breaking news
government accomodation
-
గుర్తింపులేని పాఠశాలల్లో పిల్లల్ని చేర్చొద్దు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించకుండా తల్లిదండ్రులను చైతన్యపరిచే బాధ్యత విద్యాశాఖాధికారులపైనే ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ సురేశ్‌కుమార్ గురువారం ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలకు సంబంధించిన అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులకు సూచించారు. మండలాల వారీగా గురిం్తపు లేని పాఠశాలల జాబితాను విద్యాశాఖ కార్యాలయాల్లో బహిరంగ పర్చాలని ఎంఈవోలను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామని, ఏ విద్యార్థికైనా పుస్తకాలు అందకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలు తెరిచిన రోజు నుంచే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పనిసరిగా అమలుపర్చాలని, ఇందుకు జిల్లాకు రూ.ఆరు కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఈ నిధులతో ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా బియ్యం కోటాను పాఠశాలలకు పంపి, మరుసటి నెల కోటాకు ముందుగానే సమీక్షించుకోవాలని పౌర సరఫరాల సంస్థ అధికారులను కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో వంటశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. జిల్లాకు మంజూరైన 14 మోడల్ స్కూళ్లలో 13 నిర్మాణం పూర్తి చేసుకుని, వాటిలో తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈపూరులో స్థల సేకరణ సమస్యతో నిలిచిన మోడల్ స్కూల్ నిర్మాణం తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఎంఈవోలకు మెమోలు.. పొన్నూరు, చేబ్రోలు, నిజాంపట్నం, నగరం మండలాల్లో విద్యార్థులకు గత విద్యాసంవత్సరం యూనిఫాం ఇప్పటి వరకూ పంపిణీ చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మండలాల ఎంఈవోలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. 2014-15 విద్యాసంవత్సరానికి 2,66,340 మంది విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో డ్రాపౌట్లుగా గుర్తించిన 2,221 మందిని పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. వసతుల కల్పన వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు జేసీ కె. నాగేశ్వరరావు, పాఠశాల విద్య ఆర్జేడీ పి. పార్వతి, డీఈవో డి. ఆంజనేయులు, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ టి. శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో సుబ్బారావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లోనే వసతిగృహాల వివరాలు
ఇందూరు, న్యూస్‌లైన్ : ప్రభుత్వ వసతి గృహాలకు సంబంధించిన అన్ని వివరాలు తప్పనిసరిగా ఈ-పాస్ ఆన్లైన్లోనే నమో దు చేయాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ వాణీప్రసాద్ జిల్లా అధికారులకు సూచించా రు. శుక్రవారం వసతి గృహాల నిర్వహణ, ఆన్లైన్ నమోదు, విద్యార్థుల ఆధార్ నంబర్ ఎంట్రీ, ఇతర అంశాలపై జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ నెల నుంచి వసతి గృహాల పూర్తి సమాచారం ఆన్లైన్లో కనిపిం చాలన్నారు. గ్యాస్ సిలిండర్, కూరగాయాలు, కరెంట్ బిల్లు, ఇతర బిల్లులు ఆన్లైన్ నుంచి పొందాల్సి ఉంటుందన్నారు. కాగా విద్యార్థులకు అందజేసిన నోట్‌బుక్స్, బెడ్‌షీట్, యూనిఫాంల వివరాలు, వారి హాజరు శాతాన్ని ఈ-పాస్‌లో నమోదు చేయాలని సూ చించారు. బోగన్ హాజరు శాతాన్ని తొలగించాలని, రోజువారీగా పిల్లల హాజరును జిల్లా అధికారులు వార్డె న్ల నుంచి తెలుసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, చదువుకునేందుకు బుక్కులతో లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు ప్రతి వసతి గృహానికి రూ.2వేల చొప్పున నిధులు మంజురు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా ప్రతి విద్యార్థికి స్పోర్ట్స్ దుస్తులు త్వరలోనే అందజేయనున్నట్లు వెల్లడించారు. ఉపకార వేతనాలు పొందటానికి ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని, నంబరును ఆన్లైన్లో ఫీడింగ్ చే యించడంలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని అభినందించారు. అదేవిధంగా కొన్ని వసతి గృహాల్లో విద్యార్థులులేక సీట్లు ఖాళీగా ఉన్నాయని వా టిని త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, వంద శాతం పిల్లలుండాలని అధికారులను అదేశించా రు. ఈ సందర్భంగా జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి విమలాదేవి మాట్లాడుతూ జిల్లాలోని అందరు వార్డెన్లకు ఈ-పాస్ ఆన్లైన్ వెబ్సైట్లో వసతిగృహాల పూర్తి వివరాల నమోదుపై శిక్షణ ఇస్తున్నట్లు కమిషనర్‌కు తె లిపారు. అలాగే విద్యార్థుల హాజరుశాతాన్ని ఆన్లైన్ లో నమోదు చేశామని, ఆధార్ ఫిడింగ్కు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏబీసీడబ్ల్యూఓ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ సూపరింటెండెంట్ రమేశ్, జూనియర్ అసిస్టెంట్ రేవంత్ పాల్గొన్నారు.