breaking news
hand writing work
-
చేతి రాతే భవిష్యత్తుకు బాట..
సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అందమైన చేతి రాత ఉన్న పిల్లలు పరీక్షల్లో అన్సర్ తెలియక΄ోయినా గుండ్రంగా ఏదో ఒకటి రాస్తారు. ఆ రాత చూసి పోనీలే పం అని టీచర్లు ఒక మార్కయినా వేస్తారు. అదే చేతి రాత బాగా లేని పిల్లలు అన్సర్స్ను చాలా కరెక్ట్‌గా రాసినా దిద్దే మేష్టార్లకు అర్థంగాక, చిరాకు అనిపించి ఒక మార్కు తక్కువ వేస్తారు.పిల్లలకు చేతి రాతే వ్యక్తీకరణ సాధనం, ఆయుధం. వాళ్లు క్లాస్‌రూమ్‌లో మాటల ద్వారా కనపరిచే తెలివితేటలు పరీక్షకు నిలవవు. చేతి రాత ద్వారా ఏదైతే రాస్తారో, రాసి మెప్పిస్తారో అదే నిలుస్తుంది. కాని దురదృష్టం ఏమిటంటే చేతిరాత గురించి పెద్దలు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. స్కూల్లో టీచర్లు సరిదిద్దలేక పోతున్నారు.రూపం కంటే స్పష్టత ముఖ్యంచేతి రాత అందరిదీ ముత్యాల్లా ఉండదు. కొందరిది సహజంగా బాగుంటుంది. మరికొందరిది ప్రయత్నం మీద బాగుపడుతుంది. ఇంకొందరిది చాలా గందరగోళంగా ఉంటుంది. ఈ గందరగోళం పిల్లలు అందంగా రాయడం కంటే అర్థం అయ్యేలా రాయడంపై శ్రద్ధ పెడితే చాలామటుకు సమస్య ఉండదు. ఆ సంగతి వారికి చెప్పి రాతను బాగు చేయాలి. రాత సరిగా ఉండకపోవడానికి కారణాలువేళ్ల సామర్థ్యం బలంగా లేకపోవడం పెన్ను లేదా పెన్సిల్ తప్పుగా పట్టుకోవడం త్వరత్వరగా రాయడానికి ప్రయత్నించి కంగాళీ చేయడం ∙నోట్స్‌లోని పేజీలై΄ోతాయేమోనని ఇరికించి రాయడం కొన్నిసార్లు దృష్టిలోపం వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఎక్కువ మంది పిల్లలు చేసే పొరపాటు పెన్ను తప్పుగా పట్టుకోవడం. పలక నుంచి పెన్సిల్‌కు మారేటప్పుడు ఈ పొరపాటు మొదలవుతుంది. కొందరు రెండు వేళ్లతో మరికొందరు మూడు వేళ్లతో పెన్సిల్‌ను పట్టుకుంటారు. కాని బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలు కలిపి పట్టుకుని రాయడం మంచి పద్ధతి అంటారు నిపుణులు. కొందరు ఘంటంలా పట్టుకుంటారు. దీనిని నివారించాలి.కూర్చునే పద్ధతి సరి చేయాలిరాయాలంటే కూర్చోవాలి. కింద కూర్చునే పద్ధతి ఒక రకంగా, స్కూల్ బెంచీ మీద మరోరకంగా ఉంటుంది. ఈ కూచుని రాసే పద్ధతిలో తేడా వల్ల కూడా రాత సరిగా ఉండదు. కొందరు పుస్తకాలపై పూర్తిగా వాలిపోయి రాస్తుంటారు. మరికొందరు మోచేతులపై పడుకొని రాస్తారు. చేతి రాత బాగుండాలంటే నిటారుగా కూచుని, కాళ్లు నేలకు తగిలేలా ఉంచి రాయాలి. ఇలా చేయడం వల్ల హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎంత ఒత్తిడితో రాయాలి?కొందరు పిల్లలు పెన్ను/పెన్సిల్‌పై ఎక్కువగా ఒత్తిడి పెట్టి రాస్తారు. మరికొందరు ఒత్తిడి పెట్టరు. ఒత్తిడి పెడితే రైటింగ్ స్పీడ్ తగ్గుతుంది. వేళ్లు కూడా నొప్పి పుడతాయి. దీంతో పిల్లలు అలసి΄ోతారు. కాబట్టి పెన్సిల్ లేదా పెన్నును తేలికగా పట్టుకునేలా చూడండి. ఇలా చేయడం వల్ల రైటింగ్ ఫ్లో మెరుగవుతుంది. కలర్స్ వేయడం, డ్రాయింగ్ చేయించడం వంటివి వేళ్లకు ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తాయి. పిల్లలకు మంచి పెన్ను, పెన్సిల్ ఇవ్వాలి. నాసిరకమైన పెన్సిల్స్, పెన్నులు వాడితే అవి విరిగిపోతుంటాయి. దీంతో పిల్లలు చేతిరాతపై దృష్టి పెట్టలేరు. రాసే మూడ్ పోతుంది.చేతిరాత చదువు కోసమే కాదు నిత్య జీవితం లో కూడా ఎంతో అవసరం. మన చేతి నుంచి రాసే అక్షరం శుభ్రంగా ఉంటే ఉండే ఆత్మవిశ్వాసం వేరు. మంచి చేతి రాతతో రాసే ఉత్తరాలు, వినతులు, విజ్ఞాపన పత్రాలు వెంటనే ఇంప్రెస్ చేస్తాయి. తక్షణ ప్రభావం చూపుతాయి.(చదవండి: మిసెస్ బిహార్ 2025గా బీజేపీ ఎమ్మెల్యే భార్య..!) -
హోంవర్క్ రాసే AI..
-
ముచ్చటైన దస్తూరీ.. మంచి భవితకు రహదారి..
∙మంచి మార్కులు, గ్రేడ్ల సాధనకూ అవకాశం ∙విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెడితే మేలు రాయవరం : బొటనవేలూ, చూపుడువేళ్ల మధ్య నుంచి జాలువారే ముత్యాల ముగ్గులు ముంగిలికి అందాన్నిస్తాయి. చూపుడు వేలూ, నడిమి వేళ్ల నడుమ కలాన్ని బిగించి, బొటనవేలితో అదుముతూ కాగితంపై ‘రంగవల్లుల వరుస’లను సృజించే చేతిరాతా రమణీయమే. కంప్యూటర్ యుగంలో దస్తూరీకి ప్రాధాన్యం తగ్గింది. చేతులకు రాత పని దూరమవుతోంది. అయితే విద్యార్థుల విషయానికి వస్తే..రాత పరీక్షల్లో మార్కులకు సంబంధించి చేతిరాత కీలకమైనది.అందంగా రాసే అక్షరాలకు వచ్చే అదనపు మార్కులూ మంచి ఫలితాలకు దోహదపడతాయి. మరోవైపు చేతిరాతను బట్టి వ్యక్తుల గుణగణాలను అంచనా వేయొచ్చు. పరీక్షల్లో ఫలితాన్ని, భవితను నిర్దేశించేది అందమైన అక్షరాలేనని విషయ నిపుణులు పేర్కొంటున్నారు. చేతిరాతపై దృష్టి సారిస్తే మంచి ర్యాంకులు, గ్రేడ్లు సాధించవచ్చు. వచ్చే పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులు, గ్రేడులు సాధించాలంటే విద్యార్థులు ఇప్పటి నుంచే చేతిరాతపై దృష్టి సారిస్తే మంచిది. ఏకాగ్రతతో మంచి దస్తూరీ పది, ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సుల వార్షిక పరీక్షలు మరికొద్ది నెలల్లో రానున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు చేతిరాతపై ఇప్పటి నుంచే దృష్టి సారించాల్స. విద్యార్థులు ఉత్తమ మార్కులు, గ్రేడులు సాధించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నా చేతిరాత గురించి మాత్రం పట్టించుకోరు. దీంతో అనుకున్న మార్కులు పొందలేక పోతుంటారు. ఆత్మవిశ్వాçÜం, ఏకాగ్రతను పెంచుకుంటే మంచి రాత వస్తుంది. ఏడాది పొడుగునా చదివిన పాఠ్యాంశాలపై పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు విద్యార్థి అందంగా రాసే సమాధానాలపైనే ఎన్ని మార్కులు వస్తాయనేది ఆధారపడి ఉంటుంది. సాధనతో చక్కటి దస్తూరీ జిల్లావ్యాప్తంగా 534 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 70 వేల మంది విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. ఇంటర్, డిగ్రీ పరీక్షలను మరికొన్ని వేల మంది రాయనున్నారు. పరీక్షల కోసం ఇప్పటి నుంచే పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఏడాదంతా చదివిన పరిజ్ఞానాన్ని పేపరుపై పెట్టే సమయం సమీపిస్తోంది. చేతిరాత బాగుంటే విద్యార్థుల్లో ఆత్మ విశ్వాçÜం పెరుగుతుంది. ఆకర్షణతో కూడిన అక్షరాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. పరీక్షల సమయంలో ఇటు సబ్జెక్టులకు సన్నద్దం అవుతూ మరోవైపు రోజులో కొంత సమయం చేతిరాతపై దృష్టి సారిస్తే సబ్జెక్టుపైనే కాక రాతపై పట్టు వస్తుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. అందమైన అక్షరాలే ఆకర్షణ.. ∙ పరీక్షల్లో రాసే అక్షరాలు ఒకేలా ఉండాలి. ∙ అక్షరాలు మరీ పెద్దవి, చిన్నవిగా ఉండకూడదు. ∙ పేపరంతా ఒకే స్థాయిలో అక్షరాలు ఉండాలి. చేతిరాత బాగుంటే జవాబు పత్రాలను దిద్దే ఉపాధ్యాయులు ప్రభావితమవుతారు. ∙ గుండ్రంగా, అందంగా రాసే అక్షరాలకు ఆకర్షించి మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ∙ మనసుకు హత్తుకునేలా అక్షరాలు ఉండాలి. అక్షరాలను గొలుసులా రాస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉండదు.