breaking news
Geeth Saini
-
సంకల్పమే శక్తి స్వరూపం..!
పల్లెటూరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుకుంటుంది. కానీ ఎన్నో అడ్డంకులు. ఆటంకాలు. ఆడపిల్లకు అవసరమా అని ప్రశ్నలు. అయితే సంకల్పమే శక్తిగా ఆ అమ్మాయి అనుకున్నది సాధిస్తుంది. ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్న ‘కన్యాకుమారి’లో హీరోయిన్ గీత్ షైనీతన సంకల్పాల గురించి దసరా దాండియా గురించి చెబుతున్న విశేషాలు. ‘నేను చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదువుకున్నాను. స్కూలు ఫస్ట్ వచ్చాను. కాలేజీ ఫస్ట్ వచ్చాను. ఎంసెట్‌లో ర్యాంక్ తెచ్చుకున్నాను. అయినా సరే నా కోరికలు ఏవీ మీరు పట్టించుకోలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానంటే డిగ్రీలో చేర్పించారు. ఇంత తెలివి పెట్టుకుని చీరల కొట్టులో సేల్స్గర్ల్లా చీరలు అమ్ముకుంటున్నాను’ అని తల్లిదండ్రులను, అన్నయ్యను నిలదీసి తన వేదనను చెప్పుకుంటుంది కన్యాకుమారి అనే అమ్మాయి ‘కన్యాకుమారి’ సినిమాలో.కన్యాకుమారిది ఒకటే కల. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనేది. కాని ఇంటి పరిస్థితులు, అమ్మాయి అనే కారణంతో చదివించక΄ోవడం... ఇవన్నీ ఆమె కలలను సగంలోనే తుంచేస్తాయి. కాని కన్యాకుమారి తన కలను లోలోపల సజీవంగా ఉంచుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తి ప్రేమను గౌరవిస్తూనే, రైతుగా ఉండాలనే అతని అభిలాషను గౌరవిస్తూనే తన లక్ష్యం తీవ్రతను అందరికీ తెలియచేసి హైదరాబాద్‌కు వెళ్లి సాఫ్ట్వేర్ కోర్సులు చేయడమే కాదు పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అమెరికాకు కూడా వెళ్లి వచ్చి అప్పుడు పెళ్లి చేసుకుంటుంది.ఇటీవల ఇలాంటి పట్టుదల ఉన్న అమ్మాయి కథ తెలుగులో లేదు. అందుకే ఓటీటీలో ‘కన్యాకుమారి’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ పాత్ర పోషించిన గీత్ సైనీకి ప్రేక్షకులు ఫుల్‌మార్కులు వేస్తున్నారు. గీత్‌తో సంభాషణ:మీ పేరు తెలుగు పేరనిపించడం లేదు.గీత్ సైనీ: మా పూర్వికులది రాజస్థాన్. మా తాతల కాలంలోనే అదిలాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అదిలాబాద్‌లో నేను పుట్టి పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో మా కుటుంబం సెటిల్ అయ్యింది. మా నాన్న టీచర్. అమ్మ హౌస్ వైఫ్. యాక్టింగ్ మీద ఆసక్తి ఎలా?జ: స్కూల్లో బాగా అల్లరి చేసేదాన్ని. టీచర్లను ఇమిటేట్ చేసి ఫ్రెండ్స్‌ను నవ్వించేదాన్ని. డాన్సర్ కావాలనుకున్నాను. అయితే టెన్త్ క్లాస్ అయ్యాక అందరు ఫ్రెండ్స్ నా ఆటోగ్రాఫ్ బుక్‌లో ‘నువ్వు మంచి నటివి అవుతావు’ అని రాశారు. వారు రాసింది చూశాక నేను నటిని కావాలనుకునే కోరిక నాలో నా చుట్టూ ఉందనిపించింది. తొలి అవకాశం ఎలా వచ్చింది?జ: నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాను. థర్డ్ ఇయర్లో ఉండగా కాలేజీ ఈవెంట్లో డాన్స్ చేస్తే ఒక సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ చూసి ‘అల’ అనే షార్ట్‌ఫిల్మ్ కోసం నన్ను సంప్రదించారు. అయితే ఈ అవకాశం వచ్చినట్టు నాన్నకు చెప్పే ధైర్యం లేక మెసేజ్ చేశాను– ఇలా చాన్స్ వచ్చింది... నో చెప్పేశాను అని. నాన్న కాసేపటికి ఫోన్ చేసి ‘మంచి డైరెక్టర్ అంటున్నావు కదా బేటా చేయి’ అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను.తొలి సినిమా అవకాశం?జ: సృజన్ అట్టాడ తన ‘పుష్పక విమానం’ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన ఇస్తే నా ఫ్రెండ్ నా ఫొటోలు పంపింది. అలా ఆ సినిమాలోని రెండు ఫిమేల్ లీడ్ క్యారెక్టర్లలో ఒకటిగా చేశాను. అయితే సృజన్ తీయబోతున్న ‘కన్యాకుమారి’ లో నాకు హీరోయిన్ చాన్స్ వస్తుందనుకోలేదు. శ్రీకాకుళం అమ్మాయిగా మారి ఆడిషన్ ఇచ్చాక ఆయన సంతృప్తి చెంది ఈ అవకాశం ఇచ్చారు. కన్యాకుమారి పాత్రను ఎలా ఓన్ చేసుకున్నారు?