breaking news
Fruit sales
-
గెలిచినా గంప దింపలేదు!
పుణె జిల్లాలోని అందమైన హిల్ స్టేషన్ లోనావాలా.. పర్యాటకులకు స్వర్గధామం. కానీ ఇప్పుడా ప్రాంతం ఒక సామాన్య మహిళ పోరాటానికి, నిరాడంబరతకు చిరునామాగా మారింది. ముంబైకి కూతవేటు దూరంలోని ఈ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగ్యశ్రీ జగ్తాప్ అనే మహిళ సాధించిన విజయం.. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. విజయం వరించినా.. వేరు మరువలేదు సాధారణంగా ఎన్నికల్లో గెలవగానే నాయకులు పూలమాలలు, ఊరేగింపులు, బాణసంచా హడావిడిలో మునిగిపోతారు. కానీ భాగ్యశ్రీ స్టైలే వేరు.. ఆదివారం ఫలితాలు వచ్చాయి.. భారీ మెజారిటీతో ఆమె గెలిచారు. సోమవారం ఉదయాన్నే అందరూ ఆమె ఇంటికి అభినందనలు తెలపడానికి వద్దామనుకుంటే.. ఆమె మాత్రం ఎప్పటిలాగే రోడ్డు పక్కన తన పండ్ల దుకాణం దగ్గర ప్రత్యక్షమైంది. కౌన్సిలర్ హోదాను ప్రదర్శించడం కంటే, తన కుటుంబాన్ని పోషిస్తున్న పండ్ల గంపే ఆమెకు దైవంగా కనిపించింది. ‘గెలిచాం కదా అని వ్యాపారాన్ని వదిలేస్తామా?.. మా కుటుంబానికి జీవనాధారం ఇదే’.. అంటూ ఆమె పండ్లను సర్దుతున్న తీరు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. హేమాహేమీలను ఓడించి.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన భాగ్యశ్రీ, తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యరి్థని ఏకంగా 608 ఓట్ల తేడాతో ఓడించింది. పౌర సమస్యలపై ఆమెకున్న అవగాహన, సామాన్యులతో అనుబంధమే.. ఈ భారీ విజయానికి కారణమని లోనావాలా వాసులు స్పష్టం చేస్తున్నారు. దేని పని దానిదే.. పదవి గురించి భాగ్యశ్రీ మాటల్లో ఎక్కడా గర్వం కనిపించదు. ‘పండ్లమ్మడం మా వంశపారంపర్య వ్యాపారం. కౌన్సిలర్‌గా ప్రజల సమస్యలపై పోరాడతాను, వారి బాధలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాను. అదే సమయంలో నా పండ్ల దుకాణాన్ని కూడా నడుపుతాను. ఈ వ్యాపారమే నాకు గుర్తింపునిచి్చంది’.. అని ఆమె స్పష్టం చేసింది. భర్త మహదేవ్ జగ్తాప్ కూడా ఆమె నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఆమె ప్రజా సేవలో నిమగ్నమైతే, తాను వ్యాపార బాధ్యతలు చూసుకుంటానని సగర్వంగా చెబుతోంది. శభాష్ భాగ్యశ్రీ రాజకీయాల్లో విజయం సాధించాక నేలమీద నడవని నేతలున్న కాలంలో.. నిరాడంబరతే ఆభరణంగా భాగ్యశ్రీ సాగిపోతోంది. తన కష్టాన్ని, వృత్తిని నమ్ముకున్న ఈ ’పండ్లమ్మే కౌన్సిలర్’ ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ హీరోగా నిలిచింది. గెలిచాక వాగ్దానాల ‘గంప’దించేసే నాయకుల మధ్య.. గెలిచినా గంపను నమ్ముకున్న ఈ ’భాగ్యశ్రీ’ నిజంగా అభినందనీయురాలు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విదేశీ పండ్లకు పెరిగిన క్రేజ్
అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివీ, వాషింగ్టన్ యాపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్ ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రసుత్తం నగర మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. దీంతో విదేశీ పండ్ల రుచులను ఆస్వాదించడానికి నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రోజు రోజుకూ నగరంలో వీటి అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సగటున రోజుకు 50–60 టన్నుల మేర అమ్మకాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సుమారు 18 దేశాల నుంచి వివిధ రకాలు దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపార వర్గాల చెబుతున్న మాట. కాగా ఈ మొత్తం ప్రక్రియలో అమ్మకాలు, దిగుమతులు