేతలు ఖర్గే, అశోక్ చవాన్, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారితో పాటు సమాజ్‌వాదీ నేత అబూ ఆజ్మీ, ‘స్వాభిమాని షెట్కారీ సంఘటన్’ చీఫ్ రాజు శెట్టి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో ‘ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని, తమ పార్టీ నేతల ఆదేశానుసారమే నడుచుకుంటామని’ ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యేలతో పాటు నేతలు సైతం ప్రతిజ్ఞ చేశారు. పరేడ్ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు, ఈ మూడు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుందని, తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. సభ్యత్వంపై నాదీ భరోసా ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ కనుక, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలంటూ ఆయన జారీ చేసే విప్‌ను ధిక్కరిస్తే శాసనసభ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందనే భయాలు అక్కర్లేదని, ఎన్సీపీ ఎమ్మెల్యేల సభ్యత్వానికి తనదే బాధ్యత అని శరద్ పవార్ హామీ ఇచ్చారు. విప్‌ను ధిక్కరిస్తే సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందంటూ తమ ఎమ్మెల్యేలను బీజేపీ భయాందోళనలకు గురి చేస్తోందని పవార్ విమర్శించారు. ‘రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించాను. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలను పరిశీలించాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్‌ను తొలగించాం. కాబట్టి, పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం తనకు లేదు. జారీ చేసినా ఆ విప్ చెల్లదు’ అని పవార్ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు. ‘భయం, ఆందోళన వద్దు. మీ సభ్యత్వానికి నాదీ భరోసా. అక్రమంగా అధికారంలోకి వచ్చినవారిని గద్దె దింపాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై శరద్ పవార్ నిప్పులు చెరిగారు. ‘అక్రమంగా, మెజారిటీ లేకున్నా అధికారంలోకి రావడానికి ఇది గోవా కాదు.. మహారాష్ట్ర. ఈ విషయం బీజేపీ పెద్దలు గుర్తుంచుకోవాలి’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మాట్లాడుతూ.. ఇక్కడున్న 162 మంది ఎమ్మెల్యేలే కాదు.. తమ వెనుక ఇంకా ఎక్కువ మంది శాసన సభ్యులే ఉన్నారన్నారు. ‘కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాం. బీజేపీని అడ్డుకునే దిశగా ఈ అవకాశం మాకు కల్పించిన మా పార్టీ చీఫ్ సోనియాకు కృతజ్ఞతలు’ అన్నారు. నేరస్తుల్లా పరేడ్: బీజేపీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నిర్వహించిన బల ప్రదర్శనపై బీజేపీ మండిపడింది. నేరస్తుల తరహాలో పరేడ్ నిర్వహించి, దేశం ముందు మహారాష్ట్ర పరువు తీశారని బీజేపీ నేత ఆశిశ్ షెలార్ విమర్శించారు. పరేడ్‌లో 162 కాదు.. 145 మంది కూడా లేరని వ్యాఖ్యానించారు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల నేతృత్వంతో రాష్ట్రంలో అయిదేళ్ల పాటు సుస్థిర పాలన కొనసాగుతుందన్నారు. అయితే, ఈ పరేడ్‌కు 137 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారని సమాచారం. అడ్డు తొలగండి – ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడ్డు తొలగాలని బీజేపీని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ‘మళ్లీ వస్తాను’ అనే ఫడ్నవీస్ ఎన్నికల ప్రచార నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘మేం ఆల్రెడీ వచ్చేశాం’ అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అధికారం కోసం బీజేపీ అత్యంత హేయంగా వ్యవహరిస్తోందన్నారు. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించాక సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కుపై తొలి సంతకం చేస్తున్న ఫడ్నవీస్ -
కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ వీక్
-
మిస్ల మిలమిల