breaking news
edapadi Palani Swamy
-
శశికళ వర్గానికి తమిళ సీఎం స్ట్రాంగ్ కౌంటర్
చెన్నె: జైలు శిక్ష అనుభవించి చెన్నె చేరుకున్న శశికళపై తమిళనాడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టింది. నిన్న ఆస్తుల జప్తు చేయగా తాజాగా నేడు ముఖ్యమంత్రి నేరుగా ఆమెపై, ఆమె వర్గానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దివంగత నాయకురాలు జయలలితకు అసలైన వారసులం తామేనని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. అన్నాడీఎంకేని నాశనం చేయడానికి విష శక్తులు కుట్రలు పన్నుతున్నాయంటూ వి.కె.శశికళపై పరోక్షంగా విమర్శించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పళని మాట్లాడారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన వాళ్లు పార్టీని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి పార్టీ నుంచి తొలగించామని, మళ్లీ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని స్పష్టం చేశారు. ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడినా.. వారి ఆటలు సాగవని పేర్కొన్నారు. టీటీవీ దినకరన్ వర్గం తలకిందులుగా తపస్సు చేసినా వారు అనుకున్నది ఎన్నటికీ జరగదని ప్రకటించారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తమకే ఉన్నాయని సీఎం పళని స్వామి తెలిపారు. తమిళనాడులో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శశికళ రాకతో రాజకీయం రాజకీయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే తన పార్టీనేనని, రెండాకుల గుర్తు కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈసీ దక్షిణాది పర్యటన: 15 తర్వాత మినీ సమరం? -
హైదరాబాద్‌కు దినకరన్ ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అన్నాడీఎంకే దినకరన్ వర్గ 19 మంది ఎమ్మెల్యేలు తమ మకాంను పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు మారుస్తున్నారు. పళని వర్గ ప్రలోభాలకు గురికాకుండా దినకరన్ తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టులో ఉంచి కాపాడుతున్నారు. శని లేదా ఆదివారం వారందరినీ దినకరన్ హైదరాబాద్‌కు తరలించనున్నారు. అనర్హత వేటుపై షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు మంగళవారం 19 మంది శాసనసభ్యులు స్పీకర్‌ను విడివిడిగా కలుస్తారని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ తెలిపారు. శశికళ కుటుంబంపై దివంగత సీఎం జయలలిత చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోను మంత్రి ఉదయకుమార్ రిలీజ్చేయగా, ప్రతిగా దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మరో వీడియో రిలీజ్చేశారు. పెరియకుళం ఎంపీగా దినకరన్ పోటీచేసినపుడు అతణ్ని, శశికళను జయ పొగిడిన దృశ్యం ఈ వీడియోలో ఉంది. -
చర్చలకు స్వస్తి
► ఎంజీఆర్ ఉత్సవాలపై దృష్టి ► శశికళ ఫొటోలు తొలగించాలని డిమాండ్ ► అన్నాడీంకే విలీనం ఆగిపోయినట్లే సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏకం అవుతున్నామంటూ ఇటీవల ఎగిరెగిరి పడిన అన్నాడీఎంకే నేతలు చతికిలపడ్డారు. విలీన చర్చలకు స్వస్థి పలికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలపై దృష్టి పెట్టారు. జయ మరణం తరువాత రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకే, ఆర్కేనగర్ ఉప ఎన్నికల అనుభవాలతో తిరిగి ఏకం కావాలని నిర్ణయించుకున్నారు. రాజీపై పన్నీర్ వర్గం డిమాండ్లు అనేక పిల్లిమొగ్గలు వేసిన తరువాత