breaking news
Guntakal MLA
-
గుంతకల్లు ఎమ్మెల్యేకు తీవ్ర అనారోగ్యం
హైదరాబాద్: అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు జితేంద్రను హుటాహుటిన కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు జితేంద్రకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జితేంద్రకు డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్య పరీక్షలలో నిర్థారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. -
'రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు'
తాగునీరు,సాగునీరు కోసమే రాయలతెలంగాణ అని గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్గుప్తా అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలా కాని పక్షంలో రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు. అలా చేయకుంటే అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరని ఆయన పేర్కొన్నారు. నీళ్ల కోసం రెండు జిల్లాలను కర్ణాటకలో కలపిన తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రెండో ఎస్సార్సీ వేసి, ఆ తర్వాతే రాష్ట్ర విభజన చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాయలతెలంగాణను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.