breaking news
girlchilds
-
కొడుకు పుట్టలేదని గొంతుకోశారు
మహబూబ్‌నగర్: ఇద్దరు ఆడపిల్లల తల్లి ఆమె. కొడుకు పుట్టలేదని రెండేళ్లుగా అత్తింటివారు వేధింపులకు గురి చేస్తున్నారు. కాపురం రోడ్డున పడరాదని ఇన్నాళ్లు మౌనంగా భరించింది. చివరకు ప్రాణం మీదకు తెచ్చుకుంది. భర్త, అత్తమామలు కలిసి ఆమెను చంపబోయారు. కత్తి, బ్లేడుతో ఆమె గొంతు కోశారు. అదృష్టవశాత్తు చావు నుంచి తప్పించుకున్న ఆమె ఆదివారం కొడంగల్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ (28)ను పదేళ్ల క్రితం ఇందనూర్ గ్రామానికి చెందిన రవీందర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్లు వారి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మగసంతానంపై ఆశలు పెట్టుకున్న అత్తింటివారికి ఆడపిల్లలు పుట్టడం సహించలేదు. మూడో కాన్పులో కూడా ఆడపిల్ల పుడితే ఏమి చేయాలని వారు ఆలోచించారు. ఎలాగైన ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నించారు. భర్త రవీందర్, అత్తమామాలు ఎల్లమ్మ, మొగులయ్య, మరిది నరేష్ మరో ఇద్దరు కుటుంబసభ్యులు కలిసి పథకం ప్రకారం ఈనెల 10వ తేది శుక్రవారం రాత్రి బ్లేడు, చాకుతో ఆమెపై దాడి చేశారు. గొంతు కోశారు. వారి దాడి నుంచి తప్పించుకున్న లక్ష్మీ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది.దీంతో కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రోజు కొడంగల్ వచ్చి పోలీసులు ఫిర్యాదు చేశారు. -
ఆ నలుగురిదీ ఒకే బాట!
అక్కాచెల్లెళ్లు అన్న తర్వాత గిల్లికజ్జాలాడుకోవడం, వాదనలకు దిగడం మామూలే. కానీ ‘శాస్త్రీ సిస్టర్స్’ అలా కాదు. ఆ నలుగురు అక్కాచెల్లెళ్లదీ ఒకే మాట, ఒకే బాట! ఓ మధ్య తరగతి తండ్రికి నలుగురు ఆడపిల్లలు. భార్య పోయాక అల్లారుముద్దుగా పెంచుతాడు. క్రమశిక్షణ, మంచితనం అల వడేలా చేస్తాడు. వాళ్లు పెద్దవాళ్లయ్యాక కొన్ని కారణాల వల్ల ఉన్న ఊరు వదిలి పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఆ నలుగురు పిల్లలకీ రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. సమస్యలు ఏర్పడతాయి. వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు, తండ్రికి బాధ కలగకుండా నలుగురూ కలిసి సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారు అనేదే కథ. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో మెలగాలని తెలిపే ఈ సీరియల్‌ని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు తప్పక చూడాలి. చక్కని వినోదంతో పాటు, విలువలను కూడా నేర్పే సీరియల్ ఇది!