breaking news
Girls face
-
యాసిడ్ దాడి జరిగిన 28 ఏళ్లకు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
షాజహాన్‌పూర్: పెళ్లిని రద్దు చేసుకున్నారనే కోపంతో ఓ యువకుడు, వధువు కావాల్సిన 15 ఏళ్ల బాలిక ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘోరం 1997 అక్టోబర్ 28వ తేదీన యూపీ రాజధాని లక్నోలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక ముఖమంతా కాలిపోయింది. చూపుమందగించింది. నేరానికి గాను పప్పు అనే నిందితుడికి జైలు శిక్ష పడింది. అయితే, బాధితురాలిది తీరని వ్యథ అయ్యింది. అప్పట్నుంచి ఆమె ముఖానికి పలు శస్త్రచికిత్సలు జరిగాయి. టైలర్‌గా పనిచేసే తండ్రి సంపాదించిందంతా ఆమె కోసమే ఖర్చు చేశాడు. అనంతర కాలంలో తల్లి,తండ్రి చనిపోయారు. తోబుట్టువులు వదిలేశారు. ఒంటరిగా బతుకు లాగుతోంది. ఆమె తరఫున బ్రేవ్ సౌల్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో పోరాడుతోంది. యాసిడ్ దాడి బాధితురాలికి అవసరమైన సాయం అందజేయాలని అధికారులు, నేతల చుట్టూ ఆ సంస్థ వ్యవస్థాపకురాలు షహీన్ మాలిక్ తిరుగుతూనే ఉన్నారు. బాధితురాలికిప్పుడు 43 ఏళ్లు. ఎట్టకేలకు, 28 ఏళ్లకు ఇటీవలే యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు అందజేసింది. కేంద్రం నుంచి గతేడాది రూ.లక్ష బాధితురాలికి అందాయి. అయితే, తాము న్యాయం కోసం హైకోర్టుకు వెళతామని, బాధితురాలికి రూ.50 లక్షలు పరిహారం అందించాలని కోరుతామని షహీన్ తెలిపారు. బాధితురాలు ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నారన్నారు. ‘నా ముఖంతోపాటు జీవితం కూడా ఒక్క క్షణంలోనే నాశనమైపోయాయి. నా తల్లిదండ్రులు ఇప్పుడు లేరు. సోదరులు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడిక కేవలం గౌరవంగా బతకాలని కోరుకుంటున్నా’అని బాధితురాలు ఆవేదన చెందుతున్నారు. -
ముఖారవిందానికి హోమ్మేడ్ బిందీ..!
అమ్మాయి ముఖం అనగానే, అందరికీ ముందుగా గుర్తొచ్చేది నుదుటి మీది బొట్టు. ఒకప్పుడంటే కుంకుమ తప్ప వేరేదీ కనిపించేది కాదు కానీ... మారుతోన్న ట్రెండ్సని బట్టి రకరకాల బొట్లు అందుబాటులోకి వచ్చాయి. డ్రెస్సు రంగును బట్టి ఆ రంగు బిందీ పెట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అయితే ఒక్కోసారి ఏ ఫంక్షన్‌కో పార్టీకో హఠాత్తుగా వెళ్లాలనుకుంటే అప్పటికప్పుడు మ్యాచింగ్ బిందీ కొనుక్కునే అవకాశం ఉండదు. అలాంటప్పుడు కష్టపడి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ టెక్నిక్స్‌తో అప్పటికప్పుడు మీకు కావలసిన బొట్టును తయారు చేసుకోవచ్చు. కావలసినవి: దళసరిగా ఉండే పేపర్, గ్లూ (జిగురు), కుందన్స్, స్టోన్స్, కలర్స్ తయారీ: మొదట పేపర్‌పై నచ్చిన డిజైన్‌ను పెన్సిల్‌తో గీసుకోవాలి. ఆ డిజైన్‌కు తగ్గ రంగులు వేసుకోవాలి. వాటిమీద కుందన్స కావాలంటే కుందన్స, స్టోన్స కావాలంటే స్టోన్సని జిరుగు రాసి అతికించాలి. జిగురు పూర్తిగా ఆరిపోయేవరకూ ఉంచి... ఆ తర్వాత డిజైన్ పాడవకుండా కత్తెరతో జాగ్రత్తగా కత్తిరించుకోవాలి. తర్వాత దాని కింది భాగంలో గ్లూ రాసి, అదే ఆకారంలో కత్తిరించిన పల్చటి పేపర్‌ను అతికించాలి. బిందీని పెట్టుకునేటప్పుడు అడుగున పేపర్ తీసేసి పెట్టుకుంటే సరి. అయితే బిందీల కోసం ప్రత్యేకమైన జిగురు ఉంటుంది. అదే వాడండి. కొన్ని చోట్ల ఆల్రెడీ గ్లూతో ఉన్న షీట్స్ దొరుకుతున్నాయి. వాటితోనే తయారుచేసుకుంటే ఇబ్బందే ఉండదు.


