breaking news
Fake note printing machine
-
పోలీసు తండ్రికి తలవంపు తెచ్చిన యువకుడు
సాక్షి, న్యూఢిల్లీ: ఏఎస్సై కుమారుడు రూ.46 లక్షలు మోసపోయిన ఘటన ఢిల్లీలో చోటు చేసింది. పేరుకు పోలీసు కొడుకైనా సులువుగా సంపాదించడం కోసం అడ్డదారి వెతుక్కున్నాడు. నోట్ల ముద్రణా యంత్రం కొనుగోలు చేయడానికి అప్పు చేసి మరీ రూ.46 లక్షలు సేకరించాడు. తీరా డబ్బు చేతికందగానే యంత్రాన్ని అమ్ముతామన్న ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. ఇటీవలే ఏఎస్సై కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులు వెతుకులాట చేపట్టారు. వ్రిందావన్‌లో అతన్ని పోలీసులు గుర్తించగా, తన దగ్గరున్న డబ్బు తీసుకుని మోసం చేశారని పోలీసుల ముందు వాపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితులను ముంబైకి చెందిన విమల్ రాజేశ్, సూరజ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. వారిని బుధవారం ఢిల్లీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం పూర్తి దర్యాప్తు కోసం పోలీసు కస్టడీకి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితులు తమ దగ్గరున్న యంత్రంతో భారత కరెన్సీ నోట్లను ముద్రించవచ్చని చెప్పి ప్రజలను మోసం చేసేవారు. వీరి వెనక పెద్ద ముఠా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
నకిలీ నోట్ల ప్రింటింగ్ మిషన్ సీజ్
గుజరాత్ : పాత నోట్ల రద్దుతో కొత్త నోట్లను ముద్రిస్తూ కేటుగాళ్లు కలకలం సృష్టిస్తున్నారు. ఖేడా జిల్లాలో గుజరాత్ పోలీసులు జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో నకిలీ నోట్ల ప్రింటింగ్ మిషన్‌ను బయటపడింది. ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.12.45 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోగా, వాటిలో ఎక్కువగా కొత్త రూ.2000 నోట్లే ఉన్నాయి. రాజ్‌కోట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బోపాల్ ప్రాంతంలోని బంగళాలో జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో వీరు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి ఓ నకిలీ నోట్ ప్రింటింగ్ మిషన్‌ను, నోట్ల ముద్రణకు తీసుకొచ్చిన ఖాళీ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హనుమాన్మధీ సమీపంలో రెండు రోజుల క్రితం రూ.2000, రూ.500 నోట్లతో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల్లో ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టారు. దీనిలో ఒక మిషన్‌ను ఓ కారులోంచి రికవరీ చేయగా.. మరో మిషన్ బంగళాలో జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో పట్టుబడింది. ఈ గ్యాంగ్ అహ్మదాబాద్‌కు చెందిందని పోలీసులు చెప్పారు. వీరు కమిషన్‌పై నోట్లను మార్పిడి చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం వీరిపై దర్యాప్తు చేపడుతున్నామని, వీరి నుంచి నకిలీ నోట్ల ముఠాల సమాచారం సేకరిస్తామన్నారు. రికవరీకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు వెల్లడించామని పోలీసులు చెప్పారు.