breaking news
disciplinary committee
-
కాసేపట్లో క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా మురళి
-
కొండా మురళి ఎపిసోడ్లో ట్విస్ట్
ఓరుగల్లు కాంగ్రెస్ వర్గపోరు పంచాయితీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. వరంగల్ జిల్లా నేతలపైనే ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయ్యింది.హైదరాబాద్, సాక్షి: కొండా మురళి వ్యాఖ్యల వ్యవహారంపై శనివారం గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ అయ్యింది. కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని.. ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన రివర్స్ కౌంటర్‌కు దిగారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతలపైనే కమిటీకి ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిపై ఆయన క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. అందులో.. స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను ఇబ్బంది పెడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను కడియం కష్టపెడుతున్నారని, అలాగే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రేవూరి సహకరిస్తున్నారని.. అక్రమ క్రషర్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. వీళ్లిద్దరితో పాటు నాయిని రాజేందర్‌రెడ్డి పేరును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణా కమిటీని కోరారు. ఈ నివేదికను కమిటీ స్వీకరించింది.క్రమశిక్షణ కమిటీతో కొండా మురళీ..కమిటీ ముందుకు రావాలని ఎవరూ నన్ను పిలవలేదు. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చా. భూపాలపల్లి నుంచి నేనే పోటీ చేయాలనుకున్నా. వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ పోటీ చేసింది కాబట్టి నేను తప్పకున్నా. మరో పార్టీ నుంచి గండ్ర వచ్చినా ఆయన మద్దతు ఇచ్చి ప్రచారం చేశా. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. కొండా సురేఖ-సీతక్కలు కలిసే పని చేసుకుంటున్నారు. సీతక్కతో మాకు పంచాయితీ లేదు. వాళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారు. కడియం కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. పరకాల పూర్తిగా మాదే. రేవూరికి నిస్వార్ధంగా సహాయం చేశాం. అతనిప్పుడు మాపై గుడుపూటానీ రాజకీయాలు చేస్తున్నారు. మా మద్దతుతోనే రేవూరి గెలిచారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తున్నారు. నాయిని తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నాడు. వేం నరేందర్ రెడ్డి సీటు ఎగిరిపోవడానికి నేనే కారణమని నాపై కోపంగా ఉన్నట్టున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసి వచ్చాను. పార్టీలోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లను తీసుకోవచ్చా. కొంతంది లాగా పార్టీ మారి పదవిని ఎంజాయ్ చేయడం లేదు. ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని నేను అని కమిటీకి నిచ్చిన లేఖలో పేర్కొన్నారాయన. వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేశాయి. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు కొండా మురళి సుమారు 60 వాహనాల్లో.. భారీ అనుచరగణంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు బయల్దేరినట్లు వచ్చారు. లోపలికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్నెవరూ వివరణ ఇవ్వాలని కోరలేదు. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చా’’ అని అన్నారు. తన వివరణకు సంబంధించిన ఆరు పేజీల పత్రాన్ని ఆయన సమర్పించినట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో కొండా మురళి పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యాలు చేశారన్నది అభియోగం. ఆ వ్యాఖ్యలతో ఓరుగల్లు కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ కోరింది. అలాగే.. ఆయన తన కుమార్తెను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తానని ప్రకటించడమే కాకుండా, కొందరు సీనియర్ నేతలపై విమర్శలు చేయడం పార్టీ లోపలే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రధానంగా.. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి వంటి నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు కలిసి అత్యవసరంగా సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని AICC తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె జోక్యంతో ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. -
ఏపీ కాంగ్రెస్‌లో ముదురుతున్న వార్
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్‌లో వార్ ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. షర్మిళ, మాణిక్యం ఠాకూర్ అవినీతికి పాల్పడ్డారని పద్మశ్రీ, రాకేష్‌రెడ్డి ఆరోపించారు. వాళ్లు చేసిన ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.నోటిసులకు సమాధానం ఇచ్చిన పద్మశ్రీ, రాకేష్ రెడ్డి.. 20వ తేదీన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు షర్మిళ ప్రకటించారని తెలిపారు. అన్ని కమిటీలు రద్దు చేసినప్పుడు క్రమ శిక్షణ కమిటీ కూడా రద్దవుతుందని పద్మశ్రీ, రాకేష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న విధంగా వివరణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్న ఎవరికి ఇవ్వాలో అయోమయంలో ఉన్నామని నేతలు అంటున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానాలు ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. -
హస్తంలో అన్ని వేళ్లు ఒకేలా ఉంటాయా.. కాంగ్రెస్‌లో కూడా అంతే సుమీ..
టీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ తప్పిందా.. పెద్ద నేతలను ఒకలా చిన్న నేతలను మరోలా చూస్తోందా? స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కమిటీ ఇతర నేతల జోక్యంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందా? టీ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కమిటీ గురించి ఏం చర్చ జరుగుతోంది? అబ్బే.. వాళ్లు మనవాళ్లు పార్టీ నేతలు క్రమశిక్షణగా, పార్టీ లైన్ దాటకుండా చూడాల్సిన బాధ్యత క్రమశిక్షణ కమిటీకి ఉంటుంది. చిన్న స్థాయి నేత నుంచి సీనియర్ మోస్ట్ నేతల వరకు ఎవరు పార్టీ గీత దాటినా చర్యలు తీసుకునే అధికారం క్రమశిక్షణ కమిటీకి ఉంటుంది. పార్టీలో అంత పవర్ ఉన్న కమిటీ క్రమశిక్షణ కమిటీ. కానీ ఈ మధ్య ఆ కమిటీ తీసుకున్న క్రమశిక్షణ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. కొందరికి అనుకూలంగా, మరి కొందరికి వ్యతిరేకంగా క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిట్టినా.. కొట్టినా మనోడేలే.! పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ వేటు వేసింది. బీజేపీ పెద్దలను కలవడం, రేవంత్ రెడ్డిని విమర్శించడం బహిష్కరణకు కారణాలుగా చూపించింది క్రమశిక్షణ కమిటీ. అయితే, ఇదే సమయంలో మీడియా ఎదుట రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇంఛార్జి ఠాగూర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా క్రమశిక్షణ కమిటీ కనీసం షోకాజ్ నోటీసులు జారీ చేయలేకపోయింది. జూమ్ బరాబర్.. జూమ్ నోటీస్ ఇక ఇదే సమయంలో పార్టీ జూమ్ మీటింగ్‌కు హాజరుకాలేదని 11 మంది అధికార ప్రతినిధులకు నోటీసులు పంపించారు. వివరణ ఇవ్వకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తమ లాంటి చిన్న స్థాయి నేతలకు నోటీసులు ఇస్తున్న కమిటీ పీసీసీని, పార్టీని బాహాటంగా తిడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీ పెద్దలను కలిసారూ కదా అలాంటప్పుడు కోమటిరెడ్డికి కేవలం నోటీసులు ఇచ్చి.. అదే మర్రి శశిధర్ రెడ్డికి కనీసం నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ సస్పెండ్ చేయడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా చూస్తారంతే.! ఇక కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ కమిటీ ఉందా అనే అనుమానం కలుగుతుంది. దాసోజు శ్రవణ్, రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు రోజుల కొద్దీ రేవంత్ రెడ్డిని విమర్శించినా కనీసం నోటీసులు ఇవ్వలేని దుస్థితి. పార్టీ నుంచి వారంతట వారు పోయాక నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం క్రమశిక్షణ కమిటీ పనైపోయిందన్న చర్చ జరుగుతోంది. ఇక కమిటీలోనూ బోలెడు లుకలుకలు ఉన్నాయనేది మర్రి సస్పెన్షన్ తర్వాత బయట పడింది. మర్రి సస్పెన్షన్ ను క్రమశిక్షణ కమిటీ సభ్యుడు శ్యామ్ మోహన్ తప్పు పట్టారు. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోకుండా సీనియర్ నేతను సస్పెండ్ చేయడం సరికాదన్నారు శ్యామ్ మోహన్. మొత్తానికి పార్టీ నేతలను క్రమశిక్షణలో ఉంచాల్సిన కమిటీ.. తానే క్రమశిక్షణ తప్పిందన్న అభియోగాలు ఎదుర్కొంటోంది. సొంతంగా వ్యవహరించాల్సి కమిటీ .. కొందరి నేతల కనుసన్నల్లోనే పనిచేయడం వల్ల ఇలాంటి దుస్థితి వచ్చిందంటుంన్నారు గాంధీభవన్ నేతలు. -
పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదు
సాక్షి హైదరాబాద్: తనపై క్రమశిక్షణా చర్య తీసుకుంటూ పంపించిన నోటీస్‌లో పేర్కొన్నట్లు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ సమాధానమిచ్చారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించనందున తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. సోమవారం ఈ మేరకు పార్టీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ సభ్యకార్యదర్శి ఓం పాథక్‌కు లేఖ రాశారు. ఒక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆగస్ట్ 23న రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. 10 రోజుల్లో నోటీస్‌కు సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీ ఆదేశించింది. పీడీయాక్ట్పై అరెస్టయి జైలులో ఉన్నందున సోమవారం నోటీస్‌కు సమాధానమిస్తూ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే.. ‘మతప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్న ఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాపై.. ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం సాగిస్తున్న అరాచకాలనే ప్రశ్నించాను తప్ప ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా విమర్శలు చేయలేదు. నేను పంపిన వీడియోలోనూ ఏ మతాన్ని కించపరచలేదు. పార్టీ ఎమ్మెల్యేగా 8 ఏళ్ల కాలంలో ఏనాడూ పార్టీ లైన్ దాటి ప్రవర్తించలేదు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నా. మునావర్ ఫారుఖీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్లను కించపరచలేదు’అని ఈ లేఖలో పేర్కొన్నారు. -
