breaking news
Gizmodo
-
‘AI నా ఉద్యోగాన్ని లాగేసుకుంది’
ఓ వైపు ఆర్ధిక మాంద్యం, మరోవైపు చిన్న చిన్న కంపెనీల నుంచి అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు. ఇలాంటి టైంలో మానవ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాంటి టూల్స్ వినియోగం పెరగడం. వాటివల్ల ఉద్యోగం కోల్పోయిన వారి బాధల్ని, కష్టాల్ని, కన్నీటిని వివరించడం వర్ణనాతీతం. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన చాట్‌జీపీటీ సహా ఏఐ జనరేటివ్ టూల్స్ రాకతో ఉద్యోగాలు కనుమరుగవుతాయనే చర్చ టెక్ ప్రపంచంలో ఊపందుకుంది. ఇప్పటికే పలు రంగాల్లో ఎన్నో ఉద్యోగాలను ఏఐ టూల్స్ రీప్లేస్ చేయడంతో ఈ భయాలు మరింత పెరుగుతున్నాయి. ఏఐ నా ఉద్యోగాన్ని లాగేసుకుంది ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగం కోల్పోయానంటూ ఓ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. 2002లో ప్రముఖ టెక్ బ్లాగ్ గిజ్మోడో ప్రారంభమైంది. అయితే తాజాగా, గిజ్మోడో స్పానిష్ (Español) లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని యాజమాన్యం తొలగించింది. వారి స్థానంలో చాట్‌జీపీటీని వినియోగించడం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఉద్యోగం కోల్పోయిన బాధిత ఉద్యోగుల్లో ఒకరైన మాటియాస్ ఎస్ జవియా ట్విటర్ వేదికగా స్పందించారు. ఏఐ నా ఉద్యోగాన్ని లాగేసుకుంది. గిజ్మోడ్ ట్రాన్స్‌లేటర్లను మార్చేసేంది. వారి స్థానంలో ఏఐని ఉపయోగిస్తుంది. అంటే మనుషులు ఉద్యోగుల్ని ఏఐ రిప్లేస్ చేసిందంటూ ట్వీట్లో వాపోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టికల్స్ ‘ఆర్టిఫిషియల్’గానే ఉన్నాయ్ ఉద్యోగుల తొలగింపుపై గిజ్మోడో కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంజీ అనే కార్మిక సంఘం సైతం కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గిజ్మోడోలో ఎంతో నైపుణ్యం కలిగిన పాత్రికేయుల స్థానంలో కృత్రిమ మేధను తీసుకురావడాన్ని కార్మిక సంఘం ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఏఐని ఉపయోగించి ట్రాన్స్లేషన్ చేయడం అంత మంచిది కాదు. ఆ ఆర్టికల్స్‌ను యూజర్లను ఆకట్టుకోవడం లేదు. ఆక్షర దోషాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమోషన్ క్యారీ చేసేలా అంశాలు లేవని అన్నారు. సంస్థలు పట్టించుకోవడం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తమ ఉద్యోగాలు పోయాయని గతంలో కార్మికులు ఫిర్యాదు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ కంపెనీలు ఉద్యోగుల ఆవేదనని పట్టించుకోవడం లేదు. డబ్బును ఆదా చేసేందుకు, వేగవంతంగా వారి పని పూర్తి చేసేందుకు సహకరిస్తున్న ఏఐ టూల్స్‌ను వినియోగించేందుకు మొగ్గు చూపడం గమనార్హం. -
చీటింగ్ చేస్తున్న ఫేస్బుక్!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఛీటింగ్ చేస్తుందా? తనకు గిట్టని సంప్రదాయవాద రాజకీయ కథనాలను 'ట్రెండింగ్' జాబితా నుంచి అర్ధంతరంగా తొలగిస్తున్నదా? అంటే టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ 'గిజ్మోడో' ఔననే అంటున్నది. సంప్రదాయవాద పాఠకులకు ఆసక్తి కలిగించే వార్తలు 'ట్రెండింగ్' జాబితాలో కనిపించకుండా.. ఫేస్బుక్ ఉద్యోగులు నిత్యం తోసి అవతలకు పారేస్తారని ఆ సైట్ మాజీ ఉద్యోగి ఒకరు గిజ్మోడోకు తెలిపాడు. అదేసమయంలో ట్రెండింగ్ లిస్ట్‌లోకి ఇతర కథనాలను 'కృత్రిమంగా' చేరుస్తారని వెల్లడించాడు. ఈ కథనంతో ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ పక్షపాతంతో ఫేస్బుక్ వ్యవహరిస్తున్నదని, ఆ సైట్లో 'ట్రెండింగ్ లిస్ట్' నిర్వహణలో పారదర్శకత లేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కథనంపై ఫేస్బుక్ స్పందిస్తూ.. తటస్థత పాటించే విషయంలో తమ వెబ్సైట్ కచ్చితమైన, కఠినమైన మార్గదర్శకాలను అనుసరిస్తున్నదని మీడియాకు వివరణ ఇచ్చింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ట్రెండింగ్ టాపిక్స్‌లో కనిపించకుండా ఏ మీడియా సంస్థను నిషేధించడం కుదరదని తెలిపింది. 'రాజకీయ అభిప్రాయాలను తొక్కివేసేందుకు మా మార్గదర్శకాలు ఎంతమాత్రం అనుమతించవు. అదేవిధంగా ఏదైనా రాజకీయ అభిప్రాయంగానీ, మీడియా సంస్థగానీ ఒకదాని కన్నా మరొకటి అధిక ప్రాధాన్యం పొందేందుకు వీలు కల్పించవు' అని ఫేస్బుక్ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. కాగా, 'ఇది అతివాద భావజాలానికి ఆజ్యం పోయడమే కాకుండా సోషల్ సమాచార నియంత్రణకు సిలికాన్ వ్యాలీ ప్రయత్నిస్తున్నట్టు ప్రమాదకర సంకేతాలు ఇస్తోంది' అని ప్రముఖ జర్నలిస్టు గ్లెన్ గ్రీన్వాల్డ్.. ఫేస్‌బుక్‌పై మండిపడ్డారు.