డీపీఎస్ ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు
కొరాపుట్ : దమనజొడి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) విద్యార్థినులపై ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న జిల్లా శిశు సంరక్షణ అధికారిణి రాజశ్రీ దాస్ విద్యార్ధిల నుంచి ఫిర్యాదు అందుకొన్న ఆమె కొరాపుట్ బ్లాకు విద్యాధికారిణి అర్పిత ప్రధాన్‌తో పాటు దమనజొడి ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు వెళ్లి విచారణ జరిపారు.
ఉపాధ్యాయులు సిద్ధార్ధ శంకర్ చౌదరి, డి.పి.పండ,ఆశిశ్ శత్పతి, నబకిషోర్ పండ, ప్రశాంత నాయక్, బిశ్వనాథ్ బారిక్, ఎస్.కె.ఎమ్ యొహలు ఉద్ధేశ్యపూర్వకంగా తమ శరీరాలను స్పశిస్తూ శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని 8,9 తరగతి విద్యార్థినులు 15 మంది ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఉపాధ్యాయుల చర్యలు కూడా లైంగిక వేధింపులు కిందకు వస్తాయన్నారు. ఈ విషయాన్ని కలెక్టరుకు తెలియజేశామన్నారు.
దీనిపై స్పందించిన కలెక్టర్ జయకుమార్ ఆరోపణలు ఎదుర్కొంతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. కలెక్టరు ఆదేశాల మేర దమనజొడి పోలీసు స్టేషన్లో శనివారం పోలీసు కేసు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. పూర్తి విచారణ తరువాత ఉపాధ్యాయులపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా శిశు సంరక్షణ అధికారిణి రాజశ్రీ దాస్ చెప్పారు.