ముఖారవిందానికి హోమ్మేడ్ బిందీ..!
అమ్మాయి ముఖం అనగానే, అందరికీ ముందుగా గుర్తొచ్చేది నుదుటి మీది బొట్టు. ఒకప్పుడంటే కుంకుమ తప్ప వేరేదీ కనిపించేది కాదు...
అమ్మాయి ముఖం అనగానే, అందరికీ ముందుగా గుర్తొచ్చేది నుదుటి మీది బొట్టు. ఒకప్పుడంటే కుంకుమ తప్ప వేరేదీ కనిపించేది కాదు కానీ... మారుతోన్న ట్రెండ్‌సని బట్టి రకరకాల బొట్లు అందుబాటులోకి వచ్చాయి. డ్రెస్సు రంగును బట్టి ఆ రంగు బిందీ పెట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అయితే ఒక్కోసారి ఏ ఫంక్షన్‌కో పార్టీకో హఠాత్తుగా వెళ్లాలనుకుంటే అప్పటికప్పుడు మ్యాచింగ్ బిందీ కొనుక్కునే అవకాశం ఉండదు. అలాంటప్పుడు కష్టపడి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ టెక్నిక్స్‌తో అప్పటికప్పుడు మీకు కావలసిన బొట్టును తయారు చేసుకోవచ్చు.
కావలసినవి: దళసరిగా ఉండే పేపర్, గ్లూ (జిగురు), కుందన్స్, స్టోన్స్, కలర్స్
తయారీ: మొదట పేపర్‌పై నచ్చిన డిజైన్‌ను పెన్సిల్‌తో గీసుకోవాలి. ఆ డిజైన్‌కు తగ్గ రంగులు వేసుకోవాలి. వాటిమీద కుందన్‌స కావాలంటే కుందన్‌స, స్టోన్‌స కావాలంటే స్టోన్‌సని జిరుగు రాసి అతికించాలి. జిగురు పూర్తిగా ఆరిపోయేవరకూ ఉంచి... ఆ తర్వాత డిజైన్ పాడవకుండా కత్తెరతో జాగ్రత్తగా కత్తిరించుకోవాలి. తర్వాత దాని కింది భాగంలో గ్లూ రాసి, అదే ఆకారంలో కత్తిరించిన పల్చటి పేపర్‌ను అతికించాలి. బిందీని పెట్టుకునేటప్పుడు అడుగున పేపర్ తీసేసి పెట్టుకుంటే సరి. అయితే బిందీల కోసం ప్రత్యేకమైన జిగురు ఉంటుంది. అదే వాడండి. కొన్ని చోట్ల ఆల్రెడీ గ్లూతో ఉన్న షీట్స్ దొరుకుతున్నాయి. వాటితోనే తయారుచేసుకుంటే ఇబ్బందే ఉండదు.


