-
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్‌లో భాగంగా.. పంజాబ్‌లో ఒకరిని, కోల్‌కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్‌తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్‌తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్‌కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్‌లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజ కంపెనీల మధ్య ఒప్పందం జరిగినట్లు కోర్టు పత్రాల ద్వారా బట్టబయలైంది. యాపిల్ సఫారి బ్రౌజర్లో గూగుల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండటానికి 2022లో 20 బిలియన్ డాలర్లు(రూ.1.66లక్షల కోట్లు) చెల్లించినట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది. గూగుల్‌కు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన యాంటీట్రస్ట్ దావాలో ఈ విషయం వెలుగుచూసింది.ఆన్లైన్ ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కోర్టులో గతంలో యాంటీట్రస్ట్ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో రెండు టెక్ దిగ్గజాల మధ్య ఒప్పందం జరిగినట్లు ఇటీవల తేలింది. విచారణ జరుపుతున్న న్యాయ శాఖ ఏడాది చివర్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.ఇటీవల జరిగిన విచారణలో రెండు కంపెనీల మధ్య ఒప్పందం జరిగిందని ధ్రువీకరించాయి. ఇందుకోసం జరిగిన చెల్లింపుల మొత్తాన్ని బహిర్గతం చేయకుండా చూడాలని భావించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కోర్టు విచారణలో నంబర్లు వెల్లడించకుండా ఈ ఒప్పందానికి గూగుల్ ‘బిలియన్లు’ చెల్లించినట్లు యాపిల్ చెప్పింది. యాపిల్ డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉన్నందుకు సెర్చ్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 36 శాతం గూగుల్ యాపిల్‌కు చెల్లిస్తున్నట్లు తెలిసింది.కోర్టు పత్రాల వల్ల యాపిల్‌కు వస్తున్న ఆదాయమార్గాల గురించి కూడా స్పష్టత వచ్చినట్లయింది. 2020లో యాపిల్ నిర్వహణ ఆదాయంలో దాదాపు 17.5 శాతం గూగుల్ నుంచి సమకూరిందేనని అంచనా. గూగుల్ డిఫాల్ట్ ఒప్పందాల్లో యాపిల్ డీల్ అత్యంత ముఖ్యమైంది. యూఎస్‌లో అధికంగా ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ సెర్చ్ ఇంజిన్ సఫారి బ్రౌజర్ కావడంతో గూగుల్‌కు ఈ ఒప్పందం ప్రధానంగా మారింది. 2002లో సఫారీ బ్రౌజర్లో గూగుల్‌ను ఉచితంగా ఉపయోగించేందుకు యాపిల్ మొదట అంగీకరించింది. కానీ సెర్చ్ ప్రకటనల ఆదాయం పెరుగుతున్న కొద్దీ దాన్ని ఇరు కంపెనీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మే 2021 నాటికి సఫారి బ్రౌజర్లో డిఫాల్ట్ సెర్చ్ఇంజిన్ కోసం యాపిల్‌కు నెలకు 1 బిలియన్ డాలర్లు(రూ.8300 కోట్లు) కంటే ఎక్కువే చెల్లించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఇదీ చదవండి: బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లుసెర్చ్ ఇంజిన్‌లో గూగుల్‌తో పోటీపడుతున్న బింగ్‌ను యాపిల్ డిఫాల్ట్‌బ్రౌజర్‌గా ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్ సంస్థ చాలానే ప్రయత్నించింది. కోర్టులో దాఖలైన పత్రాల ప్రకారం..సఫారీలో బింగ్‌ను డిఫాల్ట్‌గా ఉంచడానికి కంపెనీ తన ప్రకటనల ఆదాయంలో 90 శాతం యాపిల్‌కు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధ పడింది. -
సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్‌గా సుందర్ పిచాయ్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్‌లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్గాగూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.సీఈఓ అనే సింహాసనం మీదఅందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్ డాక్‌లలో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్ పిచాయ్ ఆదాయం భారీగా పెరిగింది. త్వరలో బిలీయనీర్పలు నివేదికల ప్రకారం.. గూగుల్‌తో పాటు గూగుల్ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్ ఏఐ టూల్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. -
గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్.. ఎందుకో తెలుసా..
టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ ఫ్లట్టర్, డార్ట్, పైథాన్ టీమ్‌ల నుంచి ఉద్యోగులను తొలగించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. త్వరలో సంస్థ యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరుగనున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉద్యోగాలు కోల్పోయినవారు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో ఈ అంశాన్ని వైరల్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంతమందికి లేఆఫ్స్ ప్రకటించారో మాత్రం స్పష్టం కాలేదు.ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఉద్యోగాలు కోల్పోయినవారు కంపెనీలోని ఇతర విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కంపెనీ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో తొలగింపు ప్రక్రియ అమలుచేసింది. కంపెనీ ఫైనాన్స్ విభాగంలో పనిచేసిన ఉద్యోగులను ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారు’ అని చెప్పారు.గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ లేఆఫ్స్‌కు సంబంధించి ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో స్పందిస్తూ.. కంపెనీ నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్ వంటి ప్రదేశాల్లో గూగుల్ ‘గ్రోత్ హబ్‌లను’ నిర్మిస్తుందని చెప్పారు. రాబోయే అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలన్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..జనవరిలోనూ వందల మంది ఉద్యోగులను ఇంజినీరింగ్, హార్డ్‌వేర్, అసిస్టెంట్ బృందాల్లో గూగుల్ తొలగించింది. కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాలను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారిస్తుండడంతో ఇలా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని తెలిసింది. -
గూగుల్‌లో నిరసన సెగ..రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్..
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు చివరకు కార్పొరేట్ రంగంలోనూ ప్రవేశించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలో నిరసనగళం వినిపించింది. గూగుల్ ఉద్యోగులు కంపెనీ క్లౌడ్ సీఈఓనే ఎదురించేస్థాయికి వెళ్లారు. ఏకంగా రూ.10వేల కోట్ల ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. దాంతో చివరకు అలా నిరసనకు దిగిన ఉద్యోగులు అరెస్టయిన ఘటన ఇటీవల గూగుల్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం. హమాస్-గాజా మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ సెగ చివరకు కార్పొరేట్ సంస్థలను తాకింది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగుల్లో కొందరు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా కాలిఫోర్నియా కార్యాలయంలోని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఛాంబర్‌ను చుట్టుముట్టారు. ఇజ్రాయెల్ దేశంతో కంపెనీ చేసుకున్న ఒప్పందాలను వెంటనే నిలిపేయాలని నిరసన గళం వినిపించారు. దాదాపు ఈ నిరసన 8 గంటలపాటు సాగింది. ఈమేరకు లైవ్‌లో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ⚡️⚡️28 employees entered Google CEO’s office and threatened to stay there until Google canceled its $1.2 billion contract with the Israeli government. Instead, Google has FIRED all of them from jobpic.twitter.com/LZSrksIY1U — Megh Updates 🚨™ (@MeghUpdates) April 18, 2024 డిమాండ్‌లో పాల్గొన్న ఉద్యోగులను అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉంచినట్లు కంపెనీ తెలిపింది. అయినా అక్కడి నుంచి ఏమాత్రం నిరసన విరమించుకోకపోవడంతో చర్యలు చేపట్టింది. ఉద్యోగుల వ్యవహారంతో చేసేదేమిలేక గూగుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఉద్యోగులు తీసిన వీడియోలో వారు కూర్చున్న గది ముందు ‘డ్రాప్‌నింబుస్’ బ్యానర్ కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గతంలో గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని పేరు ‘ప్రాజెక్ట్ నింబుస్’. దాని విలువ 1.2 బిలియన్ డాలర్లు(రూ.10 వేలకోట్లు). అయితే ఆ దేశంతో చేసుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ముస్లిం ఉద్యోగులపై వేధింపులు ఆపాలని కోరారు. వారిపై బెదిరింపులకు పాల్పడకూడదని, ఆ వ్యవహారాన్ని సమరస్యంగా పరిష్యరించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగుల వ్యవహారానికి సంబంధించి కంపెనీ ఘాటుగానే స్పందించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ నిరసనలో పాల్గొన్ని దాదాపు 28 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. ఇదీ చదవండి: భారత్‌లో సోలార్ సొల్యూషన్స్ అందిస్తున్న నం.1 కంపెనీ BREAKING: Google employees were arrested after occupying their boss's office for more than 8 hours to demand that the company sever ties with Israel. WATCH: pic.twitter.com/W4WQO8NNgH — Kassy Akiva (@KassyDillon) April 17, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్‌తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement