breaking news
Duty-free shops
-
అదానీ వన్‌తో మొబిక్విక్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: విమాన టిక్కెట్లు, సుంకాల రహిత ఉత్పత్తులపై ప్రత్యేక సేవలు అందించడానికి అదానీ గ్రూప్ ట్రావెల్ బుకింగ్ యాప్– అదానీ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ తెలిపింది. మొబిక్విక్ వాలెట్‌తో విమాన బుకింగ్‌లు, డ్యూటీ–ఫ్రీ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తామని కంపెనీ ప్రకటన పేర్కొంది. ‘‘అదానీ వన్ యాప్‌తో భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. సులభమైన చెల్లింపులు, ఇబ్బందులు లేని ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని ఈ భాగస్వామ్యం ద్వారా అందిస్తాము. ప్రమాణానికి సిద్ధమవుతున్నందున కస్టమర్‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సేవలు అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం’’ అని మొబిక్విక్ పేర్కొంది. ఆర్థిక పరిమితుల వల్ల ఎవరి ప్రణాళికలకు ఎప్పుడూ ఆటంకం కలిగించకుండా చూసుకోవడానికి తాము అంకితభావంతో ఉన్నామని మొబిక్విక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు. మొబిక్విక్ వాలెట్‌తో చెల్లింపు చేసినప్పుడు అదానీ వన్‌లో విమాన బుకింగ్‌లపై రూ. 500 తగ్గింపు ఉంటుందని, అలాగే అదానీ వన్ ద్వారా డ్యూటీ–ఫ్రీ ప్రొడక్టులపై రూ. 250 ఫ్లాట్ తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘‘మా సూపర్ యాప్‌లో మోబిక్విక్ సులభతరమైన ఫైనాన్స్ సొల్యూషన్లను ఏకీకృతం చేస్తున్నందున మేము సంతోíÙస్తున్నాము. భారతదేశం అంతటా ట్రావెల్ బుకింగ్‌లు, గ్లోబల్ బ్రాండ్లను సరళమైన ధరలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించడమే మా సమిష్టి లక్ష్యం’’ అని అదానీ వన్ ప్రతినిధి మరో ప్రకటనలో తెలిపారు. -
డ్యూటీ ఫ్రీ షాప్స్‌లో ధరలను రూపాయల్లో డిస్ప్లే చేయాలి
సీబీఈసీ ఆదేశాలు న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో ఉండే డ్యూటీ ఫ్రీ షాప్స్(డీఎఫ్ఎస్) వస్తువుల ధరలను రూపాయల్లో డిస్ప్లే చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ఆదేశాలు జారీ చేసింది. కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్‌ను కూడా డిస్ప్లే చేయాలని పేర్కొంది. డ్యూటీ ఫ్రీ షాప్స్ రూపాయల్లో ధరలను, భారత్‌లో తయారైన వస్తువులను డిస్ప్లే చేయడం లేదన్న ఫిర్యాదులు పెరగడంతో సీబీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు డ్యూటీ ఫ్రీ షాపుల్లో రూ.25 వేల వరకూ వస్తువులను కొనుగోలు చేయొచ్చు.