breaking news
first chairperson
-
కొత్త శకానికి నాంది పలికిన ఇషా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమార్తె, వ్యాపారవేత్త ఇషా అంబానీ (Isha Ambani ) మరో ఘనతను సాధించారు సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025 ((Serpentine Summer Party 2025)కి తొలి భారతీయ చైర్‌పర్సన్‌గా ఎంపికై కళా ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికారు.సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 25వ వార్షికోత్సవం సందరబంగా తొలి బారతీయ చైర్‌గా ఇషా ఎంపికయ్యారు. కళలు, సంస్కృతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్లు, ప్రభావవంతమైన వ్యక్తులనుచేర్చుకోవడంలో మరింత మార్పువచ్చిందని నిరూపించిం దని, ప్రపంచ దేశాలకు, భారత్‌కు మధ్య ఇషా సాంస్కృతిక వారధి అంటూ ప్రశంసిస్తున్నారు ఫ్యాషన్ నిపుణులు. సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025లో ఇషా అంబానీ లక్ మెరీనా టబస్సమ్ రూపొందించిన 2019 నాటి వాలెంటినో, షాంపైన్ కలర్ పూసల దుస్తులను ధరించింది. ఉంగరాల జుట్టు, సహజమైన మేకప్ వేసుకుని, హీల్స్‌తో ఇషా ప్రతి ఫ్రేమ్‌లో అందమమైన లుక్‌లో అలరించింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా అంబానీ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఇషా తనదైన వ్యాపార నైపుణ్యాలతో వ్యాపారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ డియోర్‌కు ప్రపంచ రాయబారి , సోనమ్ కపూర్, సమ్మర్ పార్టీలో సందడి చేసింది. డియోర్ ఫాల్ 2025 కలెక్షన్ నుండి కిమోనో జాకెట్ ధరించింది అందర్నీ ఆకట్టుకుంది. జూన్ 24, 2025న లండన్‌లోని సెర్పెంటైన్ పెవిలియన్‌లో జరిగిన ఈ పార్టీలో ఈజా గొంజాలెజ్, అలిసియా వికాండర్, రెబెల్ విల్సన్, జార్జియా మే జాగర్, లేడీ అమేలియా స్పెన్సర్, లేడీ ఎలిజా స్పెన్సర్, లిల్లీ అలెన్ తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. -
కేర్ లో శొభా నాగిరెడ్డికి ప్రముఖుల నివాళి
-
ఆఖరి క్షణం వరకూ జనం కోసం... జనం నడుమ
-
శోభా నాగిరెడ్డి గతస్మృతులు
-
ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా ఛైర్మన్
శోభానాగిరెడ్డి .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా ఛైర్మన్‌గా వ్యవహరించారు. రాయలసీమలో బలమైన నేతగా ఎదిగిన శోభానాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 1968 నవంబర్ 16న పుట్టారు. ఇంటర్ వరకూ చదువుకున్నారు. తండ్రి మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి. శోభానాగిరెడ్డికి 1986లో భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 1996లో శోభా నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరో దఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున రాయలసీమ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మల్యే ఆమె మాత్రమే. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చిన ఆమె పార్టీలో చేరారు. అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి పార్టీలో కీలక బాధ్యతలు పోషించారు. ఇప్పటివరకూ శోభానాగిరెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. శోభానాగిరెడ్డి సోదరుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్సీ. శోభానాగిరెడ్డి కుటుంబం కర్నూలులో ఎంతో ప్రజాసేవ చేసింది. శోభానాగిరెడ్డి ఇక లేరన్న విషయం తెలియగానే కర్నూలు ప్రజలు దుఖఃసాగరంలో మునిగిపోయారు.