breaking news
disrupts road
-
రాత్రి నుంచి ముంబైని వదలని వర్షం.. నేడు కూడా..
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారత వాతావరణశాఖ అధికారులు ఆగస్టు 18 వరకు ముంబై కి ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. #WATCH | Mumbai witnesses heavy rain as IMD sounds 'yellow' alert for the city today pic.twitter.com/qxjwO0QxaI— ANI (@ANI) August 14, 2025ఈరోజు(గురువారం)కూడా ముంబైని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాల్ఘర్, థానే, ముంబై, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. #WATCH | Mumbai witnesses heavy rain as IMD sounds 'yellow' alert for the city today pic.twitter.com/qxjwO0QxaI— ANI (@ANI) August 14, 2025 -
మహారాష్ట్రను ముంచెత్తిన భారీ వర్షాలు
ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైల్వే ట్రాక్‌లపైకి నీరు చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మలవలి-కామసెత్ స్టేషన్ల మధ్య, లోన్ వాలా- కర్జత్ స్టేషన్ల మధ్య ట్రాక్ పై నీరు చేరడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిపివేశారు. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రధాన రహదారులపై భారీగా వాన నీరు నిలిచిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇళ్లకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు.