breaking news
fuse
-
సరికొత్త సాంకేతికత.. ఇక ఫ్యూజులు కాలవు!
సాక్షి, అమరావతి: సీరియస్‌గా టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు కరెంటు పోతే వచ్చే అసహనం అంతా ఇంతా కాదు. గాలిలేదు.. వానలేదు.. కరెంటెందుకు పోయిందోననుకుంటూ వెంటనే పక్కింటివాళ్లకు ఉందోలేదో చూస్తుంటాం. తీరా వీధిలో కొందరికి ఉండి మనతోపాటు కొందరికి లేదని గుర్తించాక అప్పుడు అర్థమవుతుంది.. ఫ్యూజు కాలిపోయిందని. వెంటనే కరెంట్ ఆఫీసుకు ఫోన్‌చేస్తే విద్యుత్ సిబ్బంది వచ్చి ఫ్యూజ్ ఏ ట్రాన్స్ఫార్మర్ వద్ద పోయిందో పరిశీలిస్తారు. కానీ ఎందుకు కాలిపోయిందో తెలియాలంటే మాత్రం ఆ లైన్లన్నీ వెదకాలి. దానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను తప్పించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే మినియేచర్ కాంటాక్ట్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీసీబీ). విజయవాడలో ఎంసీసీబీల ఏర్పాటును మొదలుపెట్టారు. ప్రస్తుతం 40 వేల ట్రాన్స్ఫార్మర్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తామని, దశలవారీగా డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల్లో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేస్తామని ఏపీసీపీడీసీఎల్ చెబుతోంది. నాణ్యత, రక్షణ విజయవాడలోని ముఖ్యకూడళ్లలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజు బాక్సుల స్థానంలో రెండువైపుల ఎంసీసీబీ ఉండే కేబుళ్లు అమర్చారు. విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడినప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి. సమస్య ఉన్న లైనుకు మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపేస్తాయి. లైనులో ఎక్కడ సమస్య వచ్చిందనే విషయాన్ని కూడా సూచిస్తాయి. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం కలుగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాల నివారణకు రక్షణ కంచె ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారమార్గంగా ఉంది. ఆ కంచె కూడా వివిధ కారణాల వల్ల పాడైపోతోంది. అది గమనించకుండా అటు వెళ్లిన మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడాల్సి వస్తోంది. ఎంసీసీబీ వ్యవస్థలో రెండువైపులా ఇన్సులేటెడ్ కేబుళ్లు ఉండటం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉండదు. మేమే ముందు ఒక్కో ఎంసీసీబీకి దాదాపు రూ.10 వేలు ఖర్చవుతోంది. వీటిని అతి తక్కువ ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు రక్షణ లభించడంతోపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది. దీంతో లైన్‌లాస్ తగ్గి అంతిమంగా డిస్కంకు, వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. అదీగాకుండా తుప్పుపట్టిన ఇనుప ఫ్యూజుబాక్సుల స్థానంలో ఎంసీసీబీతో కూడిన ట్రాన్ఫ్‌ఫార్మర్లు చూడ్డానికి బాగుంటాయి. నగర సుందరీకరణలో ఇవి కూడా భాగమవుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఎంసీసీబీలను మా డిస్కంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. – జె.పద్మాజనార్ధనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ -
పండగ పూట విషాదం
- ఫ్యూజ్ వేయబోయి మృత్యువాత - పెట్నికోట గ్రామంలో ఘటన కొలిమిగుండ్ల: శ్రీరామనవమి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాల్సిన ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఫ్యూజ్ వేయబోయి ఓ యువకుడు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. పెట్నికోట ఎస్సీ కాలనీకి చెందిన మగదాల సుబ్బరాయుడుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సురేంద్రబాబు(28) స్వంతంగా నాపరాతి పాలీష్ ప్యాక్టరీ నిర్మించుకొని కుటుంబానికి అండగా ఉన్నాడు. మూడు రోజుల క్రితం పెట్నికోటలో పెనుగాలుల బీభత్సానికి స్తంభాలు, చెట్లు విరిగి పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సురేంద్రబాబు ప్యాక్టరీకి చెందిన ట్రాన్స్‌ఫార్మర్‌లో ఎగ్జ్ఫ్యూజ్ పోవడంతో సరఫరా నిలిచి పోయింది. ఉదయం ఆరున్నర గంటల సమయంలో ప్యాక్టరీ వద్దకు వెళుతుంటే కుటుంబ సభ్యులు కాఫీ తాగి వెళ్లమని సూచించినా త్వరగా వస్తానని వెళ్లాడు. ఏదో ఆలోచనలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను బంద్ చేయకుండా ఎక్కి ఫ్యూజ్ వేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ట్రాన్స్‌కో ఏఈ సూర్యనారాయణరెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ జయనాయక్ .. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. హెడ్‌కానిస్టేబుల్ బాబాఫకృద్దీన్ వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. -
ట్రాన్స్‘ఫార్మర్’పైనే.. ప్రాణాలు విడిచాడు..
ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ వేయబోయి ఓ రైతు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు సరసం సుధాకర్‌రెడ్డి(52) మంగళవారం పొలంలో వరినాట్లు వేయించాడు. నీరు పెడదామని బుధవారం మోటార్ ఆన్‌చేయగా కరెం టు లేదు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించగా ఫ్యూజ్ ఊడిపోయినట్లు గుర్తిం చాడు. దీంతో ఫ్యూజ్ వేద్దామని ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేశాడు. కానీ సరిగా ఆఫ్కాలేదు. అది గమనించని సుధాకర్‌రెడ్డి ఫ్యూజ్ వేస్తుం డగా.. విద్యుదాఘాతంతో అదే ట్రాన్స్ఫార్మర్పై పడి ప్రాణాలు వదిలాడు. -భూదాన్ పోచంపల్లి