breaking news
green field Air port
-
భోగాపురం : 3న గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన
భోగాపురం: భోగాపురంలో నిర్మించనున్న అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి వచ్చే నెల మే 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ న్‌రెడ్డి చేతులమీదుగా జరగనున్న శంకుస్థాపనకు, అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సభాస్థలి ప్రదేశం ఖరారైంది. భోగాపురం మండలం ఎ.రావివలస, సవరవిల్లి గ్రామాల వద్ద విమానాశ్రయ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నా రు. అనంతరం అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తారు. ఇక్కడి నుంచే రూ.194 కోట్లతో తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులకు, చింతపల్లి జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక పాటిల్ పరిశీలించారు. సభా వేదిక, వీఐపీ గ్యాలరీ, పైలాన్, వాహ నాలకు పార్కింగ్ తదితర అంశాలపై చర్చించి స్థలాలను ఖరారు చేశారు. -
వడోదరలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం
-
పంటభూములు ఇవ్వం
దగదర్తి: మండలంలోని దామవరం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన భూములకు సంబంధించి బుధవారం నుంచి సర్వేకు శ్రీకారం చుట్టా రు. ఈ సందర్భంగా మొదటిరోజు దగదర్తి, వెలుపోడు గ్రామాల సమీపంలోని భూములను సర్వే చేశారు. ఈ నేపథ్యంలో సర్వేను రైతులు అడ్డుకున్నారు. తమ భూములు ఇచ్చేదిలేదని తెగేసి చెప్పా రు. ఈ సందర్భంగా దగదర్తి రైతులు వెంకయ్య, వెంకటేశ్వర్లు, వెంకమ్మలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పంటలు పండించుకుని జీవనం సాగిస్తు న్న సన్నకారు రైతుల భూములను విమానాశ్ర యం పేరుతో లాక్కుంటే ఊరుకునేది లేదన్నారు. ఎక్కువ మంది రైతులకు ఎకరా, అర ఎకరా భూమి ఉందని, ఆకాస్త భూమి ప్రభుత్వం తీసుకుంటే జీవనం ఎలాగ గడపాలని ఆరోపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. అనంతరం రైతులతో అధికారులు మాట్లాడటంతో వారు చల్లబడ్డారు. తర్వాత సర్వే చేశారు. కావలి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు దగదర్తి, వెలుపోడు, సున్నపుబట్టి, దామవరం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన భూముల్లో సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి రోజు దాదాపు 75 ఎకరాలకు సంబంధించి సర్వే చేపట్టామన్నారు. సర్వే నంబర్లు ఆధారంగా భూమిపై ఉన్న రైతులను గుర్తించామన్నారు. సర్వే అనంతరం రెవెన్యూ అధికారులు అసలైన రైతులను పట్టాలు ఆధారంగా ఎంపిక చేస్తారన్నారు. వెలుపోడు నుం చి వరుసగా సర్వే చేపడుతున్నామని చెప్పారు. సర్వే చేపట్టే భూములు వివరాలు వెలుపోడులో పట్టా 95.45, డీఫారం 174.08, ప్రభుత్వభూమి 88.35 ఎకరాలు ఉన్నాయన్నారు. అలాగే దగదర్తిలో ప్రభుత్వ భూమి 25.62, అటవీభూమి 445.44 ఎకరాలు, (కొత్తపల్లి కౌరుగుంట) సున్నపుబట్టిలో పట్టా 20.96, డీఫారం 5.70, సీజెఎఫ్ఎస్ 303.45, ప్రభుత్వ భూమి 24.17, అటవీభూమి 163.60 ఎకరాలు, దామవరంలో పట్టా 272.30, డీఫారం 242.98, సీజెఎఫ్ఎస్ 181.85, ప్రభుత్వ భూమి 442.89 ఎకరాలు వెరసి మొత్తం 2,486.84 ఎకరాలకు సర్వే పట్టనున్నట్లు తెలిపారు. సర్వేయర్లు కామేశ్వరరావు, సూర్య నారాయణలు సిబ్బంది పాల్గొన్నారు.