breaking news
districtwise
-
రాష్ట్రంలో 2.99 కోట్ల ఓటర్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,99,32,943 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,50,41,943 మంది పురుష, 1,48,89,410 మహిళ, 1590 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. కొత్తగా 1,44,855 మంది ఓటర్లుగా నమోదయ్యారు. 12,639 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2020లో భాగంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని ఓటర్లందరికీ ప్రామాణిక ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా జారీ చేయనున్నారు. ఓటర్లకు జీవితాంతం ఒకే విశిష్ట సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 10 ఆంగ్ల అక్షరాలు, అంకెల (ఆల్ఫా న్యూమరిక్) కలయికతో కొత్త నమూనాలో ప్రామాణిక ఓటరు గుర్తింపు (స్టాండర్డ్ ఎపిక్) కార్డులు జారీ చేస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లినా.. వారి విశిష్ట ఓటరు సంఖ్య మారదు. చిరునామా మారితే అదే విశిష్ట సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డు జారీ చేయనున్నారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చౌడువాడ విద్యార్థులు
కె.కోటపాడు : విశాఖపట్నంలో ఈనెల 24న జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో చౌడువాడ శ్రీ సాయి విద్యావిహార్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. 8 నుంచి 11 ఏళ్ల బాలుర విభాగం పోటీల్లో పాఠశాలకు చెందిన కొత్తూరు శివసాయిరాజ్కుమార్, బాలికల విభాగంలో పిల్లా నాగపూర్ణిమాలు 4వ స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రస్ధాయి యోగా చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ దాట్ల శివాజీబాబు, ప్రిన్సిపాల్ దివి అప్పలకొండ(దత్తు) అభినందించారు. చోడవరం నుంచి హరికిరణ్ : చోడవరం : యోగా రాష్ట్ర స్థాయి పోటీలకు చోడవరం ఉషోదయ విద్యార్థి హరికిరణ్ అర్హత సాధించాడు. ఈ నెల 24న విశాఖపట్నంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో సీనియర్ విభాగంలో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. హరికిరణ్‌ను పాఠశాల యాజమాన్యం అభినందించింది.