breaking news
Haripur
-
చితిపై నుంచి లేచాడు!
భువనేశ్వర్: శాశ్వతంగా కన్నుమూశాడని భావించి, శ్మశానవాటికకు తరలించి చితికి నిప్పుపెట్టే సమయంలో ఆ వ్యక్తి హఠాత్తుగా కళ్లు తెరిచాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా కోలుకుంటున్నాడు. ఒడిశాలోని గంజాం జిల్లా సొరొడా సమితిలో ఉన్న హరిపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. గ్రామానికి చెందిన మేకల కాపరి సీమాంచల్ మల్లిక్ శనివారం మేకలను మేపునకు తోలుకెళ్లాడు. సాయంత్రం మేకలు ఇళ్లకు చేరినా సీమాంచల్ మాత్రం రాలేదు. గాలించిన బంధువులు, గ్రామస్తులు అపస్మారకస్థితిలో ఉన్న అతడిని ఆదివారం కనుగొన్నారు. మల్లిక్ మరణించినట్లు భావించి అంత్యక్రియలకు శ్మశానవాటికకు తరలించారు. చితికి నిప్పుపెట్టే సమయంలో.. చుట్టిన వస్త్రాన్ని తొలగిస్తుండగా ఊపిరి ఆడుతున్నట్లు గమనించారు. అంతలోనే కళ్లు తెరిచిన మల్లిక్‌ను చూసి అతడు మరణించలేదని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సతో అతడు కోలుకుంటున్నాడు. 4 రోజులుగా జ్వరం.. నాలుగు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడిన తాను తగ్గినట్లు అనిపించడంతో శనివారం మేకలు తోలుకెళ్లినట్లు మల్లిక్ తెలిపారు. మధ్యాహ్నానికి మళ్లీ జ్వరం వచ్చి పడిపోయినట్లు చెప్పారు. తిరిగి మెలకువ వచ్చేసరికి చితిమీద ఉన్నట్లు పేర్కొన్నారు. -
సమైక్యం కోసం.. సమర శంఖం..!
మందస, న్యూస్‌లైన్:సమైక్యాంధ్రే ధ్యేయమని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య ఉద్యమానికి పార్టీ నేతలతో పాటు అభిమానులు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. పార్టీ యువజన విభాగం చొరవతో హరిపురంలో మంగళవా రం ‘సమైక్య శంఖారావం’ నిర్వహించారు. ముందుగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం, పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు తదితరులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ స్వప్రయోజనం, రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని విభజిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కుట్రను పార్లమెంట్లో ప్రథమంగా ఖండించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డేనన్నారు. సమైక్యాంధ్ర కోసం అన్ని రాష్ట్రాల నాయకుల మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు. విభజన వల్ల యువకులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతారన్నారు. జల పంపకాలు, ఉద్యోగ భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకుం డా..విభజనకు పూనుకోవడం బాధాకరమన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరె డ్డి సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు కావాలంటే.. జగన్మోహన్రెడ్డి సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతా ఆయనకు సహకరించాలని కోరారు. పలాస నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి, పార్టీని గెలిపిస్తామన్నారు. జై సమైక్యాంధ్ర, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఏకగ్రీవ తీర్మానం.. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని, తెలుగు వారంతా..కలిసి ఉండాలని కోరుతూ..నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, అభిమానులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మాన పత్రాన్ని రాష్ట్రపతి, గవర్నర్‌కు అందజేస్తామని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ టి.సురేష్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ యువజన విభాగం జిల్లా శాఖ అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర శాఖ సభ్యుడు మామిడి కృష్ణారావు, మండల కన్వీనర్ కురాగౌడ, మహిళా విభాగం కన్వీనర్ బల్ల లీలాకుమారి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అందాల శేషగిరి, అడ్‌హక్ కమిటీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ జి.నర్సునాయుడు, పార్టీ నాయకులు పులారి పాపారావు, ఎన్ని ధనుంజయరావు, సర్పంచ్ మేకల గౌరి, కర్రి గోపాలకృష్ణ, దుంపల లింగరాజు, మాలతి మురళి, మాజీ సర్పంచ్ బొడ్డు హరికృష్ణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మామిడి సిం హాద్రి, బల్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.