breaking news
Ganga Garbage
-
Namami Gange గంగానదిపై మహిళా జవాన్లు
శుభ్రత ఎక్కడుంటే మహిళలు అక్కడుంటారు. లేదా, మహిళలు ఎక్కడుంటే శుభ్రత అక్కడ ఉంటుంది. శుభ్రంగా ఉంచటం అన్నది మహిళల సహజ నైజం. మహిళలే కాదు, దైవత్వం కూడా శుభ్రత ఉన్న చోట కొలువై ఉంటుంది. ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్›్ట టు గాడ్లీనెస్’ అనే మాట వినే ఉంటారు.ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక బాధ్యతను వహిస్తున్న మహిళలే ఇప్పుడు తాజాగా దైవకార్యం వంటి ‘స్వచ్ఛ గంగా’ ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. గంగానదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం గురించి, గంగా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించటం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం మొత్తం 20 మంది మహిళలు గంగానదిపై నవంబర్ 4న రెండు తెప్పల్లో ర్యాలీగా బయల్దేరారు! ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవప్రయాగ పట్టణం నుంచి మొదలైన ఈ ‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’... మొత్తం 2,500 కి.మీ. దూరాన్ని 53 రోజుల పాటు ప్రయాణించి డిసెంబర్ 26న పశ్చిమబెంగాల్లోని గంగా సాగర్ వద్ద ముగుస్తుంది. అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక సుదీర్ఘమైన రివర్ ర్యాఫ్టింగ్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి. మరొక విశేషం కూడా ఉంది. వీళ్లంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) దళానికి చెందిన మహిళలు. బి.ఎస్.ఎఫ్. మహిళా విభాగం, ‘నమామి గంగే’ ప్రాజెక్టు కలిసి ఉమ్మడిగా ఈ రివర్ ర్యాఫ్టింగ్ను నిర్వహిస్తున్నాయి. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి, సాధికారతకు సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి పూజలు జరిపారు. ఆ తర్వాత ‘తెప్పలు’ కదిలాయి. ఈ ప్రచారానికి బి.ఎస్.ఎఫ్. సబ్ ఇన్స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా జవాన్లలో 20 మందిని కఠిన ర్యాఫ్టింగ్ శిక్షణ తర్వాత ఇందుకోసం ఎంపిక చేశామని మీనా అన్నారు. ‘‘రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో భాగంగా గంగా తీరం వెంబడి 43 పట్టణాలలో ఈ తరం యువతీ యువకులకు ‘పరిశుభ్రతకు, నిరంతరాయ ప్రవాహానికి’ అనువుగా గంగానదిని ప్రక్షాళన చేయాలన్న సందేశాన్ని అందిస్తాం’’ అని ఆమె తెలి΄ారు. మరొక విశేషం.. వీరితో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ చేతులు కలపటం. శుభ్రత దైవంతో సమానం అన్నప్పుడు, దైవ సమానంగా భారతీయులు కొలిచే గంగానదిని శుభ్రంగా ఉంచాలన్న సందేశంతో ప్రచారోద్యమం చేపట్టిన మహిళాశక్తి కూడా కొలవదగినదే. స్తుతించతగినదే. వారి మాట ఆలకించతగినదే. -
అక్కడ చెత్తవేస్తే రూ.50వేలు జరిమానా
న్యూఢిల్లీ: గంగా నది ప్రక్షాళన అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్ గంగా ప్రాజెక్టులో గంగా నది అంచు నుంచి 500మీటర్ల పరిధిలో ఎలాంటి చెత్తను డంప్ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. అలాంటి వారికి భారీ జరిమానా విధించాల్సిందిగా గ్రీన్ ట్రిబ్యునల్ చీఫ్ జస్టిస్ స్వతంతర్ కుమార్ గురువారం ఆదేశించారు. లెదర్ పరిశ్రమలను కూడా గంగా నదికి దూరంగా తరలించాలని కూడా స్పష్టం చేసింది. హరిద్వార్-ఉన్నావ్‌కు మధ్య విస్తరించిన 100 మీటర్ల పరిధిలోని భూభాగాన్ని 'నో-డెవలప్మెంట్ జోన్'గా ప్రకటించింది. అంతేకాదు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికపై రూ. 50వేల జరిమానా విధించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ సర్కార్ చేపట్టిన చర్యలతో వచ్చిన ఫలితం శూన్యమేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవిత్ర గంగానది ప్రక్షాళనకు దాదాపు రూ. 7,304 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం శూన్యమని తన ఆదేశాల్లో వ్యాఖ్యానించింది. ఈ పథకం రూపకల్పన అమలులో ప్రాథమికంగానే లోపాలు ఉన్నాయి అని ఎన్జీటీ తెలిపింది. కాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ మధ్య గంగా నదిలోకి వెలువడుతున్న పారిశ్రామిక కాలుష్యాలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలో తీసుకున్నారో తెలపాలని పర్యావరణ, అటవీ, జల వనరుల మంత్రిత్వశాఖలకు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఇతర సంస్థలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.