breaking news
Eastern Railway
-
ఈస్టర్న్ రైల్వేలో 3366 అప్రెంటిస్ ఖాళీలు
కోల్‌కతాలోని ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ).. వివిధ డివిజన్లు, వర్క్‌షాపుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 3366 ► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, లైన్మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్(డీజిల్) తదితరాలు. ► అర్హత: ట్రేడులను అనుసరించి ఎనిమిదో తరగతి, కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్సీవీటీ జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ► వయసు: 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021 ► వెబ్సైట్: https://er.indianrailways.gov.in ఎన్‌పీసీఐఎల్‌లో 75 ట్రేడ్ అప్రెంటిస్‌లు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్), కైగా సైట్(కర్ణాటక).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం ఖాళీల సంఖ్య: 75 ► ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మెన్, సర్వేయర్. ► శిక్షణా వ్యవధి: ఏడాది. ► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021 ► వెబ్సైట్: www.npcil.nic.in ఇస్రో, ఐఐఆర్ఎస్లో 12 అప్రెంటిస్‌లు డెహ్రాడూన్‌లోని ఇస్రో–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్).. వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 12 ► ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటిస్–10, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–02. ► డిప్లొమా అప్రెంటిస్: విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్సెస్ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి. స్టయిపెండ్ నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: జియోఇన్ఫర్మేటిక్స్, లైబ్రరీ సైన్స్. అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ/బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.10.2021 ► వెబ్సైట్: www.iirs.gov.in -
50 కోట్లివ్వకుంటే సీఎంను చంపేస్తాం..
కోల్కత్తా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తామంటూ తూర్పు రైల్వేకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఉన్నపలంగా రూ.50 కోట్లు సమకూర్చాలని లేదంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తామని, హౌరా రైల్వేస్టేషన్‌ను పేల్చుతామని తీవ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ నుంచి తూర్పు రైల్వే కార్యాలయానికి ఈ లేఖ అందింది. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చెందిన ఓ తీవ్రవాది చేతివ్రాతతో ఈ బెదిరింపు లేఖ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చింది. ఆ లేఖలో తమ గ్రూప్ కోసం రూ.50 కోట్లను తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ అందించాలని, ఒకవేళ తమ డిమాండ్ నెరవేర్చకుంటే హౌరా రైల్వేస్టేషన్‌ను ఐఈడీతో పేల్చి, లక్షలాది మంది ప్రయాణికులను చంపేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మమతా బెనర్జీని కూడా తమ ఆర్గనైజేషన్ హతమారుస్తుందని బెదిరించారు. ఈ లేఖను మాజీ దూరదర్శన్ ఉద్యోగి ఎస్సీ దాస్ రాసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదులకు తన ఫ్లాట్స్‌లో ఆయన ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దూరదర్శన్‌లో ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఫ్లాట్‌ను ఆయన కొనుగోలు చేశారని సమాచారం. ఆ లేఖను విచారణ కోసం పోలీసులకు అందించామని డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ బద్రినారాయణ్ చెప్పారు. ఆ లేఖలో రూ.50కోట్లు చెల్లించాలని రాశారని, ఫోన్ నెంబర్ కూడా రాశారని ఆయన తెలిపారు. అయితే ఆ లేఖలో రాసిన ఫోన్ నెంబర్, అడ్రస్ ఎక్కడా లేదని తూర్పు రైల్వే సీపీఆర్ఓ ఆర్యన్ మహాపత్రా చెప్పారు.