ఇందిరా పార్కులో ‘ఎమ్మెల్సీ’ ప్రచారం
కవాడిగూడ :హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌ను గెలిపించాలని కోరుతూ సోమవారం ఉదయం ఇందిరాపార్కులో రాష్ట్ర హోం శాఖామాత్యులు నాయిని నర్సింహా రెడ్డి, సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ, దేవీప్రసాద్‌లు ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాక్ కోసం వచ్చిన వాకర్స్‌ను కలిసి దేవీప్రసాద్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, సకల జనుల సమ్మె సక్సెస్ వెనుక దేవీప్రసాద్ పాత్ర ఉందని నాయిని అన్నారు.
నారాయణ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సమాజానికి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి దేవీప్రసాద్ అన్నారు. దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని సీపీఐ సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు నారాయణ ప్రకటించారు. అభ్యర్థి దేవీప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల పక్షాన వారి ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారం కోసం బలమైన గొంతుగా ఉంటానని హామీ ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ ఛైర్మన్ శ్రీధర్, టీఆర్ఎస్ గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హనుమంతరావు, ముషీరాబాద్ నియోజకవర్గ అడ్హాక్ కమిటీ సభ్యులు ముఠా గోపాల్, వి. శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, ఎస్.యాదగిరి, శంకర్ లూక్, పెంటారెడ్డి, సీపీఐ గ్రేటర్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్, టీఆర్ఎస్ నాయకులు గజ్జెల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి నాయిని, సీపీఐ నేత డాక్టర్ కె. నారాయణలు దేవీ ప్రసాద్ ఎన్నికల ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించారు. అలాగే వాకర్స్‌తో కొద్దిసేపు షటిల్ ఆడారు.