breaking news
gadapa gadapakoo ysrcp
-
ఆయకట్టు రైతుల కష్టాలు పట్టవా..?
- ప్రభుత్వం ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి గార్లదిన్నె : గాలిలో లెక్కలు చెబుతున్న టీడీపీ ప్రభుత్వం, ఈ రెండేళ్ల కాలంలో అనంత ఆయకట్టు రైతన్నకు ఏ మేరకు సాగునీరు ఇచ్చిందో చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్ల కాలంలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేక పోయారన్నారు. అందువల్లే గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా, ఈ కాలనీకి వెళ్లిన జనమంతా సమస్యలు ఏకరువు పెడుతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం గార్లదిన్నె తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గం సమన్వయ కర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో ధర్నా వైఎస్సార్ సీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ధర్నాలో పాల్గొన్న అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, తాను అధికారంలో ఉన్న సమయంలో జిల్లాకు వచ్చిన 26 టీఎంసీల నీటితోనే దాదాపు 1.50 లక్షలు ఎకరాల ఆయకట్టు భూములకు, తాగు నీటి అవసరాలకు సరఫరా చేయడంతో పాటు, వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు నీరు అందించామన్నారు. ఇపుడు 18.50 టీఎంసీల హెచ్చెల్సీ నీటితో పాటు 12 టీఎంసీల నీటిని హంద్రీనీవా ద్వారా తెచ్చామని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నా, ఆయకట్టు భూములకు సాగునీటిని కాదుకదా..కనీసం తాగునీటి అవసరాలకు కూడా నీరు అందించలేకపోయారన్నారు. అనంత రైతన్నల సంక్షేమంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కనీసం ఈ సంవత్సరమైన ఆయకట్టుకు తగినంత నీరందించి ఆదుకోవాలని కోరారు. -
సమస్యలపై ప్రజల ఏకరువు
చిలమత్తూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు వివరిస్తూ ఆవేదన చెందుతున్నారు. శనివారం హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని కొడికొండ, బలిజపల్లి, దళవాయిలపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముఖ్యఅతిథిగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కొడికొండ గ్రామంలో ఉదయం 9.45 గంటలకు కార్యక్రమం ప్రారంభించారు. నవీన్‌నిశ్చల్ ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు పాలనలోని వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. సీఎంగా చంద్రబాబు పాసా..? ఫెయిలా..? మీరే నిర్ణయించాలని ప్రజలను కోరారు. ప్రజాచైతన్యం కోసమే వచ్చాం సమస్యలను తెలుసుకోవడం కోసమే గ్రామాల్లోకి వచ్చామన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని, బూటకపు, నియంత పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు.. వారి సమస్యలు ఏంటి అని తెలుసుకోవడానికే వచ్చినట్టు చెప్పారు. విశ్రాంతి కోసం హిందూపురానికి వచ్చే బాలకృష్ణను చూసి ఎన్ని రోజులయిందని ప్రజలను అడిగారు. ఎమ్మెల్యే పీఏను తప్ప బాలకృష్ణను ఇంతవరకు చూడలేదని గ్రమాస్తులు తెలిపారు. సమస్యలపై ఏకరువు మండలంలోని కొడికొండ, బలిజపల్లి, దళవాయిలపల్లి గ్రామాల్లో గ్యాస్ కనెక్షన్, పింఛన్, రేషన్ కార్డు, రోడ్లు, ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ తదితర సమస్యలు పేరుకుపోయిన ట్లు గ్రామస్తులు ఎల్.రత్నమ్మ, కవిత, మునాఫ్, నరసింహమూర్తి, కె.అనిత, సూరప్ప, నాగరాజు, అంజినప్ప తదితరులు నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయారు. సమస్యలను తన సొంత ఖర్చులతో దశలవారీగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రజనీ, శివ, మహిళ అధ్యక్షురాలు నాగమణి, షేక్ షమీమ్తాజ్, మల్లికార్జున, ఇర్షాద్, ప్రశాంత్‌గౌడ్, సమ్మద్, రియాజ్, నరసిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రఘు, చంద్రశేఖర్, చందు, స్థానిక నాయకులు జగన్మోహన్రెడ్డి, రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీరెడ్డి, నాగభూషణాచారి, సర్పంచ్ జయశంకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మోదిపి లక్ష్మీనారాయణ, రామచంద్రప్ప, బోగిరెడ్డి, అంజినరెడ్డి, రంగారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు నరసింహారెడ్డి, అన్నా సుందర్ రాజ్, సానే రంగారెడ్డి, గంగాధర్, ఫరూక్, నంజిరెడ్డి, నరసారెడ్డి, నాగిరెడ్డి, గంగాధర్, షాకీర్, శివశంకర్‌రెడ్డి, వెంకటేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఆ కాలనీకి వెళ్లలేదు.. కాగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కొడికొండ గ్రామంలోని మసీదు కాలనీలోకి వెళ్లడానికి వైఎస్సార్సీపీ నాయకులు సమాయత్తమయ్యారు. ఇంతలో పోలీసుల నుంచి నాయకులకు ఫోన్ వచ్చింది. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ వర్గీయులు వారి మద్దతుదారులు ఆ కాలనీలో సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పారు. మీరు (వైఎస్సార్సీపీ నాయకులు) వెళ్తే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందని.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని పోలీసులు కోరారు. ప్రజల శాంతి భద్రతల విషయంలో అధికారులకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ పోలీసులకు హామీ ఇచ్చి ఆ కాలనీకి వెళ్లకుండా విరమించుకున్నారు.