breaking news
EC answers
-
ఇంటర్నెట్ ద్వారా ప్రవాస భారతీయుల ఓటింగ్
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు ఇక ఇంటర్నెట్ ద్వారా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. అయితే అది ఈ ఎన్నికలకు మాత్రం కాదు. ఈ అంశానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) సుప్రీంకోర్టు ధర్మాసానికి నివేదించింది. అయితే ప్రస్తుత ఎన్నికలకు మాత్రం ఇది కుదరదని ఇసి అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ ఆలోచన అమలులోకి వస్తే విదేశాలలో ఉండే భారతీయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. -
అడగండి చెబుతా.. ఈసీ సమాధానాలు
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి. - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా election@sakshi.comకు మెయిల్చెయ్యండి. ఎస్ఐ పోస్టుల ఎంపిక జాబితా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఎన్నికల సంఘం అనుమతి కావాలని ఆపారు. ఫలితాల కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకుని ఫలితాల వెల్లడికి ఆదేశాలు ఇవ్వగలరు. - ఆర్.విజయ్‌కుమార్ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఈ అంశం గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాం. ప్రస్తుతం ఈ విషయం వారి పరిశీలనలో ఉంది. మేం విజయవాడ 55వ వార్డులో ఉంటున్నాం. మా ఏరియా అజిత్‌సింగ్‌నగర్ అయితే ఓటర్ ఐడీకార్డులో కనక దుర్గానగర్ అని ప్రింట్ అయ్యింది. మా ఓట్లు 52వ వార్డుకు వెళ్లాయి. దీంతో వార్డే కాకుండా నియోజకవర్గమూ మారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? - పలపర్తి శేషయ్య మీరు నివాసం ఉంటున్న చోట మీ ఓట్లు లేకపోతే ఏప్రిల్ 9లోపు కొత్త దరఖాస్తు ఇచ్చి జాబితాలో మీ పేర్లు చేర్పించుకోవచ్చు. నేను పూణెలో ఉంటున్నాను. ఈ ఎన్నికల్లో నేను రాష్ట్రంలో ఓటు వేయాలంటే ఏం చేయాలి? - రాం్రపసాద్ మీరు ఏ ఊరిలో ఓటు వేయాలనుకుంటే ఆ ఊరిలోనే నివాసం ఉండాలి. పూణెలో నివాసం ఉంటూ ఇక్కడ ఓటు వేయడం కుదరదు. మీరు పూణెలోనే ఓటరుగా నమోదు చేయించుకోని అక్కడే ఓటు వేయాలి.