breaking news
Ex union minister
-
బీజేపీకి షాక్.. మాజీ కేంద్ర మంత్రి రాజీనామా
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ మాజీ కేంద్రమంత్రి సూర్యకాంత పాటిల్ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు. ఆమె తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్ల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘గత పదేళ్లల్లో పార్టీలో చాలా విషయాలు నేర్చుకున్నా. పార్టీకి ఎప్పటికీ కృతజ్ఞురాలుగా ఉంటా’అని అన్నారు.2014లో సూర్యకాంతా పాటిల్ ఎన్సీపీ(శరద్ పవార్) నుంచి బీజేపీలో చేరారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆమె హింగోలి నియోజకవర్గం టికెట్‌ను ఆశించారు. అయితే సీట్ల కేటాయింపులో భాగంగా ఆ సీటు సీఎం ఎక్నాథ్ షిండే వర్గానికి దక్కింది. దీంతో సోషల్‌మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ లభించని ఆమెకు బీజేపీ.. హద్గావ్ హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల చీఫ్‌గా నియమించారు. ఆమె టికెట్ ఆశించిన హింగోలిలో ఏక్నాథ్ షిండే శివసేన వర్గం నిలబెట్టిన అభ్యర్థి శివసేన (ఉద్ధవ్) చేతిలో ఓటమిపాలయ్యారు. సూర్యకాంత్ పాటిల్ హింగోలి- నాందెడ్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. ఇక.. యూపీఏ ప్రభుత్వంలో రూరల్ డెవలప్మెంట్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి (రాష్ట్ర హోదా)గా పని చేశారు.ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. 48 సీట్లకు గాను ఎన్డీయే కూటమ 18 స్థానాలల్లో గెలిచింది. అందులో బీజేపీ -10, శివసేన (ఏక్నాథ్ షిండే- 7 స్థానాలు, ఎన్సీపీ( అజిత్ వర్గం)-1 సీట్లు గెలుచుకుంది. ఇక.. ఇండియా కూటమి 29 స్థానాలు విజయం సాధించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ-13, శివసేన( ఉద్ధవ్ వర్గం)-9, ఎన్సీపీ (శరద్ పవార్)-7 సీట్లు గెలుచుకుంది. -
కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేళ్లు జైలు
న్యూఢిల్లీ: అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పీ కే తుంగన్‌కు నాలుగున్నరేళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి అజయ్ కుమార్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. 68 ఏళ్ల తుంగన్‌కు జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న టలీ, సంగీత్‌కు చెరో మూడున్నరేళ్లు, మరో నిందితుడు మహేష్ మహేశ్వరికి రెండున్నరేళ్లు చొప్పున జైలు శిక్ష వేశారు. 1998లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయం మంత్రిగా ఉన్న తుంగన్ 2 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తుంగన్ దోషీగా తేలడంతో శిక్ష ఖరారు చేశారు.