గణనీయంగా పెరిగాయని, దీంతో విదేశీ పండ్ల విక్రయాల్లో నగరం దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెలుస్తోంది.. ఒకప్పుడు స్థానికంగా దొరికే ఫలాలే సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసేవారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫలాలు ఎగువ మధ్య తరగతి వారు, లేదా ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారు. అయితే మారుతున్న పరిస్థితులు, గ్లోబల్ మార్కెటింగ్‌లో భాగంగా ప్రతిదీ సామాన్యులకు అందుబాటులకి వచి్చంది. పైగా వాటికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు వాటి అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశంలో అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లు నగర మార్కెట్లో అందుబాటులో అమ్మకాలు జరుగుతున్నాయి... మాల్స్ నుంచి లోకల్ మార్కెట్‌కి.. విదేశీ పండ్లు ఒకప్పుడు పెద్ద పెద్ద మాల్స్‌లోనో.. లేదా సూపర్ మార్కెట్స్‌లోనో అమ్మకాలు జరిగేవి... అయితే విదేశీ పండ్లు నగరంలో మాల్స్, ఫ్రూట్ షాప్స్ నుంచి తోపుడు బండ్లపై అమ్మకాలు జరుగుతున్నాయి. పైగా దేశీయ పండ్ల ధరలకు సమానంగా వీటిని విక్రయిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఏదో ఒక సీజన్లో మత్రమే దేశయ మార్కెట్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వివిధ దేశాల పండ్లు అక్కడి సీజన్ల ప్రకారం మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. దీంతో యేడాది పొడవునా ఏదో ఒక దేశం నుంచి అన్ని రకాల పండ్లూ అన్ని సీజన్లలో లభ్యమౌతున్నాయి. దేశంలోనే మూడో స్థానంలో.. విదేశీ పండ్లుగా పేరుగాంచిన కివీ, స్ట్రాబర్రీ, బ్లాక్ బెర్రీస్, అవకాడో వంటి పళ్లు నగరంలో విరివిగా లభ్యమవుతున్నాయి. భారీగా అక్కడి నుంచి దిగుమతులు చేయడం ఒక కారణమైతే.. లోకల్ మార్కెట్‌తో పాటు ఇళ్ల వెంబడి కూడా అమ్మకాలు చేయడమే మరో కారణమని బాటసింగారం మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకూ, జిల్లాలకూ ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతాయి. అందుకే రాష్ట్రంలోనే బాటసింగారం పండ్ల మార్కెట్‌కు అతి పెద్దదిగా పెట్టింది పేరు. అయితే విదేశీ పండ్ల వినియోగంలో ముంబయి, బెంగళూరు తర్వాత నగరం మూడో స్థానంలో నిలిచింది. దిగుమతులు ఇలా.. గ్రీన్ యాపిల్‌కు ఇటీవల అదరణ పెరిగింది. నెదర్లాండ్స్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాపిల్ పళ్లను వాషింగ్టన్, చైనా, న్యూజిల్యాండ్, చిలీ, బెల్జియం నుంచి ముంబాయి, చెన్నై పోర్టు ద్వారా నగరానికి దిగుమతవుతాయి. అవకాడో టాంజానియా నుంచి, కివీ పండ్లు న్యూజిల్యాండ్, ఇటలీ, ఇరాన్‌తో పాటు చైనా నుంచి వస్తాయి. ఇదే క్రమంలో వివిధ పళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతవుతున్నాయి. ప్రతి ఫలం..ఔషధ గుణం.. ప్లమ్.. చూడడానికి పెద్ద రెగు పండు సైజులో యాపిల్‌ను పోలివుంటుంది. ఇందులో క్యాల్షియం, సీ, బీ విటమిన్లు, మెగీ్నíÙయంతో పాటు ఇతర పోషకాలు మొండుగా ఉంటాయి. కివీ ఫ్రూట్లో విటమిన్ సీ, కే, ఇ అధికంగా ఉంటాయి. ఇక డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సీ, ఫాస్పరస్, క్యాల్షియం, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తితో పాటు కేన్సర్‌ను నియంత్రిస్తుంది. చెర్రీలో కార్బోహైడ్రేట్లు, షుగర్, విటమిన్ సీ, పోటాషియం పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సీ, క్యాల్షియం అధిక స్థాయిలో ఉంటుంది.ఆన్లైన్లోనే ఆర్డర్స్.. వివిధ దేశాల నుంచి ఇక్కడి వ్యాపారులు ఆయా సీజనల్ ఫ్రూట్స్‌ని ఆన్లైన్ ద్వారానే దిగుమతి చేసుకుంటారు.. అదెలా అంటే.