breaking news
Ganta srinvasa rao
-
ఏపీ పాలీసెట్ ఫలితాలు వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలీసెట్-2018 ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫలితాల్లో బాలికలదే పైచేయి అని తెలిపారు. ఏప్రిల్ 12న పాలిసెట్ నిర్వహించగా మొత్తం 1,29,412 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. మొత్తంగా 80.19 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. బాలికలు 84.61శాతం, బాలురు 78.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. తూర్పు గోదావరికి చెందిన గీత సౌమ్య, కంకటాల సాయి శ్రీహర్ష, పశ్చిమ గోదావరికి చెందిన పిల్లి శ్రీకర్ బాబు మొదటి స్థానాల్లో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా హర్ష రెండో స్థానం, పశ్చిమ గోదావరి జిల్లాకు దినకర్‌బాబు మూడో ర్యాంకు దక్కించుకున్నారు. ఫలితాల కోసం చూడండి http://sakshieducation.com -
ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
విజయవాడ: టీచర్ ఎమ్మెల్సీలతో ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సమావేశం అయ్యారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రైవేట్ వర్శిటీల బిల్లుపై చర్చిస్తామన్నారు. ప్రైవేట్ వర్శిటీల బిల్లుపై నిర్లయం తీసుకున్నాక మాతో చర్చలెందుకని టీచర్ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, ఏవీఎస్ శర్మ, గేయనంద్, వై. నివాస్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.