breaking news
Governor Krishna Kant Paul
-
ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్
డెహ్రాడూన్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరిపోయింది. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ పక్షనేత త్రివేంద్ర సింగ్ రావత్‌ను రాష్ట్ర గవర్నర్ క్రిష్ణ కాంత్ పాల్ నియమించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ నూతన సీఎం త్రివేంద్రను ఆహ్వానించారు. శనివారం రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరవనున్నారు. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 57 స్థానాలు దక్కించుకున్న బీజేపీ అధికారం చేపట్టింది. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై నెలకొన్ని సస్పెన్స్ శుక్రవారం సాయంత్రం తొలగిపోయింది. సీఎం రేసులో ప్రకాశ్ పంత్, త్రివేంద్ర సింగ్ రావత్, సత్పాల్ మహారాజ్ ఉన్నప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్షనేతగా త్రివేంద్రను ఎన్నకున్నారు. ఈ క్రమంలో కొన్ని గంటల్లోనే ఉత్తరాఖండ్ గవర్నర్ క్రిష్ణ కాంత్ పాల్ బీజేపీ పక్షనేతగా ఎన్నికైన త్రివేంద్రను సీఎంగా నియమిస్తూ.. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి మూడేళ్ల కిందటే బీజేపీలో చేరిన రావత్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటమే కాక, అమిత్ షా ఆశీస్సులు సైతం మెండుగా ఉండటంతో సీఎం పీఠం ఆయన సొంతమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా యూపీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి పనిచేసిన అనుభవమే త్రివేంద్ర సింగ్ రావత్‌కు ప్లస్ పాయింట్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థి పరిశీలకులుగా ఇటీవల బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నరేంద్ర తోమర్, సరోజ్ పాండేలను నియమించిన విషయం తెలిసిందే. అయితే వీరు ఎవరి పేరు సూచించినా.. చివరికి పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్ణయమే తుది నిర్ణయమని జేపీ నడ్డా స్పష్టం చేసినట్లే జరిగింది. -
28లోపు మెజారిటీ చూపండి!
♦ సీఎం రావత్‌కు గవర్నర్ పాల్ ఆదేశం ♦ బల నిరూపణపై రావత్ ధీమా డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిందన్న బీజేపీ వాదన నేపథ్యంలో.. మార్చి 28 లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం హరీశ్ రావత్‌ను రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఆదేశించారు. బడ్జెట్‌పై ఓటింగ్ సందర్భంగా శుక్రవారం 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి సభలో ధర్నా చేయడం, అనంతరం గవర్నర్‌ను కలసిన బీజేపీ ప్రతినిధి బృందం మైనారిటీలో పడిన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే. దాంతో మెజారిటీని నిరూపించుకోవాలని శనివారం గవర్నర్ కేకే పాల్ ..రావత్‌కు లేఖ రాశారు. గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు సీఎం రాజ్‌భవన్‌కు వచ్చేముందే ఈ లేఖను సీఎం ఆఫీసుకు పంపారు. ఈ లేఖతో అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించి, తిరిగి వారి మద్దతును కూడగట్టేందుకు రావత్‌కు పది రోజుల సమయం లభించింది. కాగా, రెబల్ ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్‌ను కానీ, సీఎల్పీని కానీ వీడలేదని, తన ప్రభుత్వం మెజారిటీలోనే ఉందని, అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నానని రావత్ ధీమా వ్యక్తం చేశారు. రెబల్స్‌లో ఐదుగురు తనవైపే ఉన్నారన్నారు. 35 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ బీజేపీ అబద్ధమాడుతోందన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలుంటాయని స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్‌వాలా స్పష్టం చేశారు. మరోవైపు, స్పీకర్‌పై బీజేపీ అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో పాటు, రావత్ ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రావత్ ప్రభుత్వం మైనారిటీలో ఉన్నందువల్ల, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ శ్యామ్ జాజు డిమాండ్ చేశారు. 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో తమకు అందుబాటులోనే ఉన్నారని, తమకు మద్ధతిస్తున్న ఎమ్మెల్యేలను రాష్ట్రపతి ముందు హాజరు పర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.శారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్‌కు 36 మంది సభ్యులుండగా, బీజేపీ సభ్యులు 28 మంది ఉన్నారు. ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌కు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరత పాల్జే సేందుకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.