breaking news
domestic servant
-
పనిమనిషిపై ఆర్మీ మేజర్ లైంగిక దాడి
సాక్షి,న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఆర్మీ మేజర్ తన ఇంట్లో పనిచేసే మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీ మేజర్ నివాసంలోని సర్వెంట్ క్వార్టర్లో బాధిత మహిళ దంపతులు పనిచేస్తుంటారు. పనిమనిషిపై కన్నేసిన ఆర్మీ మేజర్ జూన్ 12న బాధితురాలి భర్తను బయటకు పంపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలిని గ్రామానికి పంపి ఆమె భర్త ఒక్కరే మేజర్ ఇంట్లో పనిచేస్తుండగా అనూహ్యంగా అతను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. అయితే తన భర్తది ఆత్మహత్య కాదని బాధితురాలు ఆరోపించారు. తన భర్త మృతిపై అనుమానాలున్నాయని చెబుతున్నారు. ఆర్మీ మేజర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పనిమనిషిపై కాల్పులు
ముజఫర్ నగర్: నాలుగు ఇళ్లలో పనిచేసుకుని జీవనం వెళ్లదీసుకుంటున్న ఓ మహిళను అతి దారుణంగా చంపేసిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ముజఫర్ నగర్ లోని షాబుద్దీన్ పూర్ గ్రామంలో బాధితురాలు పాచి పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు లోపలికి చొచ్చుకొచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమె బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినేష్ అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరిపై ఆయన ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.