తమ ప్రథమ శత్రువైన శశికళ, ఆమె కుటుంబీకులను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించడం, జయలలిత మరణంపై సీబీఐ విచారణను కోరడం అనే డిమాండ్ల వద్ద ఆగింది. శశికళ, దినకరన్ ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శులుంటూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ప్రమాణ పత్రాలను వెనక్కు తీసుకోవాలని ఎడపాడి వర్గంపై పన్నీర్ వర్గం పట్టుపడుతోంది. పన్నీర్ సీఎంగా ఉన్నపుడు జయ మరణంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదని ఎడపాడి వర్గం వాదన లేవనెత్తింది. శశికళ అంశం ఎన్నికల కమిషన్ విచారణలో ఉన్నందున తాము హామీ ఇవ్వలేమని ఎడపాడి వర్గం దాటవేయడంతో చర్చలకు పెద్ద విఘాతం ఏర్పడింది. విలీన చర్చలు ఇక ఇప్పట్లో ఉండవనేలా అ«ధికార వర్గం వ్యవహరిస్తోంది. చర్చల ప్రయత్నాలకు తెరదించి జూన్ 8, 9 తేదీల్లో ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాలపై దృష్టి మరల్చారు. పత్రాలను సమర్పించిన పన్నీరు వర్గం: రెండాకుల చిహ్నం పొందడంలో జూన్ 16వ తేదీలోగా అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఇటీవల ఆదేశించింది. ఈ పత్రాల సమర్పణకు మరింత సమయం ఉన్నందున పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం, ఎంజీ ఆర్ శత జయంతి ఏర్పాట్లపై ఎడపాడి వర్గాలు దృష్టి పెట్టాయి. అయితే పన్నీర్‌సెల్వం వర్గాలు ఎన్నికల కమిషన్ కోరిన అదనపు డాక్యుమెంట్లను మంగళవారం సమర్పించారు. మరో బాంబు పేల్చిన మదుసూధనన్: విలీన చర్చలపై ఇప్పటికే ప్రతిష్టంభన నెలకొనగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోని శశికళ ఫొటోలను తొలగించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన మధుసూదనన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసి మరో బాంబు పేల్చారు. జయలలిత మరణం వల్ల ప్రజల్లో ఏర్పడిన ఆవేదన ఇంకా తొలగిపోలేదని ఆయన అన్నారు. జయలలిత మరణంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయి న్యాయం దక్కాల్సి ఉందని చెప్పారు. అమ్మ మరణం తరువాత కనుమరుగు కాకుండా అన్నాడీఎంకేను కాపాడుకోవాలనే ప్రజల గళాన్ని విశ్వాసపాత్రులుగా తాము వినిపిస్తున్నామని తెలిపారు. పార్టీని కాపాడుకునే వరకు తమ ధర్మయుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. పార్టీ పవిత్రను కాపాడాలంటే కార్యాలయంలోని శశికళ ఫొటోలను తొలగించక తప్పదని ఆయన చెప్పారు. లక్ష్యసాధనకు వేర్వేరు మార్గాలు: ఎంజీ రామచంద్రన్ నెలకొల్పిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ విధించిన నిషేధాన్ని తొలగింపజేసుకుని పార్టీని కాపాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇరువర్గాలు విలీన చర్చకు సిద్ధమయ్యారు. ఇరువురం రాజీపడకుంటే రెండాకు చిహ్నం ఎవ్వరికీ దక్కకుండా పోతుందని, ఈ పరిణామంతో ప్రజల నుంచి ఆగ్రహానికి గురికాకతప్పదని ఎడపాడి, పన్నీర్ వర్గాలు భయపడ్డాయి. ఏదో ఒక కోణంలో రాజీ కుదుర్చుకోవాలని వారం రోజులుగా ప్రయత్నాలు చేశాయి. విలీన చర్యలకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలు వేసుకున్నాయి. అయితే విలీన చర్చల సారాంశానికి విరుద్ధంగా పరస్పర ఆరోపణలు దిగడం ద్వారా ఇరువర్గాలు చెడగొట్టుకున్నాయి. ఎన్నికల కమిషన్‌కు అదనపు ఆధారపత్రాలను సమర్పించేందుకు ఇంకా కొంత సమయం ఉందని ఎడపాడి వర్గం భావించడం, పన్నీర్‌వర్గం మంగళవారమే సమర్పించేయడం ద్వారా చర్చలకు తావులేకుండా విలీనానికి ఇక శాశ్వతంగా తెరదించారు.