breaking news
Galileo satellites
-
నింగిలోకి మరో నాలుగు గెలీలియో శాటిలైట్స్
బ్రస్సెల్స్: మరో నాలుగు గెలీలియో ఉపగ్రహాలను ఈ ఏడాది చివరిలోగా నింగిలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) భావిస్తోంది. వీటన్నింటిని కూడా నావిగేషన్ కోసం ఉపయోగించనుంది. ఇప్పటికే గత వారంలో రెండు నావిగేషన్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఈయూ చాలా ఉత్సాహంతో కనిపిస్తోంది. సెప్టెంబర్ 2015న నాలుగు గెలీలియో నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని, అవి 2016న తాత్కలిక సేవలను ప్రారంభించి 2020 నుంచి పూర్తిస్థాయిలో సేవలను అందిస్తాయని యూరోపియన్ కమిషన్ తెలిపింది. ఈయూకు చెందిన గెలీలియో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ జాబితాలో తాజాగా ప్రవేశపెట్టిన రెండు శాటిలైట్స్తో కలిపి మొత్తం ఎనిమిదికి చేరాయి. 2014లో ప్రవేశపెట్టిన రెండు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి కాకుండా మరో కక్ష్యలోకి వెళ్లడంతో తాజాగా వాటి స్థానంలో కొత్తవాటితో భర్తీ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. -
దారి తప్పిన ఉపగ్రహాలు!
పారిస్: ప్రపంచ ఉపగ్రహ దిశానిర్దేశ వ్యవస్థ(గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్) ఏర్పాటు కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ శుక్రవారం ప్రయోగించిన రెండు గెలీలియో ఉపగ్రహాలు సరైన ఎత్తుకు చేరడంలో విఫలమయ్యాయి. ఉపగ్రహాలు రెండూ నియంత్రణలోనే ఉన్నా.. వాటిని నిర్దేశిత ఎత్తులోని కక్ష్యలోకి చేర్చడం కష్టంగా మారిందని రష్యన్ సోయజ్ రాకెట్ ద్వారా వాటిని ప్రయోగించిన ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్స్పేస్ తెలిపింది. ఉపగ్రహాలు తక్కువ ఎత్తులోకి చేరినందున సమస్య పరిష్కార మార్గాల గురించి అధ్యయనం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, గెలీలియో అనేది.. యూరోపియన్ యూనియన్ సొంత గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ. అమెరికా, రష్యాలకు చెందిన జీపీఎస్, గ్లోనాస్ నావిగేషన్ వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా, వాటితో కలసి కూడా పనిచేయడం దీని ప్రత్యేకత. పూర్తిస్థాయి గెలీలియో నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.43 వేల కోట్ల వ్యయంతో 30 ఉపగ్రహాలను మోహరించాల్సి ఉంది. ఇంతవరకూ నాలుగు ఉపగ్రహాలను నింగికి పంపగా.. శుక్రవారం డోరెసా, మిలేనా అనే రెండింటిని పంపారు. కానీ అవి తక్కువ ఎత్తుకే చేరడంతో ఇప్పుడు అనుకోని అవాంతరం ఎదురైంది.