breaking news
Gail gas pipe line blast
-
'నగరం' ఘటనలు పునరావృతం కావొద్దు
-
'నగరం' ఘటనలు పునరావృతం కావొద్దు
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. నగరం గ్యాస్ పైప్ పేలుడు బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చినంత మాత్రానా సమస్యకు పరిష్కారం కాదని, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జూన్ 27న గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలడంతో 21 మంది మృత్యువాత పడగా 18 మంది తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే.