breaking news
Distinguished Public Service award
-
పోలీసు సేవలకు సలాం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఏపీ పోలీసులకు మంగళవారం విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినో త్సవంలో సీఎం జగన్ పతకాలు అందజేశారు. 2021, 2022, 2023కు సంబంధించి 65 మంది పో లీసులు కేంద్రం పరిధిలో ప్రకటించిన ప్రెసిడెంట్ పో లీస్ మెడల్(పీపీఎం), పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్విస్(పీఎం), పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీ ఎంజీ), అసాధారణ్ ఆసూచన కుశ లత పదక్‌తో పా టు ముఖ్యమంత్రి శౌర్య పతకాలను అందుకున్నారు. పీపీఎం 2021–22: భావనాసక్సేనా (జాయింట్ సె క్రటరీ, విదేశాంగ శాఖ, న్యూఢిల్లీ), వెంకటరామిరెడ్డి, (ఐజీపీ–శిక్షణ), పి.సీతారాం(గ్రేహౌండ్స్ క మాండెంట్), ఎన్.సుధాకర్‌రెడ్డి (ఎస్డీపీఓ, పలమనేరు) పీఎం 2021–22: ఎస్వీ రాజశేఖరబాబు (డీఐజీ, లా అండ్ ఆర్డర్), ఎం.రవీంద్రనాథ్‌బాబు(ఏఐజీ, లా అండ్ ఆర్డర్), కె.రఘువీర్‌రెడ్డి(ఎస్పీ, నంద్యాల), కేఎస్వీ సుబ్బారెడ్డి(కమాండెంట్, 6 బెటాలియన్), కె.నవీన్‌కుమార్(ఏఎస్పీ, గ్రేహౌండ్స్), కె.సుబ్రహ్మ ణ్యం (ఏడీసీపీ, విశాఖ), వి.వి.నాయుడు(ఏసీపీ దిశ, విజయవాడ), సీహెచ్.రవికాంత్ (ఏసీపీ, ఎస్బీ విజ యవాడ), జి.రవికుమార్(డీఎస్పీ, సీఐడీ), కె.వి.రా జారావు, (డీఎస్పీ పీటీఓ), జె.శ్రీనివాసులురెడ్డి (ఎస్ డీపీఓ, నెల్లూరు), వి.శ్రీరాంబాబు(డీఎస్పీ, సీఐడీ), కె.విజయపాల్ (ఎస్డీపీఓ, రాజమండ్రి), సి.శ్రీనివాసరావు (డీఎస్పీ దిశ, ప్రకాశం), జి.వీరరాఘవరెడ్డి (ఎస్డీపీఓ, మార్కాపురం), వై.రవీంద్రరెడ్డి (ఏఆర్ డీఎస్పీ, తిరుపతి), పి.వి.హనుమంతు(అసిస్టెంట్ క మాండెంట్, 6వ బెటాలియన్), బి.విజయ్‌కుమార్ (అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్), బి.గుణరా ము (సీఐ, విజయవాడ), ఎం.కోటేశ్వరరావు (ఎస్ఐ, శ్రీకాకుళం), జి.కృష్ణారావు(ఎస్ఐ, విజయవాడ), ఆర్.రామనాథం, (ఆర్ఎస్ఐ, విజయవాడ), ఇ.శివశంకర్‌రెడ్డి (ఆర్ఎస్ఐ, 2వ బెటాలియన్), ఎం.వెంకటేశ్వర్లు(ఏఆర్ఎస్ఐ, నెల్లూరు), ఎస్.సింహాచలం (ఏఆర్ఎస్ఐ, 3వ బెటాలియన్), టి.నరేంద్రకుమార్ (ఏఎస్ఐ, గుంటూరు), పి.భాస్కర్(ఏఎస్ఐ, కడప), ఎన్.శ్రీనివాస్(ఏఎస్ఐ, కొవ్వూరు), ఎస్.వీరాంజనేయులు(ఏఎస్ఐ, విజయవాడ). పీఎంజీ 2021: ఆర్.రాజశేఖర్ (డీఏసీ), సీహెచ్.సాయిగణేశ్ (డీఏసీ), కె.పాపినాయుడు (ఎస్ఐ, అనకాపల్లి), డి.మబాషా (ఏఏసీ), టి.కేశవరావు(హెచ్‌సీ, ఎస్ఐబీ), ఎం.మునేశ్వరరావు (గ్రేహౌండ్స్ ఎస్సీ), గ్రేహౌండ్స్ జేసీల్లో ఎస్.బుచ్చిరాజు, జి.హరిబాబు, బి.చక్రధర్, ఎం.నాని, పి.అనిల్ కుమార్. అసాధారణ్ ఆసూచన కుశలత పదక్ 2022: సి.శ్రీకాంత్ (ఐజీపీ, సీఐడీ), ఎ.బాబ్జీ (ఎస్ఐబీ, ఎస్పీ), ఇ.జి.అశోక్ కుమార్(ఏఎస్పీ, ఎస్ఐబీ), ఎ.వెంకటరావు(డీఎస్పీ, తీవ్రవాద విభాగం, విశాఖ), కె.నిరీక్షణరావు(ఎస్ఐ, ఎస్ఐబీ). ముఖ్యమంత్రి శౌర్య పతకం(2023): బి.సుధాకర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్), కె.విజయశేఖర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐబీ), కె.హరీష్ (ఆర్ఎస్ఐ), పి. రమేశ్(ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ), టి.రవికుమార్(ఎస్ఐ, గ్రేహౌండ్స్), గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఐలు టి.సత్యనారా యణ, పి.సతీశ్‌కుమార్, సీహెచ్.శివ, గ్రేహౌండ్స్ ఎ స్పీలు షామలరావు, రవి, నాగరాజు, గ్రేహౌండ్స్ జే సీలు ఎస్కే కరీం బాషా, బి.వాసుదేవ రెడ్డి, సయ్యద్ హబీబుల్లా, ఎస్.సిద్దయ్య, ఎం.గౌరునాయుడు. -
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి డల్లాస్ లో సన్మానం
టెక్సాస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డిని ప్రవాస తెలుగు రాష్ట్రాల వాసులు ఘనంగా సన్మానించారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా సన్మానించేందుకు తెలుగు వారు ఓ కార్యక్రమం నిర్వహించారు. 2009లో నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన నీటిపారుదల, ఆరోగ్యశాఖలను నిర్వర్తించారు. నిజామాబాద్ మాజీ ఎంపీ డా.ఆత్మ చరణ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి సేవలను కొనియాడారు. అజయ్ రెడ్డి ఏలేటి, రఘువీర్ బండారు, ఇతర ముఖ్యనేతలు ఈ కారక్యమంలో పాల్గొన్నారు. సోషల్ యాక్టివిస్ట్ గానూ మంచి గుర్తింపున్న నేత సుదర్శన్ రెడ్డిని సుదర్శనచక్రంతో పోల్చారు. నీటిపారుదల మంత్రిగా సేవలకుగానూ ఆయనను అపర భగీరథుడిగా పిలుస్తారు. సమాజ సేవ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదర్ రెడ్డి కొర్సపాటి, ప్రమోద్ పొద్దుటూరి, రావ్ కల్వల, రామ్ కాసర్ల, ప్రసాద్ తోటకూర, శ్రీనివాస్ గుర్రం, సతీష్ రెడ్డి, సుబ్బు జొన్నలగడ్డ, మహేందర్ కమిరెడ్డి, రాజ్ గోందీ, ప్రవీణ్ బిల్లా, ఎన్ఎంఎస్ రెడ్డి, అల్ల శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ తెలుగు, అశోక్ కొండల, మహేశ్ ఆదిబట్లలు పాల్గొన్నారు. ప్రజా సేవలో సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను సన్మానించినట్టు రామ్ అన్నాడి పేర్కొన్నారు.