గోమాత సంరక్షణకు పాటుపడాలి
ఆదిలాబాద్ కల్చరల్: భారతీయ సంస్కృతి హిందుధర్మంలో గోమాతను సర్వదేవత ప్రతి రూపాలుగా పూజిస్తామని, అటువంటి గోమాతను సంరక్షించేందుకు హిందువులంత పాటుపడాలని హిందువాహిని పట్టణ అధ్యక్షుడు ఓరగంటి అఖిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్రగోపాలకృష్ణమఠంలో గోసంరక్షణ కమిటి ఎన్నికను హిందువాహిని ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందు ధర్మాన్ని పరిరక్షించాలని, గోమాతలు అంతరించకుండా పాటుపడాలని, ప్రజల్లోనూ చైతన్యం తేవాలని చెప్పారు.
గో సంరక్షణ కమిటి పట్టణ అధ్యక్షుడుగా మాడిపెల్లి ప్రమోద్, ప్రధాన కార్యదర్శిగా రాకేశ్, కార్యదర్శులుగా పోతుగంటి మల్లికార్జున్, బొమ్మకంటి ప్రేమ్‌సాగర్, లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో హిందువాహిని లోలపుల నరేష్, ఉపాధ్యక్షులు సాయిచరణ్,శ్రీకాంత్, రఘు, క్రిష్ణ, హరిష్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.