బీజేపీ క్రమశిక్షణ కమిటీకి రాజాసింగ్ భార్య లేఖ.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు మహ్మద్ ప్రవక్త మీద రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ సస్పెండ్ చేసింది. అదే సమయంలో రాజాసింగ్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో సమాధానం చెప్పాలని బీజేపీ క్రమశిక్షణ కమిటీ కోరింది. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా, రాజాసింగ్ జైలులో ఉండటంతో ఆయన క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వలేకపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజాసింగ్ భార్య.. బీజేపీ క్రమశిక్షణ కమిటీకి గురువారం మెయిల్ పంపించారు. ఈ సందర్భంగా లేఖలో సమాధానం చెప్పేందుకు మరికొంత సమయం ఇవ్వాలని రాజాసింగ్ కుటుంబ సభ్యులు కమిటీని కోరినట్టు తెలుస్తోంది. కాగా, క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన 10 రోజుల గడువు రేపటితో(శుక్రవారం) ముగియనుంది. దీంతో, రాజాసింగ్ భార్య.. ఇలా మరికొంత సమయం కావాలని కోరారు. ఇది కూడా చదవండి: రాజాసింగ్‌ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా? -
ఫస్ట్ రేవంత్ రెడ్డిని పిలవండి.. తర్వాత నేనొస్తా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి రాసిన లేఖపై మీడియా ముఖంగానే వివరణ ఇచ్చానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఆ లేఖ ఎలా లీక్ అయిందో తనకు తెలియదని.. ఇది మీడియాలో కూడా వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘిచినట్టు భావించి.. తర్వలోనే కమిటీ ముందుకు పిలుస్తామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లేఖపై ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, లేదా మీరు (చిన్నారెడ్డి) మీడియాలో వచ్చిన వార్తలను చూసి సుమోటోగా కంప్లైంట్ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ విషయం ఎందుకు మీడియా ముందు చెప్పలేదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లి పెద్దపల్లి అభ్యర్థిని పార్టీలో చర్చించకుండా, పార్టీలైన్ దాటి డిక్లేర్ చేస్తే పీసీసీపై క్రమశిక్షణ కమిటీలోకి రాదా? అని నిలదీశారు. సొంత ఉమ్మడి జిలాల్లో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు చెప్పకుండా కార్యక్రమం డిక్లేర్ చేసివస్తున్నానని ప్రకటిస్తే క్రమశిక్షణ కమిటలీ రాదా? అని ప్రశ్నించారు. వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి, తాను భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్లు వార్తలో చూశాను. దీనిపై తనకు సమాచారం ఇవ్వలేదు మరి అది క్రమశిక్షణ కమిటీకి రాదా? అని అన్నారు. క్రమశిక్షణ పాటించని పీసీసీని క్రమశిక్షణలో తీసుకోవాలని చిన్నారెడ్డికి తెలీదా? అని సూటిగా ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ ముందు ఫస్ట్ రేవంత్‌రెడ్డిని పిలిచి తర్వాత తనను పిలిస్తే..తప్పకుండా హాజరవుతానని అన్నారు. చిన్నారెడ్డి మీడియా ముందు వచ్చి మాట్లాడారు కాబట్టే.. తాను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి మీడియా ద్వారా జవాబు ఇస్తున్నానని చెప్పారు. -
కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డికి షోకాజ్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కౌశిక్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు నేపథ్యంలో 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ సంఘం నోటీస్‌లో పేర్కొంది. గతంలో కౌశిక్‌రెడ్డిని హెచ్చరించినా ఆయన తీరులో మార్పు రాలేదని క్రమశిక్షణ సంఘం తెలిపింది. కాగా, హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి వాయిస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తనకే టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందని ఫోన్ల ద్వారా కౌశిక్‌రెడ్డి స్థానిక నాయకుల వద్ద చెప్తున్నట్టు వైరలైన ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. రానున్న ఉపఎన్నికల్లో తానే టీఆర్ఎస్ అభ్యర్థినంటూ కౌశిక్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మాదన్నపేట్‌కు చెందిన యువకుడితో కౌశిక్‌రెడ్డి ఫోన్లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. -
వైఎస్సార్సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నియమించారు. ఎనిమిది మందితో కూడిన ఈ సంఘంలో వేణుంబాక విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు, మేరుగ నాగార్జున, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉంటారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటన తెలిపింది.