breaking news
goa visit
-
రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు వచ్చి చేరాయి. గోవా పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ నుంచి వచ్చేటప్పుడు రెండు కుక్క పిల్లలను ఢిల్లీలోని తన నివాసానికి తీసుకొచ్చారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన మూడు నెలల వయసు రెండు కుక్క పిల్లలను పెంచుకునేందుకు తీసుకున్నారు. కాగా బుధవారం సాయంత్రం గోవా వెళ్లిన రాహుల్ గాంధీ గురువారం ఉదయం మళ్లీ ఢిల్లీ చేరుకున్నారు. తన పర్యటనలో గోవాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పట్కర్తో ఓ హోటల్లో భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై వారితో చర్చించారు. పర్యటన ముగించుకొని మోపాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ముందు షేడ్స్ కెన్నెల్ అనే పెంపుడు జంతువుల విక్రయ సంస్థను సందర్మించారు. శివాని పిత్రే అనే మహిళ తన భర్తతో కలిసి నార్త్ గోవాలోని మపుస ప్రాంతంలో దీనిని నడుపుతోంది. అక్కడ జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఒక మగ, ఒక ఆడ కుక్కను కొనుగోలు చేశారు. అయితే విమానయాన నిబంధనల కారణంగా ఒక కుక్కను మాత్రమే తనతో దిల్లీ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ విమానాశ్రయానికి బయలుదేరే ముందు కొద్దిసేపు కెన్నెల్లో కుక్క పిల్లలతో గడిపారని పిత్రే పేర్కొన్నారు. చదవండి: అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు ఆయన అత్యంత నిరాడంబరుడని, తమతో ఓ స్నేహితుడిలా మాట్లాడారని తెలిపారు. కెన్నెల్లో కుక్కపిల్లలతో కలిసి రాహుల్ గాంధీ ఆడుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ రెండు కుక్క పిల్లలను కొనుగోలు చేశారని, వీటిలో ఒక పప్పీని ఆయన ఇంటికి తీసుకెళ్లారని మరో దానిని తరువాత పంపిస్తామని శివాని తెలిపారు. ముందుగా రాహుల్ గాంధీ సిబ్బంది ఒకరు వచ్చి పప్పీల గురించి తెలుసుకున్నారని, అయితే వాటిని కొనుగోలు చేసే ముందు ఆయనే స్వయంగా వాటిని చూసేందుకు ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అజీమ్ ప్రేమ్ జీ, కరీనా కపూర్ వంటి పలువురు ప్రముఖులు ఈ జాతి కుక్కలను కొనుగోలు చేశారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతి శునకాలకు బ్రిటన్లో విపరీతమైన జనాదరణ ఉంది. వీటి ఆహార్యం చిన్నగా కన్పించినా.. అవి చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. 4 నుంచి 7 కిలోల బరువుండే ఈ కుక్కలు 25 సెంటీమీటర్ల దాకా ఎత్తు పెరుగుతాయి. వీటి జీవిత కాలం కూడా ఎక్కువే. రష్యాకు చెందిన మందుపాతరలు, బాంబులను పసిగట్టినందుకు ఇదే జాతికి చెందిన పీట్రన్ అనే శునకానికి ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పతకాన్ని బహూకరించారు. చదవండి: అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు -
ఎకానమీ క్లాస్ లో ప్రయాణించిన రక్షణమంత్రి
న్యూఢిల్లీ: దేశ రక్షణ మంత్రి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. అధికార ఆడంబరాలను పక్కకుపెట్టి విమానంలో ఆయన ఎకానమీ క్లాస్ లో ప్రయాణించారు. నాలుగు రోజుల పర్యటన కోసం విమానంలో గోవా వెళ్లిన ఆయన సాధారణ ప్రయాణికులు ప్రయాణించే ఎకానమీ క్లాస్ లో ఎక్కారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన గోవా షిప్ యార్డును ఆయన సందర్శిస్తారు. నావికాదళ అధికారులతో భేటీ అవుతారు. 58 ఏళ్ల పారికర్ గతవారం వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటుకు ఆయన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.