breaking news
Equestrian Dressage
-
Asian Games 2023: బంగారంలాంటి కూతురు
దివ్యాకృతి సింగ్, అనూష్, హృదయ్, సుదీప్తిలతో కూడిన ఇండియన్ టీమ్ ఈక్వెస్ట్రియన్ డ్రస్సెజ్ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఈ బృందంలో ఒకరైన దివ్యాకృతిసింగ్కు తండ్రి విక్రమ్ రాథోడ్ అన్నిరకాలుగా అండగా నిలిచాడు. ఆమె ట్రైనింగ్ కోసం ఇంటిని కూడా అమ్మాడు. ఈ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాలేజీలో చదువుకునే రోజుల్లో పోటీ పడేందుకు గుర్రం లేకపోవడంతో రెండు సంవత్సరాలు పోటీకి దూరంగా ఉంది దివ్యాకృతి. ఆసియా క్రీడల్లో పాల్గొనాలనే కూతురు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జర్మనీలో గుర్రాన్ని కొన్నాడు. గుర్రం కొనడం నుంచి స్పాన్సరర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం వరకు విక్రమ్ రాథోడ్ పడని కష్టం లేదు. ఏమైతేనేం, ఆయన శ్రమ ఫలించింది. కుమార్తె బంగారు కల నెరవేరింది. -
Asian Games: చరిత్ర సృష్టించిన అనూష్.. తొలి పతకం
Asian Games 2023- Anush Agarwalla: ఆసియా క్రీడల చరిత్రలో భారత క్రీడాకారుడు అనూష్ అగర్వాలా చరిత్ర సృష్టించాడు. టీఎల్ ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్ వ్యక్తిగత విభాగంలో దేశానికి తొలి పతకం అందించాడు. చైనాలోని హోంగ్జూ వేదికగా గురువారం నాటి ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. తద్వారా 24 ఏళ్ల అనూష్ అగర్వాలా, అతడి గుర్రం ఎట్రోతో పాటు రికార్డులకెక్కాడు. కోల్‌కతాకు చెందిన అనూష్.. తన అశ్వానికి అన్ని రకాలుగా తర్ఫీదునిచ్చాడు. ఈ క్రమంలో డ్రెసాజ్ ఈవెంట్ ఫైనల్లో అనూష్ సూచనల(మ్యూజిక్)కు తగినట్లుగా ఎట్రో పర్ఫెక్ట్ సింక్‌లో ప్రదర్శన ఇచ్చింది. చక్కటి సమన్వయం.. పతకం ఖాయం దీంతో ఇంప్రెస్ అయిన న్యాయనిర్ణేతలు అనూష్, ఎట్రోల మధ్య సమన్వయం చక్కగా ఉండటంతో పతకం ఖరారు చేశారు. ఈ క్రమంలో 73.030 స్కోరు చేసిన అనూష్ అగర్వాలాకు కాంస్యం లభించింది. కాగా డ్రెసాజ్ ఫైనల్లో బ్లాక్‌బస్టర్ జయహో పాటను కూడా ప్లే చేయడం గమనార్హం. ఇక ఈ ఈవెంట్లో మలేషియాకు చెందిన బిన్ మహ్మద్ స్వర్ణం గెలవగా.. హాంకాంగ్ ప్లేయర్ జాక్వెలిన్ వింగ్ యింగ్ రజతం సాధించింది. కాగా 19వ ఆసియా క్రీడల్లో ఇప్పటికే ఈక్వెస్ట్రియన్ డ్రెసాజ్ టీమ్ ఈవెంట్లో భారత్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. డ్రెసాజ్ అంటే ఏంటి? డ్రెసాజ్ అనే ఫ్రెంచ్ పదానికి ఇంగ్లిష్‌లో ట్రెయినింగ్ అని అర్థం. ఇందులో రైడర్ తన గుర్రానికి ఏవిధమైన శిక్షణ ఇచ్చాడు.. ఇద్దరి మధ్య కో ఆర్డినేషన్ ఎలా ఉందన్న అంశాలను గమనిస్తారు. రైడర్ ఇచ్చే సూచనలకు అనుగుణంగా అశ్వం ఎంత మేర నడుచుకుంటుందో చూసి అందుకు తగ్గట్లుగా పాయింట్లు కేటాయిస్తారు. కాగా ఈక్వెస్ట్రియన్‌లో ఎండ్యూరన్స్, ఈవెంటింగ్, పెగ్గింగ్,డ్రెసాజ్, జంపింగ్ వంటి విభాగాలు ఉంటాయి. చదవండి: WC: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా.. కెప్టెన్‌గా మార్కరమ్