breaking news
Durai Sudhakar
-
ఉత్తమిగా మారుతున్న జూలి
తమిళసినిమా: నటి జూలి ఉత్తమిగా మారుతోందట. అదేంటి ఉత్తమిగా మారడం ఏమిటి? అనే ప్రశ్న తలెత్తుతోందా? అయితే ఆ కథేంటో చూద్దాం రండి. ఏ రంగంలోనైనా, ఏ విషయానికైనా ప్రచారం చాలా ముఖ్యం. అలాంటి ప్రచారాన్ని కొందరు సొంతంగా ఖర్చు చేసి పొందుతుంటారు. మరికొందరికి అదే వెతుక్కుంటూ వస్తుంది. అలా మంచి పాపులారిటీని బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తెచ్చిపెట్టింది. అందులో ఒకరు నటి జూలి. అందులో పాల్గొన్న వారిలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈ బ్యూటీ అంతకు ముందే జల్లికట్టు పోరాటంలో పాల్గొని వెలుగులోకి వచ్చింది. ఆపై ఒక టీవీ చానల్లో యాంకర్‌గా పనిచేశారు. ఇవన్నీ కలిపి జూలీని సినిమా హీరోయిన్ను చేసేశాయి. అలా బిగ్‌బాస్ షో తరువాత హీరోయిన్గా అవకాశం అందుకున్న ఓవియ తరువాత ఆ లిస్ట్‌లో నటి జూలి చేరింది. త్వరలో ఈ అమ్మడు నటించనున్న చిత్రం ప్రారంభం కానుంది. ఆమెతో పాటు ప్రధాన పాత్రలో పబ్లిక్స్టార్ దురై సుధాకర్ నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు జూలీయుమ్ 4 పేరుమ్ చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి ఉత్తమి అనే టైటిల్‌ను నిర్ణయించారట. ఈ చిత్ర కథ జూలీ పాత్ర చుట్టూ తిరుగుతుందట. తొలి చిత్రంతోనే శక్తివంతమైన పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందంటోంది నటి జూలి. కాగా కే 7 ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇవి ప్రస్తుతానికి ఉత్తమి చిత్ర వివరాలు. త్వరలో పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
వివేకంతో ఢీ అంటున్న తప్పాట్టం
తమిళసినిమా: అజిత్ హీరో చిత్రం వస్తుందంటే ఒక మోస్తరు చిత్రాలను కూడా ఆ చిత్ర విడుదల దరిదాపుల్లో విడుదల చేయడానికి ముందుకురారు. అలాంటిది నూతన దర్శకుడు, నవ నిర్మాత కలయికలో కొత్త నటీనటులతో నిర్మించిన చిత్రాన్ని అజిత్ చిత్రానికి పోటీగా విడుదల చేసి పెద్ద సాహసమే చేశారు. ఆ చిత్రమే తప్పాట్టం. గత గురువారం అజిత్ చిత్రం వివేకంతో పాటు విడుదలైన తప్పాట్టం చిత్రానికి మంచి విమర్శలు, ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పాట్టం చిత్రం గురించి ఒక లుక్కేస్తే, పబ్లిక్ స్టార్ దురై సుధాకర్ హీరోగా నటించగా ఆయనకు జంటగా డోనా నాయకిగా నటించారు. కోవై జయకుమార్, పేనామణి, కూత్తుపట్టరై తులసి, పేరాసిౖయె లక్ష్మి, రూఫి, పొల్లాచ్చి ఎంకే.రాజా ప్రధాన పాత్రల్లో నటించారు. నవ దర్శకుడు ముజిపూర్ రహ్మాన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఆదంబావా నిర్మించారు. 1984లో ఒక కుగ్రామంలో జరిగే కథగా తెరకెక్కించిన తప్పాట్టం చిత్రాన్ని దర్శకుడు చాలా సహజత్వంతో రూపొందించారు. చావులకు డప్పులు వాయించే ఒక యువకుడికి, అతడిని పిచ్చిగా ప్రేమించే అక్క కూతురికి మధ్య ప్రేమ,పెళ్లి, ఈ గ్రామంలో ఒక మోతు బారు రైతు ఇలా సాగుతుంది కథ. కంటపడిన యువతుల్ని కాంక్షించే ఆ మోతు బారి రైతు బారిన కథానాయకి పడుతుంది.ఆమె అతని నుంచి తప్పించుకోవడంతో పాటు అతని చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ పగతో రగిలే ఆ మోతుబారి రైతు ఏం చేశాడు, అందుకు చిత్ర కథానాయకుడి రియాక్షన్ ఏమిటీ? తదితర ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం తప్పాట్టం. చాలా చిన్న చిత్రంగా నిర్మించిన తప్పాట్టంకు మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.