breaking news
habitations
-
చందమామపై ఎంచక్కా బతికేయొచ్చు!
చిన్నతనంలో గోరు ముద్దలు తినిపించేందుకు అమ్మ చందమామను చూపిస్తుంది. అన్నం తినేందుకు పరోక్షంగా అక్కరకొచ్చే చందమామ మన శాశ్వత స్థిరనివాసానికి ఆమోదయోగ్యంగా లేదని ఇన్నాళ్లూ అంతా భావించారు. భూమి మాదిరి అక్కడ వాతావరణం, గాలి, నీరు వంటివేమీ అక్కడ లేకపోవడమే ఇందుకు ప్రధానకారణం. జీవన మనుగడకు కీలకమైన ఆక్సిజన్, నీటి కొరతల సమస్యను తీర్చేలా చంద్రుని మట్టి నుంచే ఆ రెండింటినీ తయారుచేసి చూపి చైనా శాస్త్రవేత్తలు మానవాళి చంద్రునిపై స్థిరనివాస కలలకు కొత్త రెక్కలు తొడిగారు. నీటి తయారీకి పనికొచ్చే కీలక మూలకాలు చంద్రుని మట్టిలో పుష్కలంగా ఉన్నాయని చైనా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. చాంగ్–ఈ–5 మిషన్ ద్వారా తీసుకొచి్చన చంద్రశిలలు, చంద్రుని మట్టిని సమగ్ర స్థాయిలో విశ్లేíÙంచడం ద్వారా చంద్రునిపైనే ఉదజని, జీవజలం పునర్‌సృష్టి సాధ్యమని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్త సాంకేతికత సాయంతో చంద్రుని నేల నుంచి నీరు, ఆక్సిజన్‌ను తయారుచేసి చూపడం విశేషం. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు సెల్ ప్రెస్ వారి ‘జూలీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. లీటర్ నీటికి రూ.19 లక్షలు !! అంతరిక్ష పరిశోధనలో భాగంగా వ్యోమగాములు భవిష్యత్తులో చంద్రునిపై ఎక్కువ కాలం గడపాల్సి రావొచ్చు.ఆ సమయంలో ఆక్సిజన్, నీరువంటి ప్రాణాధార వ్యవస్థలను అక్కడ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. భూమి మీద నుంచి వ్యోమనౌక ద్వారా వందల లీటర్ల నీటిని, భారీ స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లను తరలించడం ఎంతో శ్రమతో, అంతకుమించిన ఖర్చుతో కూడిన వ్యవహారం. కేవలం 3.785 లీటర్ల( ఒక గ్యాలన్) నీటిని భూమి మీద నుంచి చంద్రుడి వద్దకు వ్యోమనౌకలో చేర్చాలంటే కనీసం రూ.72 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఒక లీటర్ నీటిని ఇక్కడి నుంచి అక్కడికి పంపాలంటే అక్షరాలా పంతొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతటి వ్యయప్రయాసలకోర్చి పంపేకంటే అక్కడే నీటిని తయారుచేస్తే ఉత్తమం అన్న నిర్ణయానికొచ్చి ఆమేరకు చైనా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధిచేశారు. చందమామ మట్టి నుంచి నీటిని సంగ్రహించి ఆ నీటి సాయంతో కార్భన్డయాక్సైడ్ను ఆక్సిజన్‌గా, ఇతర ఇంధన సంబంధిత రసాయనాలుగా మార్చే సాంకేతికతను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఏమిటీ టెక్నాలజీ? ఈ టెక్నాలజీ సాయంతో చంద్రుని మట్టి నుంచి నీటిని సంగ్రహించవచ్చు. ప్రయోగాల కోసం అక్కడే ఉన్న వ్యోమగామని ఉచ్చా్వస నుంచి వెలువడిన కార్భన్డయాక్సడ్ను ఇదే నీటి సాయంతో కార్భన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ వాయువుగా మార్చొచ్చు. ఇలా అందుబాటులోకి వచి్చన కార్భన్‌మోనాక్సైడ్, హైడ్రోజన్ ఇంధనం, ఆక్సీజన్ తయారీ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారైన ఆక్సిజన్‌ను మళ్లీ అక్కడి వ్యోమగాముల కోసం సిలిండర్లలో భద్రపరుస్తారు. ఈ టెక్నాలజీ పనిచేయడానికి అవసరమయ్యే వేడిని తీక్షణమైన సూర్యరశ్మి నుంచి సంగ్రహించనున్నారు. టైటానియం ఐరన్ ఆక్సైడ్ ధాతువులున్న చంద్రుని ‘ఇన్మెనైట్’ మట్టితో