జ: నేను బయట మామూలుగా చాలా కామ్‌గా ఉంటాను. ఎవరైనా బాగా పరిచయమైతే ఇక నా వాగుడు తట్టుకోవడం కష్టం. ఆ లోపలి మనిషిని ఈ పాత్ర కోసం బయటకు తెచ్చాను. ఆడపిల్లలు తమ రెక్కలను పూర్తిగా సాచాలి. సీతాకోక చిలుకల్లా ఎగరాలి. అందుకే పోస్టర్లో సీతాకోక చిలుక ఉంటుంది. అలాంటి గట్టి పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అందులో చీరల పేర్లన్నీ చెప్పే క్లిప్ బాగా వైరల్ అవుతోంది. చిన్నపుడు మీరు దసరా ఎలా జరుపుకునేవారు?జ: ఆదిలాబాద్‌లో మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సరిహద్దు ప్రాంతం కాబట్టి. దసరా వస్తే బాగా దాండియా ఆడేవాళ్లం. బతుకమ్మ కూడా ఆడేదాన్ని. కన్యాకుమారి షూట్ సమయంలో శ్రీకాకుళంలో ఉన్నప్పుడు దసరా వచ్చింది. అక్కడ దసరా సందడి వేరేగా అనిపించింది. వీధి వీధికి దుర్గ మంటపాలు, కోలాటం... చాలా సందడి చేశాం అందరం.నేటి అమ్మాయిలకు ఏం చెబుతారు?జ: ఏ సందర్భంలోనూ ఓటమి ఒప్పుకోవద్దు. కల ముగిసిపోయిందని అనుకోవద్దు. మరుగున పడ్డ లక్ష్యాలను తిరిగి సజీవం చేసుకుని పోరాడాలి. ఏదో ఒకరోజుకు గెలుస్తాం.– సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి (చదవండి: Vijayadashami: స్త్రీ శక్తే విజయ దశమి..) -
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా
విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ‘కన్యా కుమారి’ ఓటీటీలోకి రాబోతుంది. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించిన వినాయక చవితి కానుకగా గత నెల 27న థియేటర్స్ లోకి వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. రేపటి నుంచి(సెప్టెంబర్ 17)ఈ చిత్రం అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి ‘పుష్పక విమానం’ ఫేం సృజన్ దర్శకత్వం వహించారు. నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. తిరుపతి(శ్రీచరణ్), కన్యాకుమారి(గీత్ సైని) ఒకే స్కూల్. తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటుంది. తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇక కన్యాకుమారికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పని చేస్తూ ఉంటుంది. కన్యాకుమారి పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. అబ్బాయి జాబ్ చేయాలి, నన్ను సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది.తిరుపతికి ఏమో రైతు అని పెళ్లి అవ్వదు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి రైతు అని పట్టించుకోదు. ఎలాగోలా తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని తిరుపతిని ప్రశ్నిస్తుంది. దీంతో తిరుపతి కన్యాకుమారి కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా జాబ్ లో జాయిన్ అవుతాడు. మరి కన్యాకుమారి పెళ్లి ఏమైంది? తిరుపతి - కన్యాకుమారిల ప్రేమ ఫలించిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా? కన్యాకుమారి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘కన్యాకుమారి ’ మూవీ రివ్యూ
