breaking news
French Closer Magazine
-
యువరాణి టాప్‌లెస్ ఫొటోలు.. ప్రిన్స్ దావా!
-
యువరాణి టాప్‌లెస్ ఫొటోలు.. ప్రిన్స్ దావా!
పారిస్: సంచలనం రేపిన బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య కేట్ మిడిల్టన్ టాప్‌లెస్ ఫొటోల వ్యవహారంలో ఫ్రెంచ్ కోర్టు విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు జర్నలిస్టులను మంగళవారం ప్రశ్నించింది. ఐదేళ్లకిందట ప్రిన్స్ దంపతులు దక్షిణ ఫ్రాన్స్‌లో ఓ ఫాం హౌస్‌లో విడిది చేశారు. అనుమతి లేకుండా మూడోవ్యక్తి ప్రవేశించలేని ఆ ఫాం హౌస్‌లో కేట్ మిడిల్టన్ టాప్ లెస్ గా భర్తతో కలిసి సన్ బాత్ చేయగా ఫొటోలు తీసి.. ఫ్రెంచ్ గాసిప్ మ్యాగజైన్, పేపర్ క్లోజర్ లో 2012 సెప్టెంబర్‌లో ప్రచురించారు. తమ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఫొటోలు ప్రచురించిన మ్యాగజైన్ నష్టపరిహారంగా 1.5మిలియన్ యూరోలను చెల్లించాలని బ్రిటన్ రాకుమారుడు విలియమ్ దంపతులు దావా వేశారు. పత్రికల మొదటి పేజీలో ప్రచురించి బ్రిటన్ రాచకుటుంబం పరువు తీశారన్న కేట్ మిడిల్టన్ తరఫు న్యాయవాదుల వాదనకు కోర్టు గతేడాది మొగ్గుచూపింది. టాప్ లెస్ ఫొటోలు ప్రచురించిన క్లోజర్ మ్యాగజీన్ కు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై విచారణ చేపట్టింది. ఆ టాప్‌లెస్ ఫొటోలు ఇప్పటికీ యూరోపియన్ పబ్లికేషన్స్ అయిన ఇటలీలో చే, స్వీడన్, డెన్మార్క్‌లలో డైలీ స్టార్, సిస్టర్ మ్యాగజైన్స్‌లలో ప్రచురితం అవుతుండటం గమనార్హం. దీంతో ప్రిన్స్ దంపతులు న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. క్లోజర్ మ్యాగజైన్ ఎడిటర్ లారెన్స్ పియు, ఓ సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టులపై విచారణ కొనసాగుతోంది. 1997 కేట్ అత్త, దివంగత ప్రిన్సెస్ డయానా మీడియా నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదానికి గురై మరణించడంతో ఆ రాజకుటుంబం జర్నలిస్టులపై ఇప్పటికీ ఆగ్రహంగా ఉంది. ఈ విషయంపై లాయర్ పాల్ అల్బర్ట్ ఐయిన్స్ మాట్లాడుతూ.. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ ఫొటోలు వారి అన్యోన్యతను మాత్రమే తెలుపుతుండగా.. దీనిపై పరువునష్టం దావా వేశారని చెప్పారు. మరోవైపు క్లోజర్ మ్యాగజైన్ యాజమాన్యం దీనిపై స్పందిస్తూ.. తమ ఫొటో జర్నలిస్టులు నేరుగా ఈ ఫొటోలు తీయలేదని, ఇతర వ్యక్తుల ద్వారా సంపాదించిన ఫొటోలను మాత్రమే పబ్లిష్ చేశామని వివరణ ఇచ్చుకుంది. కానీ కోర్టు వీరి వివరణతో సంతృప్తి చెందలేదు. -
కేట్ టాప్‌లెస్ ఫొటోలు: జర్నలిస్టులపై విచారణ
పారిస్: సంచలనం రేపిన బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ టాప్‌లెస్ ఫొటోల వ్యవహారంలో ఫ్రెంచ్ కోర్టు విచారణను వేగవంతం చేసింది. రహస్యంగా ఫొటోలు తీయడమేకాక, వాటిని పత్రికల మొదటి పేజీలో ప్రచురించి బ్రిటన్ రాచకుటుంబం పరువు తీశారన్న కేట్ తరఫు న్యాయవాదుల వాదనకు కోర్టు మొగ్గుచూపింది. దీంతో కేట్ ఫొటోలను ప్రచురించిన క్లోజర్ మ్యాగజీన్ కు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై విచారణకు రంగం సిద్ధమైంది. ఏడాది జనవరి నుంచి విచారణ జరగనున్నట్లు ఫ్రెంచ్ న్యాయ శాఖ వర్గాలు మంగళవారం మీడియాకు తెలిపాయి. కేట్ మిడిల్టన్ ..భర్త ప్రిన్స్ విలియమ్స్‌తో కలిసి హాలిడే కోసం ఫ్రాన్స్‌లోని లా ఫ్రావిన్స్‌కు వెళ్లింది. అక్కడ మూడో మనిషి అడుగుపెట్టే అవకాశంలేని భవంతి పోర్టికోలో కేట్, విలియంలు చనువుగా ఉన్న సమయంలో క్లోజర్ మ్యాగజీన్ కు చెందిన జర్నలిస్టులు రహస్యంగా ఫొటోలు తీశారు. మరుసటి రోజే భారీ హెడ్డింగ్ లతో కేట్ టాప్ లెస్ ఫొటోలు కవర్ పేజీగా మ్యాగజీన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. 2012లో జరిగిన ఈ ఘటనపై బ్రిటన్ రాచకుటుంబం భగ్గునమండింది. ఫ్రెంచ్ ఉన్నతాధికారులతో మాట్లాడి సదరు పత్రికపై దావా వసింది. నాలుగేళ్ల విచారణలో.. మొత్తం ఆరుగురు నిందితులుగా తేలారు. మ్యాగజీన్ ఎడిటర్, ఓ సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టులపై వచ్చే ఏడాది నుంచి విచారణ జరగనుంది. కేట్ అత్త, దివంగత ప్రినెన్స్ డయానా మీడియా నుంచి తప్పించుకునే క్రమంలో మరణించారని కొందరి వాదన. ఫ్రాన్స్ లో కేట్, విలియమ్ విడిదిచేసిన ఫాంహౌస్ ఇదే