breaking news
eveteasers
-
చైన్ స్నాచర్స్, ఈవ్ టీజర్లకు చెక్!..'శక్తి స్క్వాడ్' ఎంట్రీ
జార్ఖండ్: దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. ఇదే అదనుగా చేసుకుని ఈవ్ టీజర్లు, చైన్ స్నాచర్స్, పోకిరి వెధవలు రెచ్చిపోతుంటారు. అందుకోసం అని ఈ పండుగ సందర్భంగా మహిళల రక్షణ కోసం 'శక్తి స్క్వాడ్' ఏర్పాటు చేస్తున్నట్లు జంషేడ్‌పూర్ పోలీసు అధికారులు తెలిపారు. మహిళలను నిర్భయంగా పూజలు నిర్వహించునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా 'శక్తి స్క్వాడ్' పేరుతో మహిళా మొబైల్ పోలీసు బలగాలు నగరమంతా మోహరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ పోలీస్ ప్రభాత్ కుమార్, జిల్ మెజిస్ట్రేట్ నందకుమార్ శుక్రవారం మహిళల భద్రత కోసం లాంఛనంగా ఈ శక్తి స్క్వాడ్‌ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ శక్తి స్క్వాడ్ సుమారు 25 పింక్ స్కూటీలతో ఈ పండగ సీజన్లో నగరమంతా గస్తీ కాస్తారని అన్నారు. ముఖ్యంగా దుర్గా పూజ కోసం మహిళలు నిర్భయంగా దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో, వారి భద్రత కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఏదైన సమస్య తలెత్తితే పింక్ స్కూటీ పెట్రోలింగ్ సభ్యులు 100కి డయల్ చేయడం లేదా సీనియర్ అధికారులను సంప్రదిస్తారని తెలిపారు. అవసరమనుకుంటే మరింతమంది సిబ్బందిని రంగంలోకి దింపుతామని కూడా చెప్పారు. ఈ పండుగ సీజన్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేగాదు తాము సోష్ల్ మీడియాపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. ఎవరైన అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లు పెట్టడం లేదా ఫార్వార్డ్ చేయడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. (చదవండి: మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు) -
మంత్రి చెబితేనే కదలిక..
కుమార్తెలపై ఆకతాయిల వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన నిల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తండ్రి హోం మంత్రి ఆదేశాలతో కదిలిన పోలీసు యంత్రాంగం ఇద్దరు ఆడపిల్లలు ... అమలాపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు...వీరిని ఆకతాయి యువకులు వేధింపులకు పాల్పడు తున్నారు...అసభ్యంగా ప్రవర్తించడంతో తండ్రి మందలించాడు. తమ తప్పులను సరిదిద్దుకోని ఆ యువకులు తండ్రినే చంపేస్తామని బెదిరింపులకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోగా ఆ యువకుల బెదిరింపులు ఎక్కువవడంతో ఆత్మహత్యా యత్నానికి గత నెల 24న పాల్పడ్డాడు. అయినా రక్షక భటుల్లో కదలిక లేదు. చివరకు మంత్రి చిన రాజప్ప దృష్టికి వెళ్తేగానీ పోలీసుల్లో చలనం కలగలేదు. –అమలాపురం టౌన్ ఇంటరీ్మడియట్ చదువుతున్న తన ఇద్దరి ఆడపిల్లలపై అల్లరి మూకలు బెదిరింపులకు పాల్ప డి, వేధిస్తుం డడంతో ఆందో ళన చెందిన ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు కేసు పెట్టిన తర్వాత ఆ యువకుల వేధింపులు.. బెదిరిం పులు మరింత ఎక్కువయ్యాయి. కేసు ఉపసంహరించుకోకపోతే చంపేస్తామంటూ హెచ్చరించారు. సెల్‌ఫోన్ వాట్సాప్‌లో కత్తులు చూపిస్తూ ఉన్న ఫొటోలతో యువకులు బెదిరించడంతో మనస్తాపం చెందిన ఆ తండ్రి పురుగు ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాధిత కుటుం బం, బంధువులు హోం మంత్రి రాజప్ప ను ఆశ్రయించారు. ఆయన పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఎట్టకేలకు ఆ యువకులపై కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధమవుతున్నారు. అమలాపురం పట్టణంలోని గొల్లగూడేనికి చెందిన గుర్రం రాజా రమేష్ ఇద్దరి కుమార్తెలు ఇంటరీ్మడియట్ చదువుతున్నారు. కొందరు యువకుల వారిని వేధించి, బెదిరించడంతో రాజారమేష్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదులో జాప్యం, యువకులు బెదిరింపులకు భయపడి మనస్తాపంతో ఆత్యాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఐసీయూలో వైద్యం పొందుతున్నాడు. బాధితుడు రాజా రమేష్, అతడి భార్య, బంధువుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రాజా రమేష్ తన ఇద్దరు ఆడ పిల్లలు పట్టణంలోని ఓ కళాళాలలో ఇంటరీ్మడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం చదువుతున్నారు. అందులో ఓ అమ్మాయికి, కిమ్స్ ఆస్పత్రి సమీపంలో గల అబ్బిరెడ్డి కాలనీకి చెందిన ఆ యువకుడి మధ్య ప్రేమ నడుస్తోంది. విషయం తెలిసిన రాజారమేష్ తన కుమార్తెలను మందలించి, ఆ యువకుడిని హెచ్చరించారు. కక్ష పెంచుకున్న ఆ యువకుడు తన ఇద్దరి స్నేహితులతో రాజా రమేష్‌కు తరచూ ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. డీఎస్పీ లంక అంకయ్యను రమేష్ స్వయంగా కలసి తన బాధను వెళ్లగక్కుకున్నారు. ఆయన రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయమన్నారు. గత నెల 21న పోలీసు స్టేషన్లో ఆ ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేశాడు.ఇంతలో ఆ కాలనీ పెద్దలు తాము రాజీ చేస్తామంటూ ముందుకు రావటంతో పోలీసులు ఈ కేసును అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఈ లోగా ఆ ముగ్గురు యువకుల నుంచి వేధింపులు, బెదిరిం పులు మరింత ఎక్కువయ్యాయి. ‘మీ తండ్రిని చంపేస్తామం టూ’ తరచూ సిమ్‌లు మార్చుతూ కత్తులు చూపిస్తున్న ఫొటోలను వాట్సాప్ ద్వారా ఈ అమ్మాయిలకు పంపించా రు. దీంతో మనస్థాపానికి గురైన రమేష్ గత నెల 24న పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కదిలిన పోలీసులు బాధిత కుటుంబీకులు, బంధువులు అమలాపురంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఆదివారం కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. దీంతో రాజప్ప పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేసు నమోదు చేసి ఆ కుర్రాళ్లను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కేసు నమోదు చేసి యువకులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై తాలూకా ఎస్సై గజేంద్రకుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ‘ బాధిత కుటుంబీకులు తన వద్దకు వచ్చారని, యువకులను పిలిచి హెచ్చరించి వదిలేయండి, కేసు వద్దు అన్నట్టుగా చెప్పారని వివరించారు. కిమ్స్ నుంచి ఎమ్మెల్సీ పత్రం వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు తమకు ఆలస్యంగా అందిందని చెప్పారు. ఇదే విషయాన్ని కిమ్స్ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ కేసులను పర్యవేక్షించే అధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించినప్పుడు రాజారమేష్‌కు ఆస్పత్రిలో వైద్యం మొదలు పెట్టిన రోజే ( గత నెల 24న) ఎమ్మెల్సీ పత్రాన్ని తాలూకా పోలీసు స్టేష¯ŒSకు పంపించామని చెప్పడ కొసమెరుపు. -
నలుగురు ఆకతాయిల అరెస్ట్
హైదరాబాద్ క్రైం: హైదనాబాద్ ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డులో గురువారం రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ప్రాంతంలోకి వచ్చిన ప్రేమ జంటలను వేధిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.