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాట్సాప్, మెయిల్ ద్వారా పండ్ల నమునా ఫొటోలు పంపిస్తారు. దీంతో వ్యాపారులు ఆన్లైన్లో అడర్ ఇస్తారు. విదేశాల నుంచి ముంబయికి దిగుమితి అవుతాయి. అక్కడి నుంచి ఫ్రీజర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా నగరానికి వస్తాయి.మార్కెట్లో వివిధ దేశాల పండ్లు ప్రపంచ వ్యాప్తంగా లభించే దాదాపు 20 రకాల విదేశీ పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్‌కు కమీషన్ ఏజెంట్ల ద్వారా దిగుమతి అవుతున్నాయి. గతం కంటే ప్రస్తుతం దిగుమతులు పెరిగాయి. ట్రేడర్స్‌కు రెఫ్రిజిరేటర్ చాంబర్లు ఏర్పాటు చేశాము. దేశంలోని ఇతర పండ్ల మార్కెట్లతో పోలిస్తే నగర మార్కెట్లో అన్ని సౌకార్యలూ ఉన్నాయి. – ఎల్ శ్రీనివాస్, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపెరిగిన అమ్మకాలు గతంతో పోలిస్తే విదేశీ పండ్ల అమ్మకాలు పెరిగాయి. దీంతోపాటు నగరం ప్రజలకు కూడా విదేశీ పండ్లపై ఆసిక్తి పెరిగంది. కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెరగడం మరో కారణం.. దిగుమతులు కూడా విరివిగా జరుగుతుండడంతో ధరలు కూడా దేశీ పండ్ల స్థాయిలోనే ఉంటున్నాయి. యాపిల్, కివీ, పియర్స్‌తో పాటు మరికొన్ని విదేశీ రకాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. – క్రాంతి ప్రభాత్‌రెడ్డి, విదేశీ పండ్ల హోల్‌సేల్ వ్యాపారి -
బొప్పాయి.. డెంగీకి బైబై...
వ్యాధి నియంత్రణకు మార్గమంటున్న డాక్టర్లు * నగరంలో పెరిగిన పండ్ల అమ్మకాలు * మూడింతలు పెరిగిన ధర సాక్షి, ముంబై: డెంగీ నియంత్రణకు బొప్పాయి రసం చాలా ఉపయోగపడుతోందని డాక్టర్లు చెబుతుండటంతో దానికి నగరంలో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. డెంగీ కారక దోమల ఉధృతితో నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డెంగీకి ప్రత్యేకించి ఔషధాలు ఏమీ లేవని, జ్వరాన్ని నియంత్రించడమొకటే మార్గమని పలువురు పేర్కొంటున్నారు. అయితే బొప్పాయి పండు రసం సేవించడం ద్వారా డెంగీ వ్యాధిని నివారించవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ (ఏపీఎంసీ)లో గత కొన్ని వారాలుగా బొప్పాయికి విపరీతమైన డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ పండ్ల వ్యాపారి మాట్లాడుతూ.. డెంగీ నియంత్రణకు ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్న కారణంగా బొప్పాయి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇటీవల రెండు నెలల కిందట ఈ పండ్ల అమ్మకాలు సాధారణస్థాయిలో ఉన్నాయని, కాని ప్రస్తుతం వీటి అమ్మకాలు మూడింతలు పెరిగాయని తెలిపారు. కొన్ని వారాల కిందట కిలో రూ.8 -15 పలికిన ఈ పండ్లు ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో ఈ పండు కిలో రూ.20 నుంచి 25 వరకు ధర పలుకుతున్నాయి. కాగా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.30 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీఎంసీ మార్కెట్ డెరైక్టర్ సంజయ్ పాన్సారే మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా డెంగీ వ్యాధి నవీ ముంబైతోపాటు చుట్టుపక్కల వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. బొప్పాయిలో విటమిన్లు పుష్కలంగా ఉండడంతో వీటి డెంగీ పీడితులకు ఈ రసం తాగించాలని డాక్టర్లు సూచిస్తుండటంతో వినియోగం బాగా పెరిగిందన్నారు. గతంలో మార్కెట్‌కు రోజుకు 10 నుంచి 15 ట్రక్కుల బొప్పాయి సరఫరా కాగా, ప్రస్తుతం రోజుకు 40 ట్రక్కుల వరకు సరఫరా అవుతోందని ఆయన వివరించారు.


