breaking news
five weeks
-
ఐదు వారాల్లో అతిపెద్ద పతనం
ముంబై: అంచనాలకనుగుణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నాలుగు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీగా నష్టపోయాయి. ఒకదశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివర్లో కొద్దిగా కోలుకుంది. లాభాల స్వీకరణ, ఫెడ్ వడ్డీరేట్ పెంపుభయం, భారత కరెన్సీ రూపాయి బలహీనత భారత ఈక్విటీ మార్కెట్లను నష్టాల బాట పట్టించాయి. 25,417 దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టంతో 24,966 దగ్గర, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 7,615దగ్గర ముగిసింది. దాదాపు అన్ని ప్రధాన రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. రియాల్టీ, ఫార్మా రంగాల్లోని నష్టాలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి. ఇటీవల లాభాలతో జోరుమీదున్న మార్కెట్లు , ఐదువారాల అతి భారీ పతనానికి చేరుకున్నాయి. మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టు గడువు గురువారంతో ముగియనుండటం కూడా మదుపర్లను ఆలోచనలో పడవేసింది. ఫలితంగా సెన్సెక్స్ పాతిక వేలకు పైన, నిఫ్టీ కీలక మద్దతుస్థాయి 7,700 పాయింట్లకుపైన నిలదొక్కుకోవడంలో విఫలమయ్యాయి. అటు వచ్చేనెల 5న ఆర్బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరపు తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షను ప్రకటించనుంది. రిజర్వు బ్యాంక్ పరపతి సమీక్ష, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తదితర విషయాలు పరిశీలించాల్సిన అంశాలని ఎనలిస్టుల అంచనా. రాబోయే రోజుట్లో దేశీయ మార్కెట్లు పుంజుకోవడానికి ముందు ఇది స్వల్ప విరామమని, కొంత కరెక్షన్ కు గురయ్యే అవకాశం ఉందని ఎస్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ తెలిపారు. ప్రపంచ మార్కెట్ల సంకేతాలతో భారతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయని చెప్పారు. -
ఓట్ల జాతర.. ఐదు వారాల్లో నాలుగు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓట్ల జాతర వస్తోంది. గతంలో ఎన్నడూ లేదని విధంగా ఐదు వారాల వ్యవధిలో నాలుగుసార్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నొటిఫికేషన్లు వెలువడ్డాయి. ఎన్నికల అనంతరం రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం పంచాయతీ రాజ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ మినహా 22 జిల్లాల ఓటర్లు రెండేసి ఓట్లు వేయాలి. ఇక మార్చి 30న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో శాసన సభ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.