breaking news
glasses blast
-
సిటీ బస్సులపై రాళ్ల వర్షం
హైదరాబాద్: కొందరు ఆందోళనకారులు రెండు సిటీ బస్సులపై రాళ్లు రువ్వి వాటి అద్దాలు ధ్వంసం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ.. అఖిలపక్షాలు చేపట్టిన బంద్‌లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని డిపోల ఎదుట శాంతీయుతంగా నిరసనలు తెలుపుతున్న విపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, దగ్గర్లో ఉన్న పీఎస్‌లకు తరలించారు. కాగా.. నగరంలోని ఆబిడ్స్ జీపీఓ వద్ద రెండు సిటీ బస్సులపై కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రెండు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సుల్లో ఉన్న ఎవరికీ గాయాలు కాలేదు. మరో వైపు రాజేంద్రనగర్‌లో ఆందోళన చేపట్టిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లిలో కొందరు ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై రాళు రువ్వారు. ఈ ఘటనలో బసు అద్దాలు ధ్వంసం అయ్యాయి. -
తిరుమలలో బారులు తీరిన భక్తులు
-
తిరుమలలో కట్టలు తెంచుకున్న భక్తుల ఆగ్రహం
తిరుమల: తిరుమలలో ఫుట్‌పాత్ లగేజీ కౌంటర్ వద్ద ఆదివారం మధ్యాహ్నం పలువురు భక్తులు అసహనంతో విధ్వంసానికి పాల్పడ్డారు. లగేజీ కౌంటర్లో ఒక్కరే సిబ్బంది ఉండడంతో భక్తులు క్యూలైన్లో భారీ సంఖ్యలో నిలబడిపోయారు. ఎటూ వేళ్లే మార్గం లేకపోవడంతో వారిలో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో కౌంటర్ విండో అద్దాలను వారు ధ్వంసం చేశారు. కాలినడకన వచ్చిన భక్తులు తమ లగేజీలను ఈ కౌంటర్లో ఉంచి వెళ్తుంటారు.