నీటిని సృష్టించడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెప్పారు. ల్యాబ్‌లో సూక్ష్మస్థాయిలో నీటిని, ఆక్సిజన్‌ను సృష్టించగలిగామని, చంద్రునిపై వ్యోమగామలు నిరంతరం శ్వాసించి, ఉపయోగించుకునే స్థాయిలో ఆక్సిజన్ తయారీకి మరికొంత కాలం ఆగకతప్పదని పరిశోధకులు తెలిపారు. ఆ రోజు కోసం మేం కూడా ఎదురుచూస్తున్నామని వారు వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంగారకుడిపై నిర్మాణాలకు నీటి రహిత కాంక్రీట్
చెన్నై: ఇతర గ్రహాలపై సమీప భవిష్యత్తులో మానవ ఆవాసాలు నిర్మించడం సాధ్యమేనని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి ఆవల గ్రహాలపై ఆవాసాలు నిర్మించుకొనే దిశగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయా గ్రహాలపై లభించే వనరులతోనే ఇళ్లు రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాసుకు చెందిన ఎక్స్ట్రాటెరెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్(ఎక్స్‌టెమ్) గణనీయమై పురోగతి సాధించింది. నీటితో సంబంధం లేని కాంక్రీట్‌ను అభివృద్ధి చేసింది. అంగారక(మార్స్) గ్రహంపై ఇళ్ల నిర్మాణానికి ఈ కాంక్రీట్ చక్కగా సరిపోతుందని చెబుతున్నారు. సల్ఫర్ మిశ్రమంతో కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు ఎక్స్‌టెమ్ బృందం వెల్ల్లడించింది. అంగారకుడిపై సల్ఫర్ సమృద్ధిగా ఉంది. అక్కడ ఇప్పటివరకైతే నీటి జాడ కనిపెట్టలేదు. ఇదిలా ఉండగా, ఎలాంటి వాతావరణం లేని శూన్య స్థితిలో నిర్మాణాలపై ఎక్స్‌టెమ్ బృందం పరిశోధనలు చేస్తోంది. మైక్రోగ్రావిటీ డ్రాప్టవర్ను రూపొందించింది. జీరో గ్రావిటీలో వస్తువుల లక్షణాలపై దీనిద్వారా అధ్యయనం చేయొచ్చు. భూమిపై నుంచి వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇతర గ్రహాలపై ఉన్న వస్తువులు, వసతులతోనే వ్యోమగాములు అక్కడ మనుగడ సాగించేలా చేయాలన్నదే తమ ఆశయమని ఎక్స్‌టెమ్ ప్రతినిధి ప్రొఫెసర్ సత్యన్ సుబ్బయ్య చెప్పారు. -
నీటి మూటలు !
జిల్లాలో తొమ్మిది వాటర్ గ్రిడ్లను నిర్మించి, నీటి ఎద్దడి తీర్చాలని భావిస్తున్న సర్కార్ వాస్తవ పరిస్థితులను విస్మరిస్తోంది. నీటి లభ్యత, నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పరిశీలిస్తే ఇది ఎంతవరకు సాధ్యమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి విభాగం నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమితో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రక్షిత మంచినీటి పథకాలను నిలిపివేసిన ప్రభుత్వం, భారీ ఖర్చుతో వాటర్ గ్రిడ్లను ఎలా నిర్మిస్తుందన్న సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యమయ్యే మార్గాలను కాలదన్ని, గాలిలో మేడలు కడుతున్నారని, జిల్లాలో నీటి లభ్యత, వాటర్ గ్రిడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు వివరాలను పరిశీలిస్తే వాస్తవపరిస్థితులు అర్థమవుతాయని అభిప్రాయపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో 2945 హేబిటేషన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికీ జాతీయ గ్రామీణాభివృద్ధి మంచినీటి కార్యక్రమం నిబంధనల కింద ప్రతీ రోజూ 55 లీటర్లు అందజేయాలి. ఈ లెక్కన ప్రస్తుతం జిల్లాలో 1089 హేబిటేషన్లలో మాత్రమే రక్షిత మంచినీరు అందించగలుగుతున్నారు. మిగతా హేబిటేషన్ల విషయానికి వస్తే... 684 హేబిటేషన్లలో ఒక్కొక్కరికీ 30 నుంచి 40 లీటర్లు, 406 హేబిటేషన్లలో 20 నుంచి 30 లీటర్లు, 387 హేబిటేషన్లలో 10 నుంచి 20 లీటర్లు, 293 హేబిటేషన్లలో 10 లీటర్ల లోపే సమకూర్చగలుగుతున్నారు. 86 గ్రామాల్లో కనీసం లీటర్ రక్షిత మంచినీటిని కూడా అందించలేని పరిస్థితులున్నాయి. ఈ లెక్కన జిల్లాలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జిల్లాలో 16 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో ఎనిమిది పథకాల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. పదుల సంఖ్యలో మంజూరు దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే కొంతమేర తాగునీటి సమస్య తీరుతుంది. ఈ పనులకు రూ.300 కోట్లు అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నిర్మాణ దశలో ప్రాజెక్టులకు నిధులు నిలిపేసింది. ప్రారంభం కాని పనుల్ని ఆపేయాలని ఆదేశాలిచ్చింది. మంజూరు దశలో ఉన్న వాటి ఊసెత్తడం లేదు. దీని కంతటికీ నిధుల సమస్యే కారణమని సర్కార్ పరోక్షంగా చెబుతోంది. ఈ మార్గాన్ని వదిలేసి సర్కార్ ప్రస్తుతం ఆచరణ సాధ్యం కాని వాటర్ గ్రిడ్లపై దృష్టి సారించింది. జిల్లాలో ఉన్న ప్రతీ ఒక్కరికీ రోజుకి 150 లీటర్ల చొప్పున, పరిశ్రమలకు 15 శాతం నీరందించేందుకు గాను రూ.3,750 కోట్లతో తొమ్మిది వాటర్ గ్రిడ్లకు ప్రతిపాదనలు రూపొందించింది. రిజర్వాయర్ల ద్వారా నీటిని సంపులు, పైపులైన్ల ద్వారా గ్రామాలకు అందించాలన్నదే వాటర్ గ్రిడ్ల లక్ష్యం. కాకపోతే అందుకు తగ్గ నీటి వనరులెక్కడున్నాయన్నది డాలర్ల ప్రశ్న. జిల్లాలో ప్రస్తుతం 10 రిజర్వాయర్లున్నాయి. వీటిలో 18 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ఇందులో 16 టీఎంసీలు ఇరిగేషన్‌కు విడుదుల చేస్తుండగా... కేవలం రెం డు టీఎంసీలను మాత్రమే ప్రస్తుతం తాగునీటి కింద విడుదల చేస్తున్నారు. అదే తొమ్మిది వాటర్ గ్రిడ్లను ఏర్పాటు చేయాలంటే 16 టీఎంసీల నీరు లభ్యం కావల్సి ఉంది. ఈ లెక్కన మరో 14టీఎంసీల నీరు అదనంగా తాగునీటి కోసం కేటాయిం చాల్సి ఉంది. ఆ మేరకు నీటి వనరులెక్కడ ఉన్నాయన్నదే ప్రశ్న. అంటే భవిష్యత్‌లో మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తే తప్ప వాటర్ గ్రిడ్స్ యోచన అమలయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకే సర్కార్ నిధులు కేటాయించడం లేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. వీటికే దిక్కులేనప్పుడు కొత్త వాటి కోసం ఆలోచించడం అత్యాశే అవుతుంది. లేదంటే పోలవరం ప్రాజెక్టు నీరు తీసుకురావల్సి ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తయితేనే మార్గం సుగమమవుతుంది. నీటి లభ్యత అన్నది ఒక సమస్యైతే వాటర్ గ్రిడ్ల కోసం రూ.3,750కోట్లు ఖర్చు పెట్టడమనేది మరో సమస్య. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టగలదా అనేది సర్కార్కే ఎరుక. అటు నీటి వనరులు, ఇటు నిధులు సమకూర్చుకోవడంపై ఆలోచన చేయకుండా తొమ్మిది వాటర్‌గ్రిడ్‌ల ప్రతిపాదన ప్రణాళిక ఎలా తయారు చేశారన్నది అంతుచిక్కడం లేదు. ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు ముందుకొస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు మోక్షం కలిగే అవకాశం లేదు. అంతవరకైనా రక్షిత మంచినీటి పథకాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.