breaking news
Gandhihil development
-
గాంధీహిల్‌కు మహర్దశ..!
సాక్షి, విజయవాడ: విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన గాంధీహిల్‌పై ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) దృష్టి సారించింది. అథారిటీ పాలకమండలి చైర్మన్, పర్యాటక భాషా సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో గాంధీహిల్‌ను రూ.5 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గాంధీహిల్ ఫౌండేషన్ ఆధీనంలో గాంధీ కొండ ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ, గాంధీ హిల్ ఫౌండేషన్ పరస్పర అంగీకారంతో దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆధునిక నక్షత్రశాల, పిల్లల రైలు.. గాంధీహిల్‌పై నక్షత్రశాల, పిల్లల రైలు, లైబ్రరీలు ఇప్పటికే ఉన్నాయి. పిల్లల రైలు ఎక్కితే నగరాన్ని చూడవచ్చు. గాంధీహిల్ అభివృద్ధిలో భాగంగా రూ.3.15 కోట్లతో నక్షత్రశాలను మాత్రమే ఆధునికీకరించాలని తొలుత భావించినా, పాలక మండలి సమావేశం నిధుల సమస్య రాకుండా చూస్తామని, అన్ని విభాగాలను ఆధునికీకరించి పర్యాటక భరితంగా తీర్చిదిద్దాలని ఏపీటీఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మీనా మాట్లాడుతూ అక్కడి పిల్లల రైలును తిరిగి నడపాలని, అదే క్రమంలో గ్రంథాలయ భవనానికి మెరుగులు దిద్ది ప్రతిఒక్కరూ వినియోగించుకునేలా చూడాలని అన్నారు. సర్వాంగ సుందరంగా కొండ ప్రాంతం ఉండాలని ల్యాండ్ స్కేపింగ్ మంచి ఆర్కిటెక్చర్‌కు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. చిరంజీవి పర్యాటక మంత్రిగా ఉండగానే.. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా సినీనటుడు చిరంజీవి ఉన్నప్పుడు గాంధీ హిల్‌కు రూ.5 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లోనే నక్షత్రశాలను, పిల్లల రైలును ఆధునికీకరించాలని నిర్ణయించారు. అయితే ఈ నిధులను సద్విని యోగం చేసుకోలేదు. ఆ తరువాత కొద్దిపాటి నిధులతో గాంధీహిల్‌ను అభివృద్ధి చేశారు. అయితే అది పర్యాటకులను ఆకట్టుకునే స్థాయికి మాత్రం ఎదగ లేదు. ఈసారి ఏపీటీఏ రంగంలోకి దిగింది. భవానీద్వీపంలో వెలుగుల ఉద్యానవనం.. మరోవైపు భవానీ ద్వీపంలో వెలుగుల ఉద్యాన వనం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ పాలక మండలి నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా పది లక్షలకు పైగా ఎల్ఈడీలతో వెలుగుల ఉద్యానవనం తీర్చిదిద్దనున్నారు. ఈ వెలుగులు కష్ణానదిలో ప్రతిబించించే విధంగా ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా మొక్కలతో జంతువులు, పక్షుల ఆకారాలను తీర్చిదిద్దటం మనం చూస్తుంటాం. ఈ వెలుగుల ఉద్యానవనంలో అవన్ని ఎల్ఈడీ వెలుగుల ద్వారానే రూపుదిద్దుకుంటాయి. ఈ నేపథ్యంలో టూరిజం అథారిటీ సీఈఓ హిమాన్హు శుక్లా మాట్లాడుతూ, వెలుగుల ఉద్యానవనం ప్రపంచ శ్రేణి పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉండనుందని, సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల సంబంధించి పలు అంశాలు పాలకమండలి అజెండాలో ఉండగా వాటిని ప్రభుత్వ పరిశీలనకు పంపాలని మీనా నిర్ణయించారు. సమావేశంలో సంçస్థ పాలనా వ్యవహారాల సంచాలకుడు డాక్టర్ సాంబశివరాజు పాల్గొన్నారు. -
గాంధీహిల్‌కు మహర్దశ
మార్చిలో రూ.40లక్షలతో అభివృద్ధి పనులు రూ.కోటితో ప్లానిటోరియానికి మరమ్మతులు ఎలక్ట్రికల్ వైరింగ్‌కు మరో రూ.40 లక్షలు ఏపీటీడీసీ ఆధ్వర్యంలో పనులు గాంధీహిల్ అభివృద్ధి పనులు వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. రూ.40లక్షలతో జరిగే సివిల్ వర్క్స్ టెండర్‌ను గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సునీల్ అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడంతో త్వరలోనే పనులు ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. సివిల్ వర్క్‌లో భాగం కొండపైన ఉన్న రైల్‌ట్రాక్, ప్లానిటోరియానికి మరమ్మతులు, పక్కనే రిటైనింగ్ వాల్ నిర్మాణం, పెయింటింగ్స్ చేపడతారు. - సాక్షి, విజయవాడ రూ.3 కోట్లు కేటాయింపు సెంట్రల్ టూరిజం డెవలప్మెంట్ స్కీమ్ కింద గాంధీహిల్ అభివృద్ధికి గత యూపీఏ ప్రభుత్వాన్ని రూ.5 కోట్లు కోరగా, రూ.3 కోట్లు కేటాయించింది. ఇందులో తొలివిడతగా రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. వీటి లో రూ.40 లక్షలు సివిల్ వర్కులకు, మరో రూ.40లక్షలు ఎలక్ట్రికల్ వర్కులకు, రూ.కోటి ప్లానిటోరియంకు కేటాయించారు. రూ.40లక్షలతో విద్యుత్ పనులు సివిల్ వర్క్స్‌తో పాటే రూ.40లక్షలతో విద్యుత్ పనులకు టెండర్లు పిలిచారు. నాలుగైదు రోజుల్లో టెండర్లు ఖరారుచేసి వచ్చే నెలలో పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్లానిటోరియానికి ఆధునిక విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు కొండపైకి వెళ్లే మార్గంలోనూ, కొండ పై భాగంలోనూ విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. ఇందుకోసం కొత్త వైరింగ్ వేయనున్నారు. రూ.1.20 కోట్లతో అభివృద్ధి ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ.1.20 కోట్లు మంజూరు కాగానే, గాంధీహిల్‌పై పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు, ఫుడ్‌కోర్టు, ల్యాడ్ స్కేపింగ్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే, కొండపై గ్రీనరీని పెంచేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సహాయం తీసుకోనున్నారు. ప్లానిటోరియానికి అత్యాధునిక పరికరాలు గాంధీహిల్‌పై ఉన్న ప్లానిటోరియం పరికరాలు మూడు దశాబ్దాల కిందట ఏర్పాటుచేసినవి. వాటిని మార్పుచేసి హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో ఉపయోగిస్తున్న యంత్రాలు, పరికరాలను తెప్పించాలని ఏపీటీడీసీ అధికారులు నిర్ణయించారు. రూ.కోటి విలువచేసే ఈ పరికరాలు ఏర్పాటుచేసే బాధ్యతను బిర్లా పానిటోరియానికే అప్పగించినట్లు తెలిసింది. రెండు నెలల్లో ఈ పరికరాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈలోగా ప్లానిటోరియ మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. ఈ పరికరాలు కూడా వస్తే సరికొత్త ప్లానిటోరియం సాక్షాత్కరిస్తుంది.