breaking news
Dr. Balaji nukasani
-
తొలుత ఉత్కంఠ.. ఆపై ఉత్సాహం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా, మెజార్టీ ఎంపీపీ స్థానాల్లో పాగా వేసింది. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభ సమయంలో ఒకింత ఉత్కంఠ నెలకొంది. లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఫలితాలు వెలువడడంతో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తొలుత కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నేతలు పురపాలక ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతున్నాయని బాకాఊదారు. ఆ తరువాత జిల్లా వ్యాప్తంగా వస్తున్న ఫలితాలు వైఎస్ఆర్ సీపీవైపు ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం నెలకొంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి జెడ్పీటీసీ అభ్యర్థుల విజయాలు ప్రకటించడం మొదలైనప్పటి నుంచి ఫలితాలు వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ మొదలైంది. ఎంపీటీసీల ఫలితాలు తొలుత రెండు వైఎస్ఆర్, టీడీపీ అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లుగా ఉండడంతో మారుమూల గ్రామాల్లో సైతం ఉత్కంఠకు దారి తీసింది. ఆ తరువాత ఎంపీటీసీ స్థానాలను వైఎస్ఆర్ సీపీ సాధించడంతో ఆందోళనకు తెరపడింది. 30కి పైగా మండలాలను దక్కించుకుంది. బాలాజీ గెలుపుతో... వైఎస్ఆర్ సీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టరు నూకసాని బాలాజీ పుల్లలచెరువులో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన స్థానాలు వైఎస్ఆర్ సీపీ గెలుచుకోవడంతో నేతలు, కార్యకర్తల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. మున్సిపోల్స్‌కు భిన్నంగా ఫలితాలను చూసిన టీడీపీ శ్రేణులకు సార్వత్రిక ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందోననే అలజడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో మరింత జోష్ గ్రామీణ ఓటర్లు పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గుచూపారు. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ షర్మిల సుడిగాలి పర్యటన, ఆ తరువాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో పర్యటన పార్టీ శ్రేణుల్లో కొండంత ఉత్సాహాన్ని నింపాయి. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యాయని, ఆ వర్గాలన్నీ వైఎస్ఆర్ సీపీకి అండగా నిలిచాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
ప్రజా చైతన్యం
సాక్షి, ఒంగోలు: ‘మీ రాజన్న కూతుర్ని.. జగనన్న చెల్లెల్ని.. మీ ముందుకు వచ్చాను. మీకు చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తూ కోరుతున్నాను. రాష్ట్రం దశాదిశ మారే ఎన్నికల పోలింగ్ రోజు మరి కొద్ది రోజుల్లో వచ్చేస్తోంది. ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం మన తలరాతలు మార్చేస్తుంది. ఒక్క అవకాశం ఇవ్వండి.. జగనన్న జీవితాంతం మీ సేవకి అంకితమౌతాడు.’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన షర్మిల రోడ్‌షోలు, బహిరంగ సభలకు భారీ స్పందన లభించింది. ప్రజా చైతన్యం ప్రస్ఫుటమైంది. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సెంటర్ బహిరంగ సభకు జనం పోటెత్తగా ..దర్శి గడియార స్తంభం సెంటర్ నాలుగు రోడ్ల కూడలి జనసంద్రమైంది. పర్చూరు నియోజకవర్గంలో మార్టూరులో బహిరంగ సభ విజయవంతం అయింది. జనభేరి ఆద్యంతం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ప్రచార రథంపై ఆయా నియోజకవర్గాల లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, డాక్టర్ వరికూటి అమృతపాణి, పాలపర్తి డేవిడ్‌రాజు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి భరత్, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు ప్రసంగించారు. షర్మిల ప్రసంగిస్తూ విశ్వసనీయతకు మారు పేరైన వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మైనార్టీల స్వాగతోత్సాహం.. ‘అమ్మా.. మీ నాయన మాకెంతో మేలు చేశాడమ్మా.. ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ తెచ్చిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని కడవరకు దేవుడుగా కొలుస్తామమ్మా...’అంటూ యర్రగొండపాలెంలో ముస్లిం మైనారిటీ మహిళలు షర్మిలతో మాట్లాడారు. నియోజకవర్గంలోని కొమరోలులో బస కేంద్రం నుంచి బయలుదేరిన షర్మిలకు జనం బ్రహ్మరథం పట్టారు. బేస్తవారిపేట, కంభం, మార్కాపురం బైపాస్ రోడ్డు, తోకపల్లి జంక్షన్, కుంట, గురిజేపల్లి, గ్రామాల మీదుగా రోడ్‌షో జరిగింది. యర్రగొండపాలెం సెంటర్లో బహిరంగ సభకు జనం భారీగా తరలి వచ్చారు. ప్రధానంగా షర్మిల ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగటం.. ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. అనంతరం కొత్తగోళ్ల విడిపి, అయ్యబొట్లపల్లి, త్రిపురాంతకం, రామసముద్రం, మిట్టపాలెం, మేడపి, వినుకొండ అడ్డరోడ్డు మీదుగా కురిచేడు చేరుకుని అక్కడ నుంచి దర్శికి వచ్చారు. పల్లె పల్లెన ప్రజలు రోడ్ల వెంట నిలుచుని షర్మిలకు చేతులెత్తి జై కొట్టగా.. ఆమె చిరునవ్వుతో అభివాదం చేశారు.