టైటిల్ : కన్యాకుమారి నటీనటులు: గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ, భద్రం.. తదితరులునిర్మాణ సంస్థ: రాడికల్ పిక్చర్స్నిర్మాత : సృజన్ అట్టాడదర్శకత్వం: సృజన్ అట్టాడసంగీతం: రవి నిడమర్తి సినిమాటోగ్రఫీ: శివ గాజుల, హరిచరణ్విడుదల తేది: ఆగస్ట్ 27, 2025నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా ఈ ‘కన్యా కుమారి’(Kanya Kumari Review) సినిమాని నేడు వినాయకచవితి సందర్భంగా రిలీజ్ చేసింది. ఈ సినిమా టీజర్ రిలీజయినప్పుడు అందులో హీరోయిన్ గబగబా చీరల గురించి డైలాగ్ చెప్పడంతో ఆ టీజర్ వైరల్ అయి సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి కన్యాకుమారి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కన్యాకుమారి కథేంటంటే.. తిరుపతి(శ్రీచరణ్), కన్యాకుమారి(గీత్ సైని) ఒకే స్కూల్. తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటుంది. తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇక కన్యాకుమారికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పని చేస్తూ ఉంటుంది. కన్యాకుమారి పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. అబ్బాయి జాబ్ చేయాలి, నన్ను సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది. తిరుపతికి ఏమో రైతు అని పెళ్లి అవ్వదు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి రైతు అని పట్టించుకోదు. ఎలాగోలా తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని తిరుపతిని ప్రశ్నిస్తుంది. దీంతో తిరుపతి కన్యాకుమారి కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా జాబ్ లో జాయిన్ అవుతాడు. మరి కన్యాకుమారి పెళ్లి ఏమైంది? తిరుపతి - కన్యాకుమారిల ప్రేమ ఫలించిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా? కన్యాకుమారి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిందా.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఇది ఒక రొటీన్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ. టీజర్, ట్రైలర్స్ తో మాత్రం సినిమాపై ప్రమోషన్స్ లో ఆసక్తి కలిగించారు. టైటిల్ కి తగ్గట్టు కథ మొత్తం కన్యాకుమారి చుట్టే తిరుగుతుంది. ఫస్టాఫ్ అంతా క్యూట్ లవ్ స్టోరీతో, వ్యవసాయానికి లింక్ చేసి బాగానే నడిపించారు. సెకండ్ హాఫ్ కూడా కాస్త బాగానే ఉంటుంది. సెకండాఫ్ మిడిల్ నుంచి కథ ఎంతకూ సాగదు. వాళ్లిద్దరూ కలిసిపోతారా? విడిపోతారా? అని బాగా సాగదీసి చూపించారు. అక్కర్లేకపోయినా క్లైమాక్స్ ని బాగా ల్యాగ్ చేసారు. అయితే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా క్లైమాక్స్ గుర్తుకు రావడం ఖాయం. ఆ క్లైమాక్స్ కి కొనసాగింపుగా ఉంటుంది ఈ కన్యాకుమారి ముగింపు.లవ్ స్టోరీని మాత్రం క్యూట్ గా బాగానే రాసుకున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఆ యాసతో లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది. అక్కడక్కడా కామెడీ కాస్త వర్కౌట్ అయింది. అలాగే ఆడపిల్ల చదవాలి, ఎదగాలి అనే కాన్సెప్ట్ తో పాటు రైతు, వ్యవసాయం విలువ ఇంటర్నల్ గా చూపించారు. లవ్ స్టోరీలు చూసే వాళ్లకు మాత్రం ఈ సినిమా నచ్చొచ్చు. ఎవరెలా చేసారంటే.. కన్యాకుమారి టైటిల్ పాత్రలో గీత్ సైని పర్ఫెక్ట్ గా సెట్ అయింది. విలేజ్ అమ్మాయిలా, లైఫ్ లో ఎదగాలి అని గోల్ ఉన్న అమ్మాయి పాత్రలో, బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ గా, లవ్ స్టోరీలో క్యూట్ గా బాగా నటించి మెప్పించింది. హీరో శ్రీచరణ్ ఒక రైతుగా మంచి మెసేజ్ ఇస్తూనే ప్రేమ కథలో కూడా పర్వాలేదనిపించాడు. భద్రం కాస్త నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన నటీనటులు కొత్తవాళ్లు అంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. సాంగ్స్ ఒక్కసారి వినొచ్చు. రొటీన్ ప్రేమ కథ అయినా కాస్త ఫ్రెష్ ఫీలింగ్ కలిగేలా రాసుకున్నాడు దర్శకుడు. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్ లో